



Best Web Hosting Provider In India 2024

Salaar OTT Streaming: ఏడాదిగా ఆ ఓటీటీలో టాప్-10లో ట్రెండ్ అవుతున్న సలార్ చిత్రం.. ఓ రికార్డు!
Salaar OTT Streaming: సలార్ సినిమా హిందీ వెర్షన్ ఓటీటీలోకి వచ్చి ఏడాదైంది. ఈ మూవీ ఓటీటీలోనూ దుమ్మురేపింది. ఇప్పటికీ ఓటీటీలో ఈ చిత్రం ట్రెండ్ అవుతోంది.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ సినిమాకు క్రేజ్ విపరీతంగా ఉంది. థియేటర్లలో ఈ మూవీ బ్లాక్‍బస్టర్ అయింది. 2023 డిసెంబర్ 22న ఈ చిత్రం విడుదలైంది. సూపర్ హిట్ కొట్టింది. థియేట్రికల్ రన్ తర్వాత కూడా ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఓటీటీలోనూ దుమ్మురేపింది. చాలా మంది రిపీట్‍గా ఈ చిత్రాన్ని చూశారు. చాలాసార్లు ఎక్స్ (ట్విట్టర్)లో సలార్ ట్రెండ్ అయింది. సలార్ హిందీ వెర్షన్ ఓటీటీలోకి వచ్చి నేటి (ఫిబ్రవరి 16) ఏడాది అయింది.
ఏడాదిగా ట్రెండింగ్
సలార్ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో 2024 జనవరి 20న స్ట్రీమింగ్‍కు వచ్చింది. భారీ వ్యూస్‍తో అదరగొట్టింది. అయితే, సలార్ హిందీ వెర్షన్ మాత్రం 2024 ఫిబ్రవరి 16వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ (ఇప్పుడు జియోహాట్‍స్టార్) ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. హిందీలో కూడా ఆరంభం నుంచి సత్తాచాటుతోంది.
సలార్ హిందీ వెర్షన్ ఏడాదిగా టాప్-10లోనే ట్రెండ్ అవుతోంది. ఆరంభంలో చాలా వారాలు ట్రెండింగ్‍లో టాప్‍లో నిలిచింది ఈ మూవీ. ఆ హాట్‍స్టార్ హిందీ విభాగంలో తర్వాత కూడా టాప్-10లోనే నిలుస్తూ వస్తోంది. ఇలా ఏడాది కాలంగా ట్రెండింగ్‍లో ఉంటూ అదరగొడుతోంది.
ఖుషీ అవుతున్న ఫ్యాన్స్.. రికార్డు అంటూ..
సలార్ హిందీ వెర్షన్ ఏడాదిగా ట్రెండ్ అవుతోందంటూ సోషల్ మీడియాలో నేడు ప్రభాస్ అభిమానులు భారీగా పోస్టులు చేస్తున్నారు. దీంతో ఎక్స్‌లో సలార్ హ్యాష్‍ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఓ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఏడాది పాటు ట్రెండ్ అయిన తొలి, ఏకైక చిత్రంగా సలార్ రికార్డు సృష్టించిందంటూ పోస్టులు చేస్తున్నారు. ఈ మైల్‍స్టోన్‍ను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
సలార్ చిత్రం ఏడాదిగా ఆధిపత్యం చెలాయిస్తోందంటూ జియోహాట్‍స్టార్ కూడా నేడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “సీజ్‍ఫైర్ నుంచి ఫ్యాన్ ఫైర్! ఏడాది నుంచి సలార్ ఆధిపత్యం కొనసాగుతోంది” అంటూ పోస్ట్ చేసింది.
సలార్ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు. ఈ మూవీలో ప్రభాస్ విశ్వరూపం చూపించారు. కాటేరమ్మ ఫైట్ సహా ఈ మూవీలో కొన్ని యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీకి ఇప్పటికే క్రేజ్ కొనసాగుతూనే ఉంది.
సలార్ చిత్రంలో ప్రభాస్‍తో పాటు శృతి హాసన్, జగపతి బాబు, శ్రీయారెడ్డి, ఈశ్వరి రావు, మైమ్ గోపీ, బాబీ సింహా, టినూ ఆనంద్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు. ఈ మూవీకి భువన్ గౌడ సినిమాటోగ్రఫీ చేశారు.
సలార్ చిత్రం సుమారు రూ.700కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. సలార్ మూవీకి సీక్వెల్ కూడా రానుంది. సలార్2: శౌర్యాంగపర్వం అనే టైటిల్ కూడా ఖరారైంది. సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
గతేడాది కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్ మరో బ్లాక్‍బస్టర్ కొట్టారు. ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ మూవీతో పాటు హను రాఘవపూడితో ఓ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేయనున్నారు. ఆ తర్వాత సలార్ 2 పట్టాలెక్కే అవకాశం ఉంది. కల్కి 2 కూడా చేయాల్సి ఉంది.
సంబంధిత కథనం