




Best Web Hosting Provider In India 2024

OTT: ఒకే ఓటీటీలోకి వచ్చిన రెండు తమిళ సినిమాలు – ఒకటి హారర్…మరోటి సస్పెన్స్ థ్రిల్లర్!
OTT: తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లారాతో పాటు హారర్ సినిమా పార్క్ ఓటీటీలోకి వచ్చాయి. ఈ రెండు సినిమాలు టెంట్ కోట ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. పార్క్ మూవీలో తమన్‌కుమార్ హీరోగా నటించగా…లారా మూవీలో అశోక్ కుమార్ బాలకృష్ణన్ లీడ్ రోల్ చేశాడు.
OTT: తమిళ సినిమాలు లారా, పార్క్ సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. టెంట్‌కోట ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. పార్క్ మూవీ గత ఏడాది ఆగస్ట్‌లో థియేటర్లలో రిలీజ్ కాగా…లారా మూవీ ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

మిక్స్‌డ్ టాక్…
సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన లారా మూవీలో అశోక్ కుమార్ బాలకృష్ణన్, అనుశ్రేయ రాజన్, కథిరేసన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాక మణిమూర్తి దర్శకత్వం వహించాడు. థియేటర్లలో ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది. ట్విస్ట్‌లు బాగున్నా, ఇన్వేస్టిగేషన్ సీన్స్ ఆసక్తిగా రాసుకోలేకపోవడం, బోరింగ్ స్క్రీన్‌ప్లే కారణంగా ఈ మూవీ ఫెయిల్యూర్‌గా నిలిచింది.
పోలీస్ ఇన్వేస్టిగేషన్…
ఓ బీచ్‌లో మహిళ డెడ్‌బాడీ దొరుకుతుంది. ఆ డెడ్‌బాడీ ఎమ్మెల్యే డ్రైవర్ లారా భార్యదని పోలీసులు అనుమానిస్తారు. లారాకు ఎమ్మెల్యే అండదండలు ఉండటంతో పొలిటికల్‌గా ఈ కేసు సంచలనంగా మారుతుంది. ఈ కేసును కథిరేసన్ అనే పోలీస్ ఇన్వేస్టిగేషన్ చేయడం మొదలుపెడతాడు. అతడి ఇన్వేస్టిగేషన్‌లో ఏం తేలింది? ఎమ్మెల్యే కొడుకు మహారూఫ్‌తో ఈ కేసుకు ఎలాంటి సంబంధం ఉంది? అన్నదే ఈ మూవీ కథ.
తెలుగులో…
లారా మూవీలో హీరోగా నటించిన అశోక్ కుమార్ బాలకృష్ణన్ తమిళంతో పాటు మలయాళం, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేశాడు. తెలుగులో కాకి అనే సినిమాలో నటించాడు.
హారర్ మూవీ…
మరో తమిళ మూవీ పార్క్ టెంట్ కోట ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి మురుగన్ దర్శకత్వం వహించాడు. తెలుగులో సేమ్ టైటిల్‌తో ఈ మూవీ రిలీజైంది. ఈ హారర్ మూవీలో తమన్ కుమార్, శ్వేత హీరోహీరోయిన్లుగా నటించారు.
ఆత్మలతో పోరాటం…
మిత్రన్ ఓ డీటీహెచ్ షాప్నడుపుతుంటాడు. యాజ్నిని ప్రేమిస్తాడు. వారిని చంపేందుకు ఓ రెండు ఆత్మలు వెంటాడుతుంటాయి. మిత్రన్, యాజ్నిలను వెంటాడిన ఆ ఆత్మలు ఎవరు? వాటి బారి నుంచి ఎలా బయటపడ్డారు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది.పార్క్ మూవీ కూడా థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది.
సంబంధిత కథనం