Brahmamudi February 19th Episode: ఆస్తి మొత్తం కాజేసేందుకు రుద్రాణి ప్లాన్- రాజ్ ఫ్యాక్టరీకి నిప్పు పెట్టించిన అనామిక

Best Web Hosting Provider In India 2024

Brahmamudi February 19th Episode: ఆస్తి మొత్తం కాజేసేందుకు రుద్రాణి ప్లాన్- రాజ్ ఫ్యాక్టరీకి నిప్పు పెట్టించిన అనామిక

Brahmamudi Serial February 19th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 19 ఎపిసోడ్‌లో రుద్రాణికి ఫైనల్ వార్నింగ్ ఇచ్చి ఇంట్లో ఉండటానికి అనుమతి ఇస్తాడు సీతారామయ్య. అయినా మారని రుద్రాణి వాటా కాకుండా ఆస్తి మొత్తం తన పేరు మీద వచ్చేలా చేసుకుంటానని ప్లాన్ వేస్తుంది. కల్యాణ్‌ను బానిస అని అంటుంది ధాన్యలక్ష్మీ.

 
బ్రహ్మముడి సీరియల్‌ ఫిబ్రవరి 19వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ ఫిబ్రవరి 19వ తేది ఎపిసోడ్
 

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రుద్రాణి, రాహుల్‌ను వెళ్లగొడదామని ఇందిరాదేవి చెబుతుంది. ఆస్తి పంచి పంపించమని రుద్రాణి అంటుంది. ఈ మాట అంటావా లేదా అనే ఇప్పటిదాకా ఆగాను. అపాత్ర దానం చేయదలుచుకోలేదు. బయటకు వెళ్లిపో అని సీతారామయ్య అంటాడు. ఇగోకు పోతే అడుక్కు తినాలని అనుకున్న రుద్రాణి సీతారామయ్య కాళ్లపై పడుతుంది.

 

మళ్లీ మోసపోకండి

నన్ను క్షమించండి నాన్నా. ఇప్పటివరకు నా వల్ల గొడవలు వచ్చాయని అంతా అంటున్నారు. అది నా నోటి దురుసువల్ల అని ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు మేము ఏమైపోతాం. నా కోడలు, దానికి పుట్టినదాని మొహం చూసైనా ఇంట్లో ఉండనివ్వండి అని రుద్రాణి వేడుకుంటుంది. అయ్యయ్యో నాకోసం అంతలా కంగారుపడాల్సిన అవసరం లేదు. నన్ను బయటకు వెళ్లమనట్లే. మిమ్మల్ని మాత్రమే అంటున్నారు. నేను నా చెల్లెల్లితో కలిసి ఇంట్లోనే ఉంటాను. తాతయ్య ఇది నటన. మళ్లీ మోసపోకండి అని స్వప్న అంటుంది.

నాన్నా అంతా ఒక్కటయ్యారు. మేము వద్దంటే నుయ్యో గొయ్యో చూసుకుంటాం. ఇక నుంచి ఇంట్లో జరిగేవాటితో మాకు సంబంధం లేనట్లే ఉంటాం. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని రుద్రాణి అంటుంది. ఇందాక మీరు ఏడవాలంటే మరో జన్మ ఎత్తాలని అన్నావ్. అప్పుడే ఏడుస్తున్నావ్ అని స్వప్న అంటుంది. అక్క ఆగు. మేము సంతోషంగా ఉంటే నువ్ ఒక్క బిడ్డతో ఉంటావా. ఇప్పటికైనా నీ భర్తతో కలిసి ఉండాలి అని కావ్య అంటుంది.

అయితే, రాహుల్‌ను ఉంచి అత్తని పంపించండి. అత్త లేకుంటే రాహుల్ బుద్ధిగానే ఉంటాడు అని స్వప్న అంటుంది. తాతయ్య వాళ్ల వల్ల మా అక్క విసిగిపోయింది. రుద్రాణి చేసిన తప్పు వల్ల ఆ బిడ్డ తండ్రికి దూరమై బతకాల్సి వస్తుంది. ఆ బిడ్డకు అన్యాయమే జరుగుతుంది. ఆ తర్వాత నిర్ణయం మీదే తాతయ్య అని కావ్య అంటుంది. మనవరాలు చెప్పింది కూడా నిజమే కదా చిట్టీ. నువ్వేమంటావ్ అని సీతారామయ్య అంటాడు.

