




Best Web Hosting Provider In India 2024

Dhar Gang Arrest : అనంతపురం పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ ధార్ గ్యాంగ్- భారీగా బంగారం, నగదు స్వాధీనం
Dhar Gang Arrest : దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వరుస చోరీలతో హడలెత్తిస్తున్న ధార్ గ్యాంగ్ లోని ముగ్గురిని అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ లో మారుమూల గ్రామాల్లో జల్లెడపట్టి నిందితులను పట్టుకున్నారు.
Dhar Gang Arrest : సౌత్ ఇండియాపై కన్నేసిన మధ్యప్రదేశ్ ‘ధార్ గ్యాంగ్’ పలు రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్నారు. ఈ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ ను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. 18 రోజుల క్రింత అనంతపురం శ్రీనగర్ కాలనీలోని ఓ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఈ చోరీకి పాల్పడింది ధార్ గ్యాంగ్‌గా పోలీసులు గుర్తించారు. దీంతో అనంతపురం ఎస్పీ జగదీశ్ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి.

ధార్ గ్యాంగ్ అరెస్ట్
ఈ గ్యాంగ్ పై నిఘాపెట్టిన అనంతపురం పోలీసులు మధ్యప్రదేశ్‌లోని మారుమూల గ్రామాల్లో జల్లెడపట్టారు. చివరికి టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకున్నారు. ఈ గ్యాంగ్‌లోని ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.90 లక్షల విలువ చేసే బంగారం, వజ్రాభరణాలతో పాటు రూ.19.35 లక్షల డబ్బు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో గ్యాంగ్ లీడర్ నారూ పచావార్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్ పై ఏపీ, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు ఉన్నట్టు గుర్తించారు.
సౌత్ ఇండియాలో ఈ గ్యాంగ్ పై 32కు పైగా కేసులు ఉన్నట్టు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పగలు రెక్కీ చేసి రాత్రి పూట చోరీలకు పాల్పడుతుంటారని జిల్లా ఎస్పీ చెప్పారు. చోరీ చేసిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా బైక్‌లపై ప్రయాణం చేస్తుంటారని తెలిపారు. ఈ గ్యాంగ్ కోసం నాలుగు రాష్ట్రాల్లో పోలీసులు గాలిస్తున్నట్టు చెప్పారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో మకాం!
దక్షిణ భారతదేశంలో వరుస చోరీలకు పాల్పడుతున్న ధార్ గ్యాంగ్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో మకాం వేసిందా? అనే అనుమానాలు తలెత్తున్నాయి. ధార్ గ్యాంగ్ పల్నాడు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. పగలు రెక్కీ చేసి రాత్రులు ఇళ్లకు కాపలాగా పడుకుంటారు. సరిగ్గా సమయం చూసుకుని ఇల్లు గుల్ల చేస్తుంటారు. చోరీలకు పాల్పడే ముందు పోలీసులకు దొరక్కుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. సెల్ ఫోన్ వాడరు, ముఖాలు కనిపించకుండా జాగ్రత్తపడుతుంటారు. రాత్రి సమయాల్లో ముసుగు వేసుకుని ఇళ్లలో చోరీలకు పాల్పడతారు.
జాతీయ రహదారులకు సమీపంలోని గ్రామాలను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తుంటారు. మధ్యప్రదేశ్ లో ఉండే ఈ గ్యాంగ్ చోరీలకు పెట్టింది పేరు. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లిన 17 కుటుంబాలను టార్గెట్ చేసి వారి ఇళ్ల చేసేశారు. పల్నాడు జిల్లాలో సైలెంట్ గా పనికానిచ్చేస్తున్నారు ధార్ గ్యాంగ్. ఈ గ్యాంగ్ చోరీల సమయంలో చాలా నిర్థాక్షిణ్యంగా వ్యవహరిస్తారు. ప్రాణాలు తీసేందుకు వెనుకాడరు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చే ఈ ముఠా భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తుంటారు. బచాడో గ్యాంగ్, ధార్ గ్యాంగ్, భూరియా గ్యాంగ్ , చంబా గ్యాంగ్, పార్ధు గ్యాంగ్ లు చోరీల్లో ఆరితేరిపోయాయి.
సంక్రాంతి సమయంలో మూడు ఊర్లలో 17 ఇళ్లలో ఒకేసారి చోరీ చేసి పరారయ్యారు. పూర్తిగా ముసుగులు ధరించి, సీసీ కెమెరాలు, ఆధారాలు ధ్వంసం చేస్తుంచారు.
సంబంధిత కథనం
టాపిక్