Water Plants: మట్టి అవసరం లేకుండా నీటిలోనే పెరిగే తొమ్మిది మొక్కలు ఇవిగో, ఇంట్లో అందంగా పెంచుకోవచ్చు

Best Web Hosting Provider In India 2024

Water Plants: మట్టి అవసరం లేకుండా నీటిలోనే పెరిగే తొమ్మిది మొక్కలు ఇవిగో, ఇంట్లో అందంగా పెంచుకోవచ్చు

 

Water Plants: మొక్కలు పెంచాలంటే కచ్చితంగా మట్టి ఉండాలి. ఆ మట్టికి భయపడే చాలామంది మొక్కలు పెంచడం లేదు. కొన్ని మొక్కలకి మట్టి అవసరమే లేదు.

 
నీటితో పెరిగే మొక్కలు
నీటితో పెరిగే మొక్కలు

మొక్కలు పెరిగేందుకు నేల, నీరు అతి ముఖ్యమైనవి. ఇప్పుడు అపార్ట్‌మెంట్లలో ఎక్కువ మంది నివసిస్తున్నారు. మట్టిని ఉపయోగించి కుండీల్లో మొక్కలు పెంచడం వారికి కష్టంగా మారిపోతుంది. దానివల్ల బాల్కనీ పాడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే మొక్కలు పెంచడమే మానేస్తున్నారు.

 

అయితే కొన్ని రకాల మొక్కలకి మాత్రం నీరు తప్ప మట్టి అవసరం లేదు. అలాంటి మొక్కల జాబితాను ఇక్కడ ఇచ్చాము. ఇవి అన్నీ కూడా నీటిలో పెరిగే మొక్కలు. ఇవి మట్టిలో వేసినా పెరుగుతాయి. మట్టి లేకుండా కూడా పెరుగుతాయి. వీటిని మీరు చిన్న చిన్న గాజు సీసాలో నీటితోనే పెంచుకోవచ్చు. అన్ని నర్సరీలలో కూడా ఈ మొక్కలు లభిస్తాయి.

స్నేక్ ప్లాంట్

స్నేక్ ప్లాంట్స్ ఎక్కడైనా లభిస్తాయి. ఇవి మట్టిలో చాలా ఏపుగా పెరుగుతాయి. నీటిలో కూడా ఇవి పెరిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. నీటిలో ఈ చిన్న మొక్కను పెట్టి బాగా వెలుతురు ఉన్న స్థలం దగ్గర ఆ కుండీని ఉంచండి చాలు. మొక్క ఆరోగ్యంగా పెరిగేస్తుంది.

స్పైడర్ ప్లాంట్స్

అన్ని నర్సరీలలో కూడా స్పైడర్ ప్లాంట్స్ దొరుకుతాయి. చిన్న కొమ్మలుగా ఇవి పెరుగుతూ ఉంటాయి. వాటి పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. వీటికి మట్టి అవసరం లేదు. నీటిలోనే ఉంచితే ఈ మొక్క ఆరోగ్యంగా పెరగడం ప్రారంభమవుతుంది. గాజు గ్లాసు నీటిలో కూడా ఈ మొక్కలు పెరిగేస్తాయి.

మాన్‌స్టెరా

పెద్దపెద్ద ఆకులు ఉండే ఈ మొక్కలు మెత్తటి మట్టిలోనే కాదు నీటిలో కూడా బాగా పెరుగుతాయి. ఒక కాండాన్ని తీసి నీటిలో ఉంచండి. కాస్త గాలి వెలుతురు తగిలేచోట మీరు ఉన్న జాడీని పెట్టండి. అది మెల్లగా ఎదగడం ప్రారంభమవుతుంది.

 

మనీ ప్లాంట్

మనీ ప్లాంట్ నేలలోనూ, నీటి పైనా కూడా ఆరోగ్యంగా ఎదుగుతుంది. దీన్ని చాలా సులభంగా పెంచుకోవచ్చు. ఒక తీగను తీసుకొని నీటిలో పెట్టి కొంచెం వెలుతురు ఉన్నచోట పెడితే చాలు. ఇది చాలా అందంగా తీగమొక్కలాగా ఎదుగుతుంది. ఇంటికి కూడా ఎంతో ఆకర్షణను తెచ్చిపెడుతుంది. అయితే మట్టితో పోలిస్తే నీటిలో దీని పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది.

లక్కీ బాంబూ

ఇవి ఒక రకమైన వెదురు మొక్కలు. వీటిని ఇంట్లో పెంచితే మంచిదని చెబుతారు. వీటి పరిమాణం కూడా చిన్నగానే ఉంటుంది. లