Railway ALERT : ప్రయాణికులకు అల‌ర్ట్‌… విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు, వందేభార‌త్ ట్రైన్ రీషెడ్యూల్

Best Web Hosting Provider In India 2024

Railway ALERT : ప్రయాణికులకు అల‌ర్ట్‌… విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు, వందేభార‌త్ ట్రైన్ రీషెడ్యూల్

HT Telugu Desk HT Telugu Feb 09, 2025 11:51 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
HT Telugu Desk HT Telugu
Feb 09, 2025 11:51 AM IST

ప్రయాణికులకు రైల్వేశాఖ అలర్ట్ ఇచ్చింది. విజయవాడ డివిజన్ లో పరిధిలో పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. ఇక విశాఖ‌ప‌ట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభార‌త్ రైలును రీషెడ్యూల్‌ చేశారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (PTI)
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

ఇండియ‌న్ రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. విజయవాడ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా నాలుగు రైళ్లను రద్దు చేసింది. మరో మూడు రైళ్ల‌ను దారి మ‌ళ్లించింది. విశాఖ‌ప‌ట్నం-సికింద్రాబాద్ వందేభార‌త్ రీషెడ్యూల్ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను పేర్కొంది.

yearly horoscope entry point

రద్దు చేసిన రైళ్లు:

1. విశాఖపట్నం నుండి బయలుదేరే  విశాఖపట్నం-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ రైలు(నెంబ‌ర్‌ 18519) ఫిబ్ర‌వ‌రి 10 నుంచి ఫిబ్ర‌వ‌రి 20 వ‌ర‌కు రద్దు చేశారు.

2. ఎల్‌టీటీ నుండి బయలుదేరే  ఎల్‌టిటి-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు(నెంబ‌ర్‌ 18520) ఫిబ్ర‌వ‌రి 12 నుండి ఫిబ్ర‌వ‌రి 22 వ‌ర‌కు రద్దు చేశారు.

3. టాటా నగర్ నుండి బయలుదేరే  టాటా నగర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు(నెంబ‌ర్‌ 18111) ఫిబ్ర‌వ‌రి 13న ర‌ద్దు చేశారు.

4. యశ్వంత్‌పూర్ నుండి బ‌య‌లుదేరే రైలు నెంబ‌ర్‌ 18112 యశ్వంత్‌పూర్-టాటా నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫిబ్ర‌వ‌రి 9 నుండి ఫిబ్ర‌వరి 16 వ‌ర‌కు రద్దు చేశారు.

3 రైళ్లు దారి మళ్లింపు

1. హైదరాబాద్ నుండి బయలుదేరే హైదరాబాద్-షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు(నెంబ‌ర్‌ 18046) ఫిబ్ర‌వ‌రి 18 నుండి ఫిబ్ర‌వ‌రి 20 వరకు సికింద్రాబాద్-పగిడిపల్లి-గుంటూరు-విజయవాడ మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ఈ రైలుకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగాం, అలెర్, భువనేశ్వర్ స్టాప్‌లను తొల‌గించారు.

2. భువనేశ్వర్ నుంచి బయలుదేరే  భువనేశ్వర్ – సీఎస్‌టీ ముంబై రైలు(నెంబ‌ర్‌ 11020) ఫిబ్ర‌వ‌రి 17 నుండి ఫిబ్ర‌వ‌రి 19 వరకు విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్, వికారాబాద్ మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ఈ రైలు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర స్టాప్‌లు తొలగించారు.

3. షాలిమార్ నుంచి బయలుదేరే షాలిమార్ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు( నెంబ‌ర్‌ 22849) ఫిబ్ర‌వ‌రి 19న విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్ మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ఈ రైలు రాయనపాడు, వరంగల్, కాజీపేట స్టాప్‌ల‌ను తొల‌గించారు.

‘వందే భార‌త్’ రీషెడ్యూల్‌:

1. విశాఖపట్నం నుంచి బయలుదేరే… విశాఖపట్నం – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు( నెంబ‌ర్ 20833) ను రీషెడ్యూల్ చేశారు. ఫిబ్ర‌వ‌రి 19, 20 తేదీల్లో ఉదయం 5.45 గంటలకు బయలుదేరే బదులు ఉదయం 7 గంటలకు బయలుదేరనుంది.

2. సికింద్రాబాద్ నుంచి బ‌య‌లుదేరే…. సికింద్రాబాద్ – విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు(నెంబ‌ర్‌ 20834)ను రీషెడ్యూల్ చేశారు. ఫిబ్ర‌వ‌రి 19, 20 తేదీల్లో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బ‌దులు సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు.

రిపోర్టింగ్: జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Andhra Pradesh NewsTrainsVande Bharat ExpressVisakhapatnam
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024