 

రుద్రాణికి ఫైనల్ వార్నింగ్

ఇప్పటికైనా రుద్రాణి కుదురుగా ఉంటుందా. మరోసారి ఏదైనా గొడవ లేవదీస్తే అని ఇందిరాదేవి అడుగుతుంది. ఉంటుంది, చచ్చిన పామును మళ్లీ చంపకు అమ్మ అని రుద్రాణి అంటుంది. పామే తనను చంపొద్దు అంటుందని స్వప్న అంటుంది. రుద్రాణి నాన్న నాకు మంచి ఆలోచలను ఇచ్చి ఎంతో సహాయం చేశారు. ఇదే చివరి అవకాశం. జాగ్రత్తగా ఉండమని సీతారామయ్య రుద్రాణికి ఫైనల్ వార్నింగ్ ఇస్తాడు. జాగ్రత్తగా ఉండమని ఇందిరాదేవి కూడా హెచ్చరిస్తుంది.

తర్వాత అందరూ కలిసి నన్ను ఇంట్లోంచి గెంటేయాలని చూస్తారా. మిమ్మల్ని ఎవరి వదిలిపెట్టను అని ఆవేశంతో అన్ని వస్తువులు పడేస్తుంది రుద్రాణి. రాహుల్ వచ్చి ఆపుతాడు. తాతయ్య అవకాశం ఇచ్చినందుకు సంతోషించు. మెడపట్టి గెంటేసేవారు. జస్ట్‌లో మిస్ అయ్యాం అని రాహుల్ అంటాడు. జస్ట్ మిస్ ఏంట్రా వీళ్లే నా చేతిలో జస్ట్ మిస్ అయ్యారు. నేను బయటకు అడుగుపెట్టిన క్షణం ఇల్లు స్మశానంలా కాకుండా ఉంటుందనుకున్నావా అని రుద్రాణి అంటుంది.

మరి అంత క్లారిటీ ఉన్నదానివి ఎందుకు అలా కాళ్లు పట్టుకున్నావ్. నాకు ఎంత సిగ్గుగా అనిపించిందో తెలుసా అని రాహుల్ అంటాడు. అవసరం అలాంటిది అని రుద్రాణి అంటుంది. మీ నాన్న గురించి తాత అంత గొప్పగా చెబుతున్నాడు. మీకు భాషాలాంటి కథ ఉందా అని రాహుల్ అంటాడు. ఇంతలో వచ్చిన స్వప్న వచ్చి అవును గొప్ప చరిత్ర కాదు పెద్ద చెత్త అది. మీ నాన్నలో ఒక్క లక్షణం కూడా రాలేదనుకుంటా. అంతా మీ అమ్మ పోలికలు అనుకుంటా అని స్వప్న సెటైర్లు వేస్తుంది.

 

నా పేరు మీదకు తెచ్చుకుంటాను

తర్వాత నువ్ మీ అమ్మలాగే తిరుగితే ఇవాళ కాళ్లు పట్టుకున్నట్టు నీతో కూడా కాళ్లు పట్టిస్తుంది. తల్లి అంటే పగ రగిల్చేది కాదు ప్రేమను పంచేది అని వెళ్లిపోతుంది స్వప్న. మరి ఇప్పుడు మన ప్లాన్ ఏంటీ అని రాహుల్ అంటే.. ఇన్నాళ్లు ఆస్తిలో వాటా కోసం చూశాను. కానీ, ఇప్పుడు ఆస్తి మొత్తం నా పేరుమీదకు తెచ్చుకుంటాను చూడు అని రుద్రాణి అంటుంది. మరోవైపు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని కల్యాణ్‌తో మాట్లాడుతారు రాజ్, కావ్య.

