![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/tirumala_1734187676732_1739032470447.jpg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/tirumala_1734187676732_1739032470447.jpg)
Tirumala Darshan Tickets : ఫిబ్రవరి 9న తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం టోకెన్లు జారీ-ఎక్కడంటే?
Tirumala Darshan Tickets : తిరుపతి స్థానిక భక్తుల కోటా టికెట్లను ఈ నెల 9న విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఫిబ్రవరి 9న తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో, తిరుమలలోని బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో దర్శన టికెట్లు జారీ చేస్తారు.
Tirumala Darshan Tickets : తిరుపతి స్థానిక భక్తుల కోటా టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 11న స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఈ తేదీ దర్శనం టికెట్లను ఫిబ్రవరి 9న తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో, తిరుమలలోని బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో జారీ చేస్తారు. ఫిబ్రవరి 4న రథసప్తమిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ స్థానికుల దర్శనాన్ని నెలలో మొదటి మంగళవారం నుంచి ఫిబ్రవరి నెలలో రెండో మంగళవారానికి వారానికి మార్చిన విషయం తెలిసిందే.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
ఫిబ్రవరి 19 నుంచి 28వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి శేషాచల పర్వతమూలంలో వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి 28వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఫిబ్రవరి 18న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 15న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
- 19-02-2025 : ఉదయం – ధ్వజారోహణం, రాత్రి – హంస వాహనం
- 20-02-2025 : ఉదయం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం
- 21-02-2025 : ఉదయం – భూత వాహనం, రాత్రి – సింహ వాహనం
- 22-02-2025 : ఉదయం – మకర వాహనం, రాత్రి – శేష వాహనం
- 23-02-2025 : ఉదయం – తిరుచ్చి ఉత్సవం, రాత్రి – అధికారనంది వాహనం
- 24-02-2025 : ఉదయం – వ్యాఘ్ర వాహనం , రాత్రి – గజ వాహనం
- 25-02-2025 : ఉదయం – కల్పవృక్ష వాహనం , రాత్రి – అశ్వ వాహనం
- 26-02-2025 : ఉదయం – రథోత్సవం, రాత్రి – నందివాహనం
- 27-02-2025 : ఉదయం – పురుషామృగవాహనం , సాయంత్రం – కల్యాణోత్సవం, రాత్రి – తిరుచ్చి ఉత్సవం
- 28-02-2025 : ఉదయం – త్రిశూలస్నానం , సాయంత్రం – ధ్వజావరోహణం, రాత్రి – రావణాసుర వాహనం
ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.
సంబంధిత కథనం
టాపిక్