




Best Web Hosting Provider In India 2024

Top Telugu Serial: దుమ్ము రేపుతున్న స్టార్ మా సీరియల్.. సడెన్‌గా టాప్‌లోకి..
Top Telugu Serial: ఓ తెలుగు టీవీ సీరియల్ ఇప్పుడు టీఆర్పీ రేటింగ్స్ తో దుమ్ము రేపుతోంది. నిజానికి చాలా నెలల కిందటే ఈ సీరియల్ ప్రారంభమైనా.. ఇప్పుడు అర్బన్ రేటింగ్స్ లో టాప్ 1లోకి దూసుకెళ్లడం విశేషం.
Top Telugu Serial: తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో చాలా వరకు ప్రతి వారం పెద్దగా మార్పులు ఉండవు. టాప్ 3లో కొంత కాలం వరకు కొన్ని సీరియల్స్ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తాయి. అయితే తాజాగా స్టార్ మా ఛానెల్లో వచ్చే గుండె నిండా గుడి గంటలు మాత్రం అనూహ్యంగా టాప్ లోకి దూసుకెళ్లింది. అర్బన్ ఏరియా టీఆర్పీ రేటింగ్స్ లో ఇప్పుడీ సీరియల్ కు తిరుగులేకపోవడం విశేషం.

గుండె నిండా గుడి గంటలు టాప్
తెలుగు టీవీ సీరియల్స్ లో గతేడాది చాలా వరకు బ్రహ్మముడి హవా కొనసాగింది. అయితే ఆ సీరియల్ ప్రైమ్ టైమ్ నుంచి మధ్యాహ్నానికి మారడంతో క్రమంగా కనుమరుగైంది. ఆ తర్వాత కార్తీకదీపం 2 సీరియల్ టాప్ లో ఉంటూ వస్తోంది. అటు అర్బన్, ఇటు రూరల్ ఏరియాల్లో కార్తీకదీపం సీరియల్ కు తిరుగులేదు అనేలా సాగింది.
కానీ తాజాగా ఐదో వారానికి సంబంధించి రిలీజైన రేటింగ్స్ లో గుండె నిండా గుడి గంటలు సీరియల్ దూసుకొచ్చింది. ఓవరాల్ గా రెండో స్థానంలో ఉన్న ఈ సీరియల్.. అర్బన్ టీఆర్పీ రేటింగ్స్ లో మాత్రం నంబర్ వన్ కావడం విశేషం.
గుండె నిండా గుడి గంటలు రేటింగ్స్ ఇలా..
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఓవరాల్ గా 13.08 రేటింగ్ సాధించింది. కార్తీకదీపం 13.71తో టాప్ లో ఉండగా.. ఈ సీరియల్ రెండో స్థానానికి దూసుకొచ్చింది. కేవలం అర్బన్ ఏరియాకు వచ్చేసరికి గుండెనిండా గుడి గంటలు సీరియల్ కు 11.34 రేటింగ్ నమోదైంది. అదే కార్తీకదీపం 2కి మాత్రం 10.23 అర్బన్ రేటింగ్ మాత్రమే వచ్చింది.
ఆ లెక్కన అర్బన్ ప్రేక్షకులను గుండెనిండా గుడి గంటలు బాగా ఆకట్టుకుంటోందని అర్థమవుతోంది. గత కొన్ని వారాలుగా ఈ సీరియల్ తన రేటింగ్ ను మెరుగుపరచుకుంటూ వస్తోంది. తాజా రేటింగ్స్ లో రెండో స్థానానికి, అర్బన్ లో తొలి స్థానానికి వెళ్లింది.
ఇంటింటి రామాయణం కూడా..
అటు ఇంటింటి రామాయణం సీరియల్ కూడా తాజా రేటింగ్స్ లో 13.05తో గట్టి పోటీ ఇస్తోంది. తృటిలో రెండో స్థానం కోల్పోయి మూడో స్థానంలో ఉంది. అయితే ఓవరాల్ గా చూస్తే ఈ సీరియల్ ప్రారంభమైనప్పటి నుంచీ ఇదే బెస్ట్ రేటింగ్ కావడం విశేషం. ఆ లెక్కన ఈ మధ్యకాలంలో సీరియల్ రక్తి కట్టిస్తున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఈ సీరియల్ అర్బన్ రేటింగ్ 10.12గా ఉంది.
గుండెనిండా గుడి గంటలుతో పోలిస్తే ఇది తక్కువే. ఈ రెండు సీరియల్స్ దెబ్బకు కొన్నాళ్లుగా రెండో స్థానంలో ఉంటూ వస్తున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నాలుగో స్థానానికి పడిపోయింది. అటు కొత్త సీరియల్ నువ్వుంటే నా జతగా క్రమంగా దూసుకొస్తోంది. తాజా రేటింగ్స్ లో ఆ సీరియల్ ఏకంగా 8.76 రేటింగ్ సాధించడం విశేషం. అర్బన్ ఏరియాలోనూ 8.48 రేటింగ్ సొంతం చేసుకుంది.
రానున్న రోజుల్లో ఈ సీరియల్ మరింత పైకి దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి స్టార్ మాలో టాప్ 3 సీరియల్స్ మధ్య ప్రస్తుతానికి గట్టి పోటీ నెలకొంది. రానున్న వారాల్లో వీటి స్థానాలు ఎలా మారుతాయో చూడాలి.
సంబంధిత కథనం
టాపిక్