ఆ మాటలు వింటుంది అప్పు. నేను పూర్తిగా సెటిల్ అయ్యేవరకు రాకూడదనే అనుకున్నా వదినా. కానీ అమ్మ నాన్న వచ్చి స్వయంగా పిలిచాక రాక తప్పలేదు అని కల్యాణ్ అంటాడు. వచ్చి మంచి పని చేశారు. లేకపోతే మీరు రాకపోడానికి నేనే కారణం అని అంతా అనేవారు అని కావ్య అంటుంది. ఇంట్లో ఏది జరిగినా దానికి కారణం మీరే కదా అని కల్యాణ్ అంటాడు. దాంతో కావ్య, అప్పు షాక్ అవుతారు. ముందు నిందించినా తర్వాత దేవత అని పొగుడుతారు అని కల్యాణ్ అంటాడు.

తర్వాత ఏం లేకుండా అప్పును పోలీస్‌ను చేసి నాకన్నా గొప్పోడు అనిపించుకున్నాడు అని రాజ్ అంటాడు. ఇంతలో అందరిని ఉద్ధరించింది చాలు కానీ, తనను తాను ఉద్ధరించుకోమ్మని చెప్పు రాజ్ అని ధాన్యలక్ష్మీ అంటుంది. లిరిక్ రైటర్‌గా పని చేస్తున్నారు కదా అని కావ్య అంటుంది. ఒకరికింద పనిచేస్తే బానిస అవుతాడు కానీ రాజు అవలేడు కదా. పేరు అంటే రాజ్‌లా పేపర్‌లో పేరు తెచ్చుకోవాలి. రాసిన పేపర్స్ చూసి మురిసిపోవడం కాదు అని ధాన్యలక్ష్మీ అంటుంది.

 

బాధపడిన అప్పు

ముందు గెలిపించి చూపించు తల్లిగా సంతోషిస్తాను. అంతేకాని పెళ్లాన్ని ఉద్దరించాను అనుకుంటే దానివల్ల ఒరిగేది ఏం లేదు అని చెప్పేసి వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మీ. అప్పు చిరాకు పడుతుంది. కల్యాణ్ బాధపడుతాడు. తప్పకుండా సాధిస్తావ్. పిన్ని గురించి తెలిసిందే కదా అని కల్యాణ్‌ను రాజ్ తీసుకెళ్తాడు. అప్పు బాధపడటాన్ని కావ్య చూస్తుంది. తర్వాత అప్పు ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంది. కల్యాణ్‌ను తల్లి బానిస అన్నది గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది.

ఇంతలో కావ్య వస్తుంది. వెన్నెల్లో ఆడపిల్ల ఏదో బాధలో ఉన్నట్టుందని కావ్య అంటుంది. కాసేపు నన్ను ఇలా ఒంటరిగా ఉండనివ్వు అని అప్పు అంటుంది. కావ్య నచ్చ జెప్పటానికి ప్రయత్నిస్తుంది. కల్యాణ్ కూడా మంచి పొజిషన్‌లో ఉంటే నాతోపాటు అత్తయ్య కూడా సంతోషించేవారేమో కదా అని అప్పు అంటుంది. దానికి చేయాల్సింది చేస్తే సమస్య సరిపోతుంది. జరుగుతున్న తప్పును ఖండించాలి. కవి గారికి అవకాశం రాకుండా అడ్డు పడుతున్న వాన్ని దండించాలి అని కావ్య అంటుంది.

అర్థమయ్యేలా చెప్పమని అప్పు అంటుంది. మూడేళ్ల పాటు అగ్రిమెంట్ రాయించుకుని సొంత ప్రయత్నాలు చేయొద్దని కండిషన్ పెట్టాడు కదా లిరిక్ రైటర్ లక్ష్మీకాంత్. అలా అయితే కల్యాణ్ ఎలా ప్రయత్నిస్తాడు అని కావ్య అంటుంది. అర్థమైంది అక్క. ఇక ఆ రైటర్ లక్ష్మీ గాడి సంగతి నేను చూసుకుంటా అని అప్పు అంటుంది. మరి గట్టిగా హ్యాండిల్ చేయకు అని కావ్య అంటుంది. పక్కవాళ్ల టాలెంట్‌పై బతికేవాడిపై సానుభూతి ఏంటీ అని అప్పు అంటుంది.

