యలమంచిలిలో సాధికార యాత్రకు అపూర్వ స్వాగతం

Best Web Hosting Provider In India 2024

అనకాప‌ల్లి:  అశేష జనసందోహం హర్షధ్వానాల మధ్య ఉత్తరాంధ్రలో సామాజిక సాధికార బస్సుయాత్ర జోరుగా సాగుతోంది. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో ప్రజలు ఘనస్వాగతం పలికారు.జైజగన్ నినాదాలతో యాత్ర ఆసాంతం ఘనంగా సాగింది. బస్సుయాత్రలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు,రెవిన్యూ మంత్రి ధర్మానప్రసాదరావు, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తో పాటుగా ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కన్నబాబు రాజు తదితరులు కలిసి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి, లబ్ధిదారులతో ముచ్చటించారు. అనంతరం అచ్యుతాపురం పోలీస్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ జరిగింది. సభ ప్రారంభానికి ముందు రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్ పర్సన్ వంగపండు ఉష ఆధ్వర్యంలో ప్రదర్శించిన నృత్యాలు  విశేషంగా ఆకట్టుకున్నాయి.

సామాజిక అంతరాలను తొలగించిన ఘనత జగన్ దే. చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటో ఒక్కటంటే ఒక్కటైనా చెప్పాలి – రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు

రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వాల పాలనలతో విసిగిపోయి నిరాశ, నిస్పృహలతో నిట్టూరుస్తున్న వర్గాలకు జగన్ తన జనరంజక పాలనతో వెలుగులు నింపారన్నారు. గతంలో అధికారమిచ్చినపుడు ఏమీ చేయని చంద్రబాబు, ఇప్పుడు మళ్లీ అధికారం కావాలంటున్నాడని, కేవలం మరోసారి దోపిడీ కోసమే చంద్రబాబు అధికారంకోసం తపిస్తున్నాడని తెలిపారు. ప్రజలకు మేలు చేసే పనులను జగన్  చేసాడని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ నీడ లేని కుటుంబాలకు ఇళ్లు, వృద్ధులకు పెన్షన్, మహిళలకు, రైతులకు రుణాల మాఫీ చేయడం తప్పా అని చంద్రబాబుని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గుడని చంద్రబాబు చెప్తున్నాడని, సమాజంలోని అంతరాలను తొలగించడానికి సామాజిక సాధికారత చేయడం దుర్మార్గమా,  పేదలకు అసైన్డ్  భూమి పై అధికారాలు కట్టబెడుతూ చట్టబద్ధం చేయడం దుర్మార్గమా అని చంద్రబాబును  ధర్మాన ప్రసాదరావు నిలదీసారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి రావడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని, గతంలో డ్వాక్రా, రైతు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన విషయాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. తన వర్గానికి చెందిన కొంతమంది ధనవంతులకు సంపద దోచిపెట్టడానికే చంద్రబాబు అధికారం వినియోగిస్తాడని  మండిపడ్డారు. విశాఖను రాజధాని చేయడం ద్వారా  ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు వస్తే ఈ ప్రాంతం వృద్ధి చెంది మన భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని అన్నారు. చంద్రబాబు అమరావతిని రాజధాని చేస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రమే మేలు జరుగుతుందన్నారు. ప్రతీ కార్యక్రమం జగన్ పాలనలో పారదర్శకంగా జరుగుతోందని, అవినీతి లేని సమాజాన్ని స్థాపిస్తున్నారని వివరించారు. ధనిక, పేద మధ్య ఉన్న అంతరాలను తొలగించేది విద్య మాత్రమేనని సీఎం జగన్ గుర్తించారని, అందుకే నాడు – నేడు ద్వారా నాణ్యమైన విద్య అందించాలని సంకల్పించారన్నారు. చంద్రబాబు పదే పదే అబివృద్ధి చేశానని చెబుతుంటాడని, ఆయన చేసిన అభివృద్ధి ఏమిటో ఒక్కటంటే ఒక్కటి  చెప్పాలని ధర్మాన ప్రసాదరావు సవాల్ చేసారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను డిప్యూటీ సీఎంలు చేసిన ఘనత సీఎం జగన్ దే:  ఉప ముఖ్యమంత్రి బూడి

ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ, టీడీపీ గతంలో అనేక హామీలు ఇచ్చి మోసం చేయగా, జగన్ మాత్రం సీఎం అయిన వెంటనే రైతులకు, మహిళలకు, వృద్ధులకు, యువతకు చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చారని గుర్తు చేసారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రజాప్రతినిధులను ఉప ముఖ్యమంత్రులను చేసిన జగన్ కు ఆయా వర్గాలన్నీ రుణ పడి ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసి  రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు.

రానున్న ఎన్నికలలో  జగన్ ను మళ్లీ సీఎం చేసి  రుణం తీర్చుకోవాలి:   ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ

ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ, స్వర్గీయ వైఎస్ ఆర్ హయాంలో యలమంచిలిలో స్థాపించిన బ్రాండిక్స్ అపరల్ పార్కు, ఫార్మాసిటీ వంటి పారిశ్రామిక సంస్థల కారణంగా   ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లా నిరుద్యోగులకు చేయూతనిచ్చి ఉపాధి లభిస్తోందన్నారు. తన  సంక్షేమ పాలనతో ప్రతీ కుటుంబంలో వెలుగులు నింపిన సీఎం జగన్ ను  వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని, రానున్నఎన్నికలలో రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ ప్రజలకు ఎక్కడ కొట్టిందో ప్రజలు తిరిగి ఇప్పుడు  ఆపార్టీ ని తిరిగి అక్కడే కొట్టాలని, అందిరికీ అన్నం పెడుతున్న జగన్ కు ఓట్లను జనం పెట్టాలని పిలుపునిచ్చారు.

యలమంచిలిలో ఎకరా కోటి రూపాయల విలువ ఘనత దివనంగత వై ఎస్ ఆర్, సీఎం జగన్ లదే – ఎమ్మెల్యే కన్నబాబు రాజు

యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు తన హయాంలో బీసీలను తొక్కి పడేసారని, ఏ రోజునా న్యాయం చేయలేదని గుర్తు చేసారు. జగన్ సీఎం అయిన తర్వాత అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చారని కేబినెట్ లో  17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు లకు మంత్రి పదవులు, 4 రాజ్యసభ సీట్లు ఇచ్చారని, వెనుకబడిన వర్గాల పట్ల ఆయనకున్న ప్రేమకు ఇదే నిదర్శనమని  వివరించారు. స్వర్గీయ వైఎస్ఆర్ ఆనాడు చేసిన ఆలోచనలతో యలమంచిలి నియోజకవర్గంలో సెజ్ ఏర్పాటు చేయగా, ఇప్పుడు జగన్ హయాంలో సుమారు 200 కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తుండటంతో స్థానిక యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని కన్నబాబు వెల్లడించారు. దీని కారణంగా నియోజకవర్గం విస్తృతంగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఎకరం కోటి రూపాయలకు తక్కువకు  ఎక్కడా భూమి దొరకని పరిస్థితి  ఉందంటే ఏ స్థాయిలో పురోగతి  సాధించామో ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు.

అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి మాట్లాడుతూ, జగన్ పాలనలో లబ్ధి పొందిన ప్రతీ కుటుంబం తిరిగి తమను దీవించాలని కోరారు. పెన్షన్ పెంపుతో వృద్ధులు, నాడు – నేడుతో బాలలు, ఉద్యోగాల కల్పనతో యువత ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో జగన్ పాలనలో మనరాష్ట్రం దేశంలోనే సత్తా చాటిందని పేర్కొన్నారు.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *