




Best Web Hosting Provider In India 2024

Style Tips: ప్లాటినం ఆభరణాలు ధరించాలనుకుంటున్నారా? వాటితో పాటు మీరు కూడా మెరిసిపోవాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి!
Style Tips: ప్రియమైన వారికి ప్రేమను వ్యక్తం చేయడంలో మట్టిగాజుల నుంచి గోల్డ్ రింగ్ వరకూ, ఇప్పుడు గోల్డ్ రింగ్ నుంచి ప్లాటినం ఆభరణాల వరకూ బహుమతుల రేంజ్ పెరిగిపోయింది. వాలెంటైన్ డే వచ్చేస్తుంది! మరి, మీ ప్రియమైన వారు ప్లాటినం ఆభరణాలను గిఫ్ట్ ఇస్తే, వాటిని ధరించి మరింత మెరిసిపోవాలనుకుంటున్నారా.. రండి!
ట్రెండ్‌కు తగ్గట్టుగానే విషింగ్ స్టైల్ మారుతూ ఉంటాయి. ప్రేమను వ్యక్తపరచడానికి తమకు వీలైనంత విలువైన వస్తువులను గిఫ్ట్ గా ఇవ్వాలని ఆసక్తి కనబరుస్తుంటారు. మట్టిగాజులు, గ్రీటింగ్ కార్డులు, చాక్లెట్ బాక్సులు, గోల్డ్ రింగుల నుంచి ప్లాటినం ఆభరణాల వరకూ ట్రెండ్ వచ్చేసింది. ఇలాంటి విలువైన ప్లాటినం వస్తువులతో ప్రేమను వ్యక్తీకరిస్తే, అవి ధరించి అంతకుమించిన ప్రకాశవంతమైన లుక్ కనబరచడమే రిటర్న్ గిఫ్ట్. ఇదంతా బాగానే ఉంది. మరి ఆ లుక్ రావడానికి మీరేం చేయాలని ఆలోచిస్తున్నారా. ఈ టిప్స్ పాటించి మెరిసిపోయే అందాన్ని సొంతం చేసుకోండి.

ప్లాటినంను ప్రత్యేకంగా చేసేది దాని అరుదైన సాగే స్వభావం. రెండు బిలియన్ సంవత్సరాల క్రితం ఉల్కల ఢీకొనడం వల్ల ఏర్పడిన ప్లాటినం, బంగారం కంటే 30 రెట్లు అరుదైన లోహం. ఇది ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రత్యేక ప్రదేశాల నుండి మాత్రమే లభిస్తుంది. దానిలో ఉండే ప్రత్యేకత ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు గడిచినా దాని రూపం మారదట. ఇదే కారణంగా ప్రేమ, సుదీర్ఘమైన భావాలను వ్యక్తపరిచేందుకు ప్లాటినంతో గిఫ్ట్ ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తారు. అంతేకాకుండా, ప్లాటినంలో ప్యూరిటీ 95% ఉంటుందట. ఇది విలువైన ఆభరణాలలో అత్యధికం. ప్లాటినం వల్ల చర్మంపై అలెర్జీ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇతర ఆభరణాలను మెరిసిపోయేట్లు చూపించడానికి దానిపై పాలిష్ లేదా పౌడర్ వేయాల్సి ఉంటుంది. ప్లాటినం విషయంలో అలా ఉండదు. ఇది సహజంగానే ఏకైక తెల్లని లోహం.
ప్లాటినం ధరించడానికి సరైన సందర్భం కావాలి
స్నేహితుడి వివాహం అయినా లేదా ఏదైనా ఖరీదైన ప్రదేశంలో పార్టీ అయినా ప్లాటినం ధరించడం సబబే అనిపిస్తుంది. ఉదాహరణకు, ఆఫీసు పార్టీ ఉంటే, అందమైన దుస్తులను ఎంచుకోండి. దానితో అందమైన ప్లాటినం ఇయర్ రింగ్ ధరించండి. లేదా అందమైన షిఫాన్ చీరతో ప్లాటినం నెక్లెస్ చాలా అందంగా ఉంటుంది. ఎల్లప్పుడూ సందర్భానికి తగినట్లుగా దుస్తులను ఎంచుకోవాలి. ఆభరణాల విషయంలో సమతుల్యతను కాపాడుకోవాలి. అంటే ఆభరణానికి తగ్గట్టుగా మీ వస్త్రధారణ ఉండాలి.
ఆభరణాలు ప్రత్యేకంగా కనిపించాలి
ప్లాటినం ఆభరణాలు తమలో తాము సరిపోతాయి, వాటికి వేరే ఏదీ అవసరం లేదు. కాబట్టి మీరు ప్లాటినం నెక్లెస్ ధరించినప్పుడు, దానితో ఇతర ఆభరణాలను తక్కువగా ధరించండి. ఇలా చేయడం వల్ల ప్లాటినం ఆభరణాల అందం మరింతగా వెలుగుతుంది.
పేస్టెల్ రంగులతో జత చేయండి
ఫ్యాషన్ అవగాహన ఉన్నవారు తమ ఆభరణాలను పేస్టెల్ రంగులతో స్టైలింగ్ చేస్తారు. అలా చేయడం వల్ల అవి ప్రత్యేకంగా కనిపిస్తాయి. ప్లాటినం ఆభరణాలను బేజ్, లావెండర్, బేబీ పింక్, పౌడర్ బ్లూ వంటి పేస్టెల్ రంగులతో జత చేయడం మంచిది.
ప్రయోగాలకు భయపడకండి
అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి దుస్తులు, వాటికి సరైన ఆభరణాలను సెలక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. మీ దుస్తులు మెరిసేవి అయితే, భారీ ప్లాటినం నెక్లెస్ ధరించడానికి బదులుగా అందమైన ఇయర్ రింగ్స్ ధరించండి. మీ జుట్టును జడ వేసుకోండి. తద్వారా మీ ఇయర్ రింగ్స్‌పై జుట్టుపడకుండా అట్రాక్షన్‌గా నిలుస్తాయి.
సంబంధిత కథనం