



Best Web Hosting Provider In India 2024
Happy Life: మీ జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో తెలుసుకోండి! నిపుణులు చెప్తున్న సలహా ఇదే
Happy Life: ఎంత సంపాదించినా, ఎంత ఖర్చు పెట్టినా మనమంతా తపన పడేది సంతోషం కోసమే. అలాంటి సంతోషం డబ్బుల్లో ఉందంటే, ధనవంతులు మాత్రమే సంతోషంగా ఉంటారు. కానీ, డబ్బుల్లేని వారు కూడా సంతోషంగా ఉంటున్నాంటే, వారు పాటిస్తున్న అలవాట్లే దానికి కారణం. అవేంటో తెలుసా.. ?
సంతోషంగా ఉండటానికి ఒక ఫార్ములా లేదా వరం దొరికితే ఎంత బాగుంటుందో కదా! జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎప్పుడూ సంతోషంతోనే ఉంటాం. అయితే, అవన్నీ కలల్లోనే సాధ్యపడతాయని కొట్టిపారేయవద్దు. ఎటువంటి ఫార్ములా, వరాలు లేకున్నా సంతోషకరంగా జీవించేందుకు కొన్ని టిప్స్ పాటించండి. సంతోషకరమైన జీవితం గడుపుతున్న వారి నుండి మీరు కొన్ని విషయాలు నేర్చుకోండి.

ప్రపంచవ్యాప్తంగా సంతోషంగా ఉన్న వారిలో కొన్ని విషయాలు చాలా కామన్‌గా ఉంటాయట. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనలు ఇదే విషయాన్ని నిర్దారిస్తున్నాయి. సంతోషంగా ఉన్న వారిలో చాలా సాధారణంగా ఉండే అలవాట్లను మనం కూడా అలవరచుకుంటే, మరింత సంతోషంగా ఉండొచ్చట. అవేంటో తెలుసుకుందామా..
తోడుతో సంతోషం
ప్రతిరోజూ కొంత సమయాన్ని తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడుపుతున్న వారు చాలా సంతోషంగానూ, సంతృప్తిగానూ ఉంటారట. అలా చేయని వారు ఒత్తిడి, ఆందోళనతో పోరాడవలసి వస్తుందని అమెరికన్ కంపెనీ అయిన గ్యాల్ప్ చేసిన పరిశోధనలో తేలింది. ప్రజలు వారాంతాల్లో ఎక్కువ సంతోషంగా ఉండటానికి కారణం కూడా అదేనట. ఎందుకంటే సెలవుల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపడానికి ఎక్కువ అవకాశం లభిస్తుంది.
జీవిత భాగస్వామితో సంబంధం ప్రభావం
జీవిత భాగస్వామితో మన సంబంధం జీవితంలోని వివిధ అంశాలను ప్రభావితం చేస్తుంది. వాటిలో ఒకటి సంతోషం. తమ సంబంధంతో సంతోషంగా లేని, చివరికి విడిపోవాలని నిర్ణయించుకున్న జంటల సంబంధంలో నెగెటివ్ ఫీలింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయట. జీవిత భాగస్వామితో సంబంధంలో ప్రేమతో కూడిన, మధురమైన మాటలతో గడిపే వారు సంతోషంగా ఉంటారట. దీనికి కృషి చేయాలి, కలిసి సమయం గడపాలి, ఒకరినొకరు ప్రశంసించడానికి నిరంతరం అవకాశాలను వెతుక్కోవాలి.
వయస్సు, సంతోషం మధ్య సంబంధం
కొన్ని నిర్దిష్ట వయసుల వారు తమ జీవితంతో ఎక్కువ సంతృప్తి చెందుతారు. మనోవైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, 30 ఏళ్ళు దాటిన వారు ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. ఎందుకంటే కెరీర్ స్టార్టింగ్ తర్వాత ఈ వయసులో ఉన్న వారికి శక్తి, సమాచారం, డబ్బు అన్నీ ఒకేసారి లభిస్తాయి. అయితే, మరొక అధ్యయనంలో, పరిశోధకులు 50 ఏళ్ళు దాటిన వారు మనస్పూర్తిగా నవ్వుకోగలరని కనుగొన్నారు. అయితే, మరొక అధ్యయనంలో, 44 ఏళ్ళ వయసులో ప్రజలు అత్యల్పంగా సంతోషంగా ఉంటారని, ఆ తర్వాత 70 ఏళ్ళ వరకు వారి జీవితంలో సంతోషం క్రమంగా పెరుగుతుందని వాదించారు.
ఈ మూడు విభిన్న రకాల పరిశోధనల ఫలితం ఏమిటంటే, అత్యంత సంతోషంగా ఉండటానికి ఏ వయస్సు లేదు. కానీ, శాస్త్రవేత్తలు వృద్ధాప్యంతో దగ్గరపడుతున్న కొద్దీ మనం ఎక్కువ సంతోషంగా ఉంటామని అంగీకరిస్తున్నారు. కాబట్టి, ఈ సంవత్సరం మీ జీవితంలో ఏ సంతోషాన్ని తీసుకువస్తుందో ఎదురుచూడటం కంటే, ప్రస్తుత కాలాన్ని సంతోషంగా గడపడానికి ప్రయత్నించడం మంచిది.
మీ చేతుల్లో మీ సంతోషం
జీవితంలోని వివిధ అంశాలు మన సంతోషంపై ప్రభావం చూపుతాయి. మీరు మీ సంతోషాన్ని మీ చేతుల్లో ఉంచుకోవాలనుకుంటే, దానిపై 40% వరకు మీకు నియంత్రణ ఉంటుంది. మీరు మీ సమయాన్ని ఎలా గడిపారు. చుట్టుపక్కల సంఘటనలు మీపై ఎంతవరకు ప్రభావం చూపాయనే విషయాన్ని గమనించండి. ఇలా చేయడం వల్ల దాదాపు మీరు సంతోషానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
ఎంతమంది స్నేహితులు ఉన్నారు?
కొన్ని సంవత్సరాల క్రితం బ్రిటన్ యువతపై చేసిన ఒక సర్వేలో, పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది స్నేహితులతో క్రమం తప్పకుండా సంబంధం కలిగి ఉన్న వారు తమ జీవితంలో ఎక్కువ సంతోషంగా ఉంటారని కనుగొన్నారు. సర్వేలో, తక్కువ మంది స్నేహితులు ఉన్న వారు తమ జీవితంతో తక్కువ సంతోషంగా ఉన్నారని తెలిసింది. స్నేహితులు మానసిక స్థితిని మెరుగుపరుస్తారు, సోషల్ సర్కిల్ పెరిగేందుకు సహకరిస్తారు. ఆయుష్షును పెంచుతారట. ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తారట కూడా.
వేతనం కూడా ప్రభావం చూపుతుంది
మన దగ్గర డబ్బుతో సంతోషం కొనలేమని అంటారు. కానీ, ఇది ఒక హద్దు వరకు మాత్రమే. ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం, ఏటా కచ్చితంగా శాలరీ పెరుగుతుందనుకున్న వారు కాకుండా, తక్కువ వేతనం పొందేవారి సంతోషమంతా డబ్బుపైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే, వారి ఆరోగ్యం నుంచి వివాహం వరకూ ప్రతి ఘటన డబ్బుతోనే ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి వారు ఎక్కువగా సంపాదిస్తే, ఇక వారికి మించి సంతోషంగా జీవించే వారే లేనట్లుగా సంతృప్తి పడతారట.
సంబంధిత కథనం