Anshu: 15 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చా, 24 ఏళ్లకు పెళ్లి చేసుకున్నా.. ఇంటిపేరు ఎక్కడ వాడలేదు: మన్మథుడు హీరోయిన్ అన్షు

Best Web Hosting Provider In India 2024

Anshu: 15 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చా, 24 ఏళ్లకు పెళ్లి చేసుకున్నా.. ఇంటిపేరు ఎక్కడ వాడలేదు: మన్మథుడు హీరోయిన్ అన్షు

Sanjiv Kumar HT Telugu
Feb 09, 2025 06:31 AM IST

Manmadhudu Heroine Anshu On Film Career And Marriage In Mazaka: నాగార్జున మన్మథుడు సినిమాతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ అన్షు ఇప్పుడు మజాకా మూవీతో 20 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ అన్షు తన పెళ్లి, ఇంటిపేరుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

15 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చా, 24 ఏళ్లకు పెళ్లి చేసుకున్నా.. ఇంటిపేరు ఎక్కడ వాడలేదు: మన్మథుడు హీరోయిన్ అన్షు
15 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చా, 24 ఏళ్లకు పెళ్లి చేసుకున్నా.. ఇంటిపేరు ఎక్కడ వాడలేదు: మన్మథుడు హీరోయిన్ అన్షు

Heroine Anshu About Her Marriage And Mazaka Movie: పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

yearly horoscope entry point

మజాకాతో రీ ఎంట్రీ

ఈ మాస్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా వస్తోన్న మజాకా మూవీలో రీతు వర్మ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, నాగార్జున మన్మథుడు సినిమాతో ఎంతో ఫేమ్ తెచ్చుకున్న అన్షు, నటుడు రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన మజాకా టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ హైలీ ఎంటర్‌టైనింగ్ మూవీ మజాకా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అన్షు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

మీ పూర్తి పేరు అన్షు అంబానీ నా ?

అంబానీ అనేది చాలా పాపులర్ సర్ నేమ్. అయితే నా ఇంటిపేరు అది కాదు. అసలు అంబానీ అనే పేరు నాకు ఎలా వచ్చిందో కూడా తెలీదు. నా వికిపీడియాలో కూడా అదే పేరు ఉంది. అక్కడ ఎలా మార్చాలో కూడా తెలీదు. మీలాంటి వారు ఎవరైనా హెల్ప్ చేస్తే బావుంటుంది (నవ్వుతూ). నా పేరు అన్షు. నాకు ఇంటి పేరు ఉంది. కానీ, ఆ పేరు ఎక్కడ వాడలేదు. నేను సచిన్ సాగర్‌ని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు అన్షు సాగర్. అయితే సింపుల్ అండ్ స్వీట్‌గా అన్షు అని పిలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను.

రెండు మూడు సినిమాల తర్వాత మళ్లీ తెరపై కనిపించకపోవడానికి కారణం?

-నేను 15 ఏళ్లకే ఇండస్ట్రీలో వచ్చేశాను. అప్పటికి అంత ఎమోషనల్ మెచ్యురిటీ లేదు. ఒకవేళ మన్మథుడు నా 25 ఏళ్ల వయసులో చేసి ఉంటే సినిమాల్లోనే కొనసాగడానికి అలోచించేదాన్ని. అప్పటికి నా చదువు కూడా పూర్తి కాలేదు. లండన్ వెళ్లిపోయాను. కాలేజ్ పూర్తి చేసి మాస్టర్స్ చేశాను. సైకాలజిస్ట్ అయ్యాను. సొంతగా క్లీనిక్ పెట్టాను. 24 ఏళ్లకి పెళ్లి చేసుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. ఇది బ్యూటీఫుల్ జర్నీ.

-మళ్లీ సినిమాల్లో చేయాలని ఉండేది. మన్మథుడు రీ రిలీజ్‌కి వచ్చిన రెస్పాన్స్ నాకు చాలా గొప్ప కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇంట్లో వారి సపోర్ట్ తో మళ్లీ ఈ సినిమాతో తెరపైకి రావడం ఆనందంగా ఉంది. ఇది గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఇప్పుడు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ క్యారెక్టర్స్ కోసం సంప్రదిస్తున్నారు. ఇందులో చాలా మదర్ రోల్స్ ఉన్నాయి. అయితే కేవలం ఒకే తరహ పాత్రలు చేయాలని లేదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత దర్శక నిర్మాతలు మరిన్ని వైవిధ్యమైన పాత్రల కోసం అప్రోచ్ అవుతారనే నమ్మకం ఉంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024