Best Web Hosting Provider In India 2024
Crime Thriller OTT: అమ్మాయిలను టార్గెట్ చేసే సైకో కిల్లర్ – ఓటీటీలోకి వస్తోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ
Crime Thriller OTT: తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ దక్షిణ థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 21 నుంచి లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. కబాలి ఫేమ్ సాయిధన్సిక ఈ సైకో కిల్లర్ మూవీలో హీరోయిన్గా నటించింది.
Crime Thriller OTT: రజనీకాంత్ కబాలి ఫేమ్ సాయిధన్సిక హీరోయిన్గా నటించిన తెలుగు మూవీ దక్షిణ థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్, ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్సయ్యాయి. ఫిబ్రవరి 21న లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో దక్షిణ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా విడుదల తేదీని లయన్స్ గేట్ ప్లే అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో…
క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ టాలీవుడ్ మూవీకి ఓషో తులసీరామ్ దర్శకత్వం వహించాడు. రిషబ్ బసు, స్నేహా సింగ్, మేఘన చౌదరి కీలక పాత్రలో నటించారు. గత ఏడాది అక్టోబర్‌లో దక్షిణ మూవీ థియేటర్లలో రిలీజైంది. సాయిధన్సిక యాక్టింగ్, కొన్ని ట్విస్ట్‌లు బాగున్నా… సైకో కిల్లర్ సినిమాల్లో ఉండే థ్రిల్లర్ ఎలిమెంట్స్, లాజిక్స్ మిస్సవ్వడంతో దక్షిణ మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకున్నది.
దక్షిణ కథ ఇదే…
సిటీలో అమ్మాయిలను ఓ సైకో కిల్లర్ టార్గెట్ చేస్తాడు. కిరాతకంగా చంపేస్తుంటాడు. ఆ సైకో కిల్లర్‌ను పట్టుకునే బాధ్యత ఏసీపీ దక్షిణ తీసుకుంటుంటుంది. ఆ సైకో కిల్లర్ కారణంగా దక్షిణ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఉద్యోగానికి రాజీనామా చేసి మందుకు బానిసగా మారిపోతుంది.దక్షిణపై సైకో కిల్లర్ పగను పెంచుకోవడానికి కారణం ఏమిటి? ఆ కిల్లర్‌ను దక్షిణ పట్టుకుందా? అతడి గతం ఏమిటి అన్నదే దక్షిణ మూవీ కథ.
తెలుగు, తమిళ భాషల్లో..,.
రజనీకాంత్ కబాలితో ఫేమస్ అయ్యింది సాయి ధన్సిక. ఈ మూవీలో రజనీకాంత్ కూతురిగా యాక్షన్ రోల్లో కనిపించింది. . కబాలి తర్వాత తమిళంలో అరవన్, పరదేశి, కాత్తడి, ఉరు, లాభంతో పాటు పలు సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసింది. తెలుగులో షికారు, అంతిమతీర్పుతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది
మంత్ర మూవీతో…
ఛార్మి, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన మంత్ర మూవీతో డైరెక్టర్‌గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఓషో తులసిరామ్. 2007లో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధించింది.
మంత్ర మూవీకి సీక్వెల్లో ఛార్మితోనే మంగళ మూవీ చేశాడు ఓషో తులసిరామ్. మంత్ర స్థాయిలో సీక్వెల్ విజయాన్ని సాధించలేదు.
టాపిక్