తుని ఘ‌ట‌న‌పై స్టేట్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు

Best Web Hosting Provider In India 2024

విజ‌య‌వాడ‌: తునిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప ఎన్నిక జరగకుండా టీడీపీ గుండాలు చేసిన దౌర్జన్యం వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు స్టేట్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ నీలం సాహ్నికి ఫిర్యాదు చేశారు. ఉప ఎన్నిక నేప‌థ్యంలో తుని మున్సిపల్ చైర్మన్ సుధా బాలు ఇంటి వద్ద వేలాదిగా ప‌చ్చ గుండాలు మోహరించి వైయ‌స్ఆర్‌సీపీకి పది మంది కౌన్సిలర్లు కౌన్సిల్‌ హాల్‌లోకి వెళ్లారు. కోరం లేకపోవడంతో ఎన్నిక జరగకుండా పచ్చనేతలు అడ్డుకుంటున్నారు. ఎన్నికలు సజావుగా జరపాలని హైకోర్టు ఆదేశాలను టీడీపీ నేత‌లు బేఖాతరు చేశారు. ఈ ఘ‌ట‌న‌ల‌పై వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు స్టేట్ ఎల‌క్ష‌న్ క‌మిష‌నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంద‌ర్బంగా మాజీ  ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ..పాలకొండ, పిడుగురాళ్ల, తుని ఉప ఎన్నికల్లో జరిగిన దౌర్జన్యంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామ‌న్నారు. అధికారులను నిద్రావస్థ నుంచి బయటపడేయాలని ఆయ‌న కోరారు.  మెజారిటీ లేకుండా…ప్రజాతీర్పు లేకుండా మా పార్టీ వారిని బెదిరించి గెలవాలని చూస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఏపీలో గూండా రాజ్యం నడుస్తోంద‌ని, 
సీనియర్ అధికారులు సైతం కనీసం  పనిచేయడం లేద‌ని విమ‌ర్శించారు. ఏపీ ప్రజలు ఓటేసి గెలిపించింది దౌర్జన్యాలు చేయడానికేనా అని కూట‌మి స‌ర్కార్‌ను ప్ర‌శ్నించారు. ఏకపక్ష నిర్ణయాలు…అధికారుల ప్రేక్షకపాత్ర అంతా రికార్డెడ్ గా ఉంటుందని గుర్తుంచుకోవాల‌ని మ‌ల్లాది విష్ణు హెచ్చ‌రించారు.కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నాయ‌కులు దేవినేని అవినాష్‌, కొమ్మూరి క‌న‌కారావు, నారాయ‌ణ‌మూర్తి త‌దిత‌రులు పాల్గొన్నారు.
 

Best Web Hosting Provider In India 2024