Parenting Tips: పిల్లలు టీవీ, మొబైల్ చూడటం తగ్గిస్తే వచ్చే మార్పును గమనించారా! అద్భుతమైన ఫలితాలు చూడొచ్చు

Best Web Hosting Provider In India 2024

Parenting Tips: పిల్లలు టీవీ, మొబైల్ చూడటం తగ్గిస్తే వచ్చే మార్పును గమనించారా! అద్భుతమైన ఫలితాలు చూడొచ్చు

Ramya Sri Marka HT Telugu
Feb 17, 2025 10:30 AM IST

Parenting Tips: మీరెంత ఇంటిపనైనా చేయగలరు, ఎంత ఆఫీసు పనైనా మోయగలరు. కానీ, పిల్లలను ఆడించడం అంటే అదొక పెద్ద కష్టంగా ఫీలవుతుంటారు. అందుకే టీవీ లేదా ఫోన్ ఇచ్చి పిల్లలను డైవర్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. వాస్తవానికి ఆ అలవాటు మాన్పిస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయట. ఇది మీకు తెలుసా..

పిల్లలు టీవీ, మొబైల్ చూడటం తగ్గిస్తే వచ్చే మార్పును గమనించారా! అద్భుతమైన ఫలితాలు చూడొచ్చు
పిల్లలు టీవీ, మొబైల్ చూడటం తగ్గిస్తే వచ్చే మార్పును గమనించారా! అద్భుతమైన ఫలితాలు చూడొచ్చు

చిన్నారుల్లో టెలివిజన్, మొబైల్ ఫోన్స్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వారి ప్రవర్తనల్లో అనేక మార్పులు తీసుకురావొచ్చు. చాలా అధ్యయనాల్లో పేర్కొన్న దానిని బట్టి టీవీతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అలవాటుపడిన పిల్లల్లో సహనం చాలా తక్కువగా ఉంటుందని తేలింది. అంతేకాకుండా వారిలో ఆందోళన, ఒత్తిడి అనే భావాలు కూడా ఎక్కువగా కలుగుతుంటాయట. వీటికి అలవాటుపడిన పిల్లలు అందులో నుంచి బయటపడటం కూడా చాలా కష్టంగా మారిపోతుందట. స్కూల్స్ టీచర్లు, డాక్టర్లు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పి స్క్రీన్ టైం తగ్గించమని చెప్పినా అదే అలవాటును కొనసాగిస్తుంటాం.

కానీ, ఓ మహిళ ఈ పని చేసింది టీవీ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉంచి పిల్లల్లో స్కిల్స్ పెరిగేలా చేసింది. అదెలాగో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా..

ప్రత్యేకంగా మా అబ్బాయిని వారం మొత్తం రోజులో ఒక గంట మాత్రమే టీవీ చూడటానికి అనుమతించే దానిని. ఇక వారంతాల్లో కేవలం ఉదయం మాత్రమే టీవీ చూడనిచ్చే దానిని. ఇప్పటికీ అందులో ఎలాంటి మార్పు లేదు. నేను కూడా మా వాడితో కలిసి కొన్ని సినిమాలు, చిన్న చిన్న డాక్యుమెంటరీలు చూసేదానిని, కానీ, టీవీ షోలను మాత్రం ఎంకరేజ్ చేయలేదు. అదెలా మార్పు తీసుకొచ్చిందంటే, పూర్తిగా డిఫరెంట్ కిడ్ అయిపోయాడు. ఎప్పుడూ చదువుకోవడమే పనిగా మారిపోయింది. ఇప్పుడు అతని వయస్సుకు తగ్గట్టుగా కామిక్ బుక్స్ కొనిచ్చి ఇస్తున్నా. సాయంత్రం వేళల్లో స్కేటింగ్ కోసం బయటకు వెళుతుంటాడు. బొమ్మలతో ఆడుకోవడం, తన వస్తువులను తానే శుభ్రం చేసుకోవడం వంటి పనులను చేస్తుంటాడు. తనకు వచ్చిన ప్రతి ప్రశ్నను నా ముందుంచుతాడు, నా సమాధానాలను శ్రద్ధగా వింటాడు కూడా. ఇప్పుడు అతను చూసే వీడియోలు అన్నీ ఉపయోగకరమైనవే. పైగా వాటిని డైలీ చేసే పనుల్లో అనుసరించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఎలక్ట్రానిక్ వస్తువులు హానికరమైనవి కాకపోవచ్చు. కానీ, అవి పిల్లల్లో పెద్ద మార్పులు కనపడేలా చేయవచ్చుఅని ఆమె వివరించారు.

భాషా నైపుణ్యం పెరుగుతుంది

చిన్నారులు ఎక్కువగా మాట్లాడుతుండటం వల్ల వారిలో భాషా నైపుణ్యం పెరుగుతుంది. ఎక్కువసేపు టీవీ చూడటం వల్ల ఇతరులతో మాట్లాడే సమయం తగ్గిపోతుంది. ఇది వారిలో పదాల అవసరాన్ని తగ్గిస్తుంది. చివరికి భాషను ఎలా ఉపయోగించాలో కూడా అర్థం కాని గందరగోళంలో పడిపోతారు.

దృష్టిని కేంద్రీకరించడంలో సమస్యలు

టీవీ షోలలో సీన్లు వెంటవెంటనే మారిపోతుంటాయి. ఇవి వారిలో ఆటలకు, చదవడానికి ఉండే ఆసక్తిని తగ్గిస్తాయి. వారి మెదడులో ఆలోచనలు వెంటవెంటనే మారిపోతుంటాయి. ఫలితంగా ఒకే విషయంపై ఎక్కువసేపు దృష్టిని కేంద్రీకరించలేరు.

జ్ఞాపకశక్తిని తగ్గించేవిగా

మెమొరీ తగ్గించడంతో పాటు సమస్యను పరిష్కరించే శక్తి క్రమంగా తగ్గిపోతుంది. ఎక్కువసేపు టీవీని చూడటం వల్ల నేర్చుకునే స్వభావాన్ని, సమయాన్ని కోల్పోతారు. పిల్లల్లో క్రియేటివిటీతో పాటు సృజనాత్మకత కూడా తగ్గిపోతుంది.

నిద్ర సమస్యలు

ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉండే లైట్ కళ్లపై ఎక్కువసేపు పడటం వల్ల నిద్రపోయే సమయం తగ్గిపోతుంది. ఇంకా ఈ లైట్ వల్ల పిల్లల్లో నిద్రపుట్టించే మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అయ్యే స్థాయి తగ్గిపోతుంది. ఫలితంగా వారిలో ఎదుగుదల, అభివృద్ధి ఆగిపోతాయి.

ప్రవర్తనలో సమస్యలు

టీవీ ఎక్కువసేపు చూడటం వల్ల ప్రవర్తనలో చాలా రకాల మార్పులు రావొచ్చు. వారిని ఆవేశపూరితంగానే కాకుండా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోనివ్వకుండా చేయవచ్చు.

వీటితో పాటు ఫిజికల్ హెల్త్, సామాజిక ఎదుగుదల వంటి సమస్యలకు కూడా లోనవుతారు.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024