Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/nns_1739335763103_1739335776854.jpg)
NNS 12th February Episode: అమర్‌కు అడ్డంగా దొరికిపోయిన మనోహరి.. మోసం చేసిన రణ్వీర్.. అరుంధతి డైరీ చదివిన భాగీ
NNS 12th February Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (ఫిబ్రవరి 12) ఎపిసోడ్లో అమర్ కు దొరికిపోతుంది మనోహరి. అటు అప్పటికే ఆమెను మోసం చేస్తాడు రణ్వీర్. మరోవైపు అరుంధతి డైరీ చదవడం మొదలుపెడుతుంది మిస్సమ్మ.
NNS 12th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 12) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. రాథోడ్ మాటలతో అమర్ లోనూ మనోహరిపై అనుమానం పెరుగుతుంది. దీంతో ఆమె సంగతేంటో తేల్చుకోవడానికి అమర్ సిద్ధమవుతాడు.
అమర్‌కు దొరికిపోయిన మనోహరి
అమర్, రాథోడ్ కార్లో వెళ్తుండగా మనోహరి తన కారులో వేగంగా వెళ్తూ అడ్డంగా వస్తుంది. వాళ్లను గమనించకుండా ఆమె వెళ్లిపోగా.. అమర్ మాత్రం అది మనోహరి కారు అని గుర్తించి ఆమెను ఫాలో చేయమని చెబుతాడు. రాథోడ్ ఆమెను ఫాలో చేస్తాడు. మనోహరి నేరుగా రణ్వీర్ ఉన్న చోటుకు వెళ్తుంది. ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చిందనుకుంటూ ఉండగా.. లోనికి వెళ్తే మనోహరి భాగోతం మొత్తం బయటపడుతందని రాథోడ్ అంటాడు.
మనోహరిని ఫాలో అయిన విషయాన్ని అటు భాగీకి కూడా రాథోడ్ ఫోన్ చేసి చెబుతాడు. దీంతో వెంటనే లోనికి వెళ్లి ఆమెను రెడ్ హ్యాండెెడ్ గా పట్టుకోమని ఆమె చెబుతుంది. సరే అంటూ రాథోడ్, అమర్ లోని వెళ్తారు.
మనోహరిని మోసం చేసిన రణ్వీర్
అప్పటికే రణ్వీర్ ఆమెపై మండిపడుతూ ఉంటాడు. కోల్‌కతాకు వెళ్లకుండా ఎందుకు ఆపావని నిలదీస్తాడు. దీంతో మనోహరి ఈసారి వదిలెయ్ అంటూ కోర్టు కేసు ఏమైందని అడుగుతుంది. ఏదో విధంగా వాయిదా పడిందని రణ్వీర్ అంటాడు. అయితే మన ఆస్తి సేఫ్ అని మనో అంటుంది. అది విని మన ఆస్తా అని అడుగుతాడు. నీ భార్యను కాబట్టి సగం ఆస్తి నాది కూడా కదా అని ఆమె అంటుంది.
తాను కూడా అదే అనుకుంటున్నానంటూ కొన్ని పేపర్లపై ఆమెతో సంతకం చేయిస్తాడు. తనకు ఆస్తి ఇవ్వడానికి అంగీకరించిన పత్రాలే అనుకొని మనోహరి సంతకాలు పెడుతుంది. సంతకం పెట్టడం పూర్తయిన తర్వాత అవి విడాకుల పత్రాలని, ఆస్తిలో చిల్లగవ్వ కూడా ఇవ్వనని రణ్వీర్ తేల్చి చెబుతాడు.
ఆ షాక్ లో మనోహరి ఉండగానే రాథోడ్, అమర్ అక్కడికి వస్తారు. వాళ్లను చూసి మనోహరి మరింత షాకవుతుంది. వాళ్లు రావడం గమనించి రణ్వీర్ పక్కకు వెళ్లి దాక్కుంటాడు. దీంతో ఏదో అనాథాశ్రమం పనిమీద వచ్చినట్లు చెప్పి మనోహరి కవర్ చేసుకుంటుంది.
భాగీ చేతుల్లో అరుంధతి డైరీ
అటు ఇంట్లో అమర్ ఫైల్స్ తీస్తున్న క్రమంలో అరుంధతి డైరీ భాగీకి దొరుకుతుంది. దానిని చదవాలా వద్దా అనుకుంటూ చివరికి చదివేస్తుంది. అందులో అరుంధతి తనకిష్టమైన రేడియో ప్రోగ్రామ్ గురించి రాయడం చదువుతుంది. దీంతో భాగీలో అనుమానం మొదలవుతుంది. ఇంతలో కిటికీలో నుంచి ఆ డైరీ భాగీ చదవడం చూసిన ఆరు.. వెంటనే ఆమెను బయటకు రావాలని, ఏదో మాట్లాడాలని పిలుస్తుంది.
డైరీలో ఏం చదివావు? ఆమె గురించి ఏం తెలుసుకున్నావంటూ ఆరా తీస్తుంది. భాగీ తన అనుమానం వ్యక్తం చేయగా.. ఆమె, ఈమె ఒకరు కాదంటూ ఆరు వాదిస్తుంది. ఒక్కటి కావద్దనే తానూ కోరుకుంటున్నానని, ఆమె బతికి ఉన్నంత కాలం చల్లగా ఉండాలని మిస్సమ్మ అని వెళ్లిపోతుంది. అంటు అరుంధతి కూడా ఎమోషనల్ అవుతూ.. తాను అరుంధతిగా వెళ్లి మరొకరిగా తిరిగొచ్చి తన చెల్లెలి కుటుంబాన్ని కాపాడుకుంటానని శపథం చేస్తుంది.
మనోహరికి తాళి కట్టడానికి కాళీ రెడీ
రణ్వీర్ దగ్గరి నుంచి మనోహరి మంగళ, కాళీ ఉన్న చోటికి బయలుదేరుతుంది. అప్పటికే అక్కడ ఉన్న కాళీ తన దగ్గర ఉన్న తాళిని చూపిస్తూ ఈరోజు మనోహరి మెడలో బలవంతంగా అయిన కట్టి తీరుతానని అంటాడు. మంగళ వాదిస్తున్నా అతడు వినడు. మరి కాళీ నిజంగానే మనోహరి మెడలో తాళి కడతాడా? తర్వాత ఏం జరగబోతోంది? నిండు నూరేళ్ల సావాసం బుధవారం (ఫిబ్రవరి 12) ఎపిసోడ్లో చూడండి.
సంబంధిత కథనం
టాపిక్