 

అనామికను కొట్టిన సామంత్

కానీ, అలా చేస్తున్నట్లు కల్యాణ్‌కు తెలియకూడదు. లేకుంటే ఒప్పుకోడు అని కావ్య అంటుంది. కర్ర విరగకూడదు పాము చావాలి అంతేగా నేను చూసుకుంటా అని అప్పు వెళ్లిపోతుంది. పాపం ఆ రైటర్ అప్పు చేతిలో ఎలా నలిగిపోతాడో ఏంటో అని కావ్య అనుకుంటుంది. మరోవైపు అనామిక చెంప పగులగొడతాడు సామంత్. ఎందుకు కొట్టావ్ అని అరుస్తుంది అనామిక. కొట్టాల చంపాలా. నువ్ ఏదో తోపులా ప్లాన్ వేస్తున్నావ్ అని గొర్రెలా తల ఊపాను. కానీ, నా ఇంట్లోనే రాజ్ గాడు వచ్చి నా కాలర్ పట్టుకుని కొట్టేలా చేశావ్ అని సామంత్ అంటాడు.

నీ చుట్టూ తోక ఊపుకుంటూ తిరిగినందుకు క్లైంట్స్ ముందు పరువు పోయింది. నీ వల్ల నా లైఫ్ పోయింది అని సామంత్ అంటాడు. ఇది ఒక్కరి లైఫ్ కాదు ఇద్దరి లైఫ్ అని అనామిక అంటుంది. ఇంత జరిగాక నీతో ఉంటానని ఎలా అనుకున్నావ్. ఆ కంపెనీ నా పేరు మీదకు వస్తుందని చెప్పావ్. ఎక్కడ చేశావ్ అని సామంత్ అంటాడు. ఆ రాజ్ ఫ్యామిలీ లాగే నువ్ కూడా నన్ను తక్కువ అంచనా వేస్తున్నావ్ అని అనామిక అంటుంది.

 

లేదు ఇప్పుడే నాకు అర్థమైంది. నిన్ను నమ్మి కోట్లు ఖర్చు చేశాను. డబ్బు పోయింది కానీ నువ్ చెప్పింది ఒక్కటి జరగలేదు అని సామంత్ అంటాడు. నన్ను కొట్టినా భరిస్తాను కానీ అవమానిస్తే తట్టుకోలేను అని అనామిక అంటుంది. షటప్ అని మళ్లీ చేయి లేపిన సామంత్ ఆగుతాడు. నువ్ ఒక ఫెయిల్యూర్ పర్సన్‌వి. అనవసరంగా నిన్ను నమ్మి చేతులు కలిపాను. నీ పగల కోసం నా జీవితం సర్వనాశనం చేసుకున్నాను. నువ్ నోరు మూసుకుంటే నేను చేయాల్సింది చేసుకుంటాను అని వెళ్లిపోతాడు సామంత్.

ఇద్దరి లెక్కలు తేలుస్తా

నన్నే అవమానించావ్ కదా. నీ లెక్కలు ఆ రాజ్ ఫ్యామిలీ లెక్కలు అన్ని తేలుస్తాను అని అనామిక అనుకుంటుంది. మరోవైపు ఫ్రూట్స్, స్వీట్స్ సర్దుతుంది కావ్య. అది చూసి ఏంటిదని అడుగుతాడు రాజ్. ఇవన్నీ ఇక్కడ తినడం కాదు బూత్ బంగ్లాలో తినాలి. మీకు నాకు బూత్ బంగ్లా తప్పా ఏ స్థలము కలిసిరాలేదని నాకు అర్థమైంది. నేను నెలతప్పాలి. అక్కలాగే పాపకో బాబుకో జన్మనివ్వాలి అని కావ్య అంటుంది.

మరుసటి రోజు తనకు ఓ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం వచ్చినట్లు కల్యాణ్ చెబుతాడు. దాంతో అంతా సంతోషించి సంబురాలు చేసుకుంటారు. కానీ, దుగ్గిరాల ఇంట్లో చీకట్లు అలుముకుంటాయి. ఈసారి ఏకంగా లంకా దహనమే జరగబోతుంది అని రుద్రాణికి కాల్ చేసి అనామిక చెబుతుంది. మరోవైపు రాజ్ ఫ్యాక్టరీని ఎవరో తగలబెడుతున్నారని కాల్ వస్తుంది. అటువైపు పెట్రోల్ పోస్తుంటారు. దాంతో రాజ్ వెళ్లిపోతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024