



Best Web Hosting Provider In India 2024
ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సులో మంటలు చెలరేగి 41 మంది సజీవ దహనం!
Mexico Bus Accident : దక్షిణ మెక్సికోలో జరిగిన బస్సు ప్రమాదంలో 41 మంది మరణించారు. ట్రక్కును బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
దక్షిణ మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో దాదాపు 41 మంది మరణించారు. 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు హైవేపై ట్రక్కను ఢీకొట్టింది. ఢీకొన్న తర్వాత బస్సు మంటల్లో చిక్కుకుని 41 మంది మృతి చెందారు. బస్సు కాలి బూడిదైంది. ఘటన గురించి తెలిసిన పోలీసులు ప్రమాద స్థలానికి వచ్చారు. ప్రమాదం నుంచి బయటపడిన ఏడుగురిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

బస్సు కాన్కున్ నుండి టబాస్కోకు వెళుతోంది. ట్రక్కను ఢీ కొట్టిన తర్వాత మంటలు చెలరేగాయి. ప్రమాదం గురించి టబాస్కో రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. బస్సు పూర్తిగా కాలిపోయిందని ప్రకటించింది. ట్రక్కును ఢీకొన్న తర్వాత మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం శనివారం ఉదయం ఎస్కార్సెగా నగరానికి సమీపంలో జరిగింది. ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రమాదం నుంచి బయటపడి గాయపడిన ప్రయాణికుల ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు చెబుతున్నారు.
టూర్ అకోస్టా బస్సు పర్యాటకులను తీసుకువెళుతూ ప్రయాణంలో ఉంది. ఆపరేటర్ ఇచ్చిన సమాచారం ప్రకారం, బస్సులో దాదాపు 48 మంది ఉన్నారని, వారు ప్రమాదానికి గురయ్యారని తెలుస్తోంది. ఈ ప్రమాదంపై కంపెనీ దర్యాప్తు చేస్తోంది. బస్సులో ప్రయాణిస్తున్నవారు కాలి బూడిదైపోయారు. కొందరు మాత్రమే బయటపడ్డారు.
శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. బస్సు స్పీడుగా వెళ్తూ ట్రక్కును ఢీ కొట్టింది. ఆ తర్వాత మంటలు చెలరేగాయి. బస్సు లోపల ఉన్నవారిలో ఏడుగురు మాత్రమే బయటపడ్డారు. మిగిలినవారు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. ఎక్కువ వేగంతో బస్సు వెళ్తున్నందునే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
ప్రమాద బాధితులకు పరిహారం అందుతుందని బస్సు కంపెనీ వెల్లడించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసింది. బాధిత కుటుంబాలకు కంపెనీ అండగా నిలుస్తుందని పేర్కొంది. ఇప్పటివరకు కొంతమంది మృతదేహాలను మాత్రమే గుర్తించారు.
కొన్ని క్షణాల్లోనే బస్సు మొత్తం మంటలకు ఆహుతైందని గాయపడినవారు తెలిపారు. బస్సు మంటల్లో కాలడం.. ఆ తర్వాత జనాల అరుపులు ఒక్కొక్కటిగా తగ్గడం ప్రారంభించాయని వెల్లడించారు.
Best Web Hosting Provider In India 2024
Source link