Brain Foods: పిల్లల మెదడుకు బలాన్నిచ్చే 4 తీపి వంటకాలు ఇవిగో, వీటిని తినిపిస్తే మంచిది

Best Web Hosting Provider In India 2024

Brain Foods: పిల్లల మెదడుకు బలాన్నిచ్చే 4 తీపి వంటకాలు ఇవిగో, వీటిని తినిపిస్తే మంచిది

Haritha Chappa HT Telugu
Feb 11, 2025 03:30 PM IST

పిల్లలు, పెద్దలు అందరికీ తీపి వంటకాలు అంటే చాలా ఇష్టం. అయితే వాటిలో ఆరోగ్యకరమైనవే ఎంపిక చేసుకుని తినాలి. మెదడు ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లను ఇక్కడ ఇచ్చాము. వీటిని పిల్లలకు తినిపించేందుకు ప్రయత్నిచండి.ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి.

మెదడుకు మేలు చేసే స్వీట్లు
మెదడుకు మేలు చేసే స్వీట్లు (Shutterstock)

పిల్లలకైనా, పెద్దలకైనా తీపి వంటకాలు అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా భోజనం తర్వాత తీపి పదార్థం తినేందుకు ఇష్టపడతారు. లేకకుంటే భోజనం అసంపూర్ణంగా పూర్తి చేసినట్టు అనిపిస్తుంది. అయితే తీపి వంటకాల గురించి కొంత భయం కూడా ఉంటుంది. అధికంగా తీపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ ఇంట్లో తయారుచేసే కొన్ని తీపి వంటకాలు మన ఆరోగ్యానికి, ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి చాలా మంచివి. పరిమిత మోతాదులో వీటిని తీసుకోవడం ద్వారా రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. మెదడుకు మేలు చేసే స్వీట్ల గురించి ఇక్కడ ఇచ్చాము. ఇవి ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. మీ పిల్లలకు ఆరోగ్యంగా మీరే వీటిని వండి తినిపించవచ్చు.

yearly horoscope entry point

మఖానా లడ్డూ

పోషకాలతో నిండిన మఖానాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. మఖానాలలో జింక్, ఇనుము ఉంటాయి, ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. కాబట్టి మీకు తీపి తినాలనిపిస్తే, మఖానా లడ్డూను మీ ఆహారంలో చేర్చుకోండి. పిల్లల మెదడుకు ఈ లడ్డూ ఎంతో మేలు చేస్తుంది. అయితే దీనిలో పంచదార మాత్రం వాడకండి. బెల్లం మాత్రమే వాడాలి.

బాదం హల్వా

బాదం హల్వా కూడా మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా శీతాకాలంలో బాదం హల్వాను తయారుచేసి తింటారు. రుచికరమైన ఈ తీపి వంటకంలో రైబోఫ్లేవిన్, ఎల్-కార్నిటైన్ వంటి పోషకాలు ఉంటాయి, ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా బాదం హల్వా జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బాదం పప్పు, బెల్లంతో దీన్ని తయారుచేసుకోవాలి.

నువ్వుల లడ్డూ

శీతాకాలంలో నువ్వులు, బెల్లం లడ్డూలను ఎక్కువగా తింటారు. నువ్వులు వేడి చేస్తాయి. కాబట్టి ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. అంతేకాకుండా నువ్వుల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచివి. నువ్వుల్లో మోనోసాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి, ఇవి మెదడు ఆరోగ్యానికి చాలా మంచివి. కాబట్టి శీతాకాలంలో మీ కుటుంబానికి నువ్వుల లడ్డూ తినిపించడం మర్చిపోకండి.

అక్రోట్ బర్ఫీ

మెదడులాగే కనిపించే అక్రోట్ మన మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో పాటూ మన శరీరానికి చాలా మంచి పోషకాలు ఉంటాయి. కాబట్టి మీకు తీపి అంటే ఇష్టమైతే, మీ ఆహారంలో అక్రోట్ బర్ఫీని చేర్చుకోండి. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఎంపిక కూడా.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024