Thandel Collections: బాక్సాఫీస్ వ‌ద్ద తండేల్ జోరు – నాలుగు రోజుల్లో వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఇవే – నైజాంలో ప్రాఫిట్స్‌!

Best Web Hosting Provider In India 2024

Thandel Collections: బాక్సాఫీస్ వ‌ద్ద తండేల్ జోరు – నాలుగు రోజుల్లో వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఇవే – నైజాంలో ప్రాఫిట్స్‌!

Nelki Naresh HT Telugu
Feb 11, 2025 12:45 PM IST

Thandel Collections: తండేల్ మూవీ నాగ‌చైత‌న్య కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా నిలిచింది. నాలుగు రోజుల్లో ఈ మూవీకి 73.20 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు మేక‌ర్స్ పేర్కొన్నారు. వీకెండ్ లోగా వంద కోట్ల మైలురాయిని ట‌చ్ చేస్తుంద‌ని పేర్కొన్నారు.

తండేల్ క‌లెక్ష‌న్స్
తండేల్ క‌లెక్ష‌న్స్

Thandel Collections: నాగ‌చైత‌న్య తండేల్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద కుమ్మేస్తోంది. నాలుగు రోజుల్లోనే ఈ మూవీ 73.20 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఈ మేర‌కు క‌లెక్ష‌న్స్‌తో కూడిన స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. సెకండ్ వీకెండ్ పూర్త‌య్యే లోగా ఈ మూవీ వంద కోట్ల మైలురాయిని దాటే అవ‌కాశం ఉన్న‌ట్లు పేర్కొన్నారు. సోమ‌వారం రోజు తండేల్ మూవీకి 10.83 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు చెప్పారు. నాగ‌చైత‌న్య కెరీర్‌లో హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబ‌ట్టిన మూవీగా తండేల్ రికార్డ్ క్రియేట్ చేసింది.

yearly horoscope entry point

నైజాంలో బ్రేక్ ఈవెన్

నాలుగు రోజుల్లోనే తండేల్ మూవీ 80 శాతానికిపైగా రిక‌వ‌రీ సాధించింది. ఇప్ప‌టికే నైజాం ఏరియాలో నాగ‌చైత‌న్య మూవీ బ్రేక్ ఈవెన్‌ను సాధించిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. నైజాం ఏరియాలో ప‌దిన్న‌ర కోట్ల వ‌ర‌కు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. నాలుగు రోజుల్లో ఒక్క నైజాం ఏరియాలోనే ఈ మూవీ ప‌ద‌కొండు కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

సోమ‌వారం నాటి క‌లెక్ష‌న్స్‌తో ప్రాఫిట్ జోన్‌లోకి అడుగుపెట్టింది. మంగ‌ళ‌వారం, బుధ‌వారం నాటి క‌లెక్ష‌న్స్‌తో మ‌రికొన్ని ఏరియాల‌లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు. నాగ‌చైత‌న్య గ‌త సినిమాలు క‌స్ట‌డీ, థాంక్ యూ సినిమాల‌తో పోలిస్తే తండేల్ తొమ్మిదింత‌లు ఎక్కువే వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది.

పాజిటివ్ టాక్‌…

తండేల్ మూవీలో నాగ‌చైత‌న్య‌కు జోడీగా సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించింది. మ‌త్య్స‌కారుల జీవితాల నేప‌థ్యంలో ప్రేమ‌క‌థ‌కు, దేశ‌భ‌క్తిని ముడిపెడుతూ ద‌ర్శ‌కుడు చందూ మొండేటి తండేల్ మూవీని తెర‌కెక్కించాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు.

తండేల్ మూవీకి థియేట‌ర్ల‌లో పాజిటివ్ టాక్ వ‌చ్చింది. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి యాక్టింగ్‌తో పాటు దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ బాగుందంటూ కామెంట్స్ వినిపిస్తోన్నాయి.

తండేల్ క‌థ ఇదే…

రాజు (నాగ‌చైత‌న్య‌), స‌త్య (సాయిప‌ల్ల‌వి) ప్రేమించుకుంటారు. రాజు మ‌త్స్య‌కార వృత్తిలో భాగంగా చేప‌ల వేట కోసం ఏడాదిలో తొమ్మిది నెల‌లు స‌ముద్రంపైనే ఉంటాడు.వేట‌కు వెళ్లిన రాజుకు ఏం జ‌రుగుతుందోన‌ని ప్ర‌తిక్ష‌ణం భ‌య‌ప‌డుతుంటుంది స‌త్య. ప్రియురాలి బాధ‌, భ‌యం చూసిన రాజు మ‌ళ్లీ వేట కోసం స‌ముద్రంపైకి వెళ్ల‌న‌ని స‌త్య‌కు మాటిస్తాడు.

అనుకోని ప‌రిస్థితుల్లో ఆ మాట త‌ప్పి స‌ముద్రంలోకి వెళ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? చేపల వేట‌కు వెళ్లిన రాజు పాకిస్థాన్ కోస్ట్ గార్డ్స్‌కు ఎలా దొరికిపోయాడు? పాకిస్థాన్ జైలులో రాజుకు ఎలాంటి క‌ష్టాలు ఎదుర‌య్యాయి? రాజుపై కోపంతో మ‌రొక‌రితో స‌త్య పెళ్లికి ఎందుకు సిద్ధ‌ప‌డింది? అన్న‌దే ఈ మూవీ కృథ‌. ల‌వ్‌స్టోరీ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన మూవీ ఇది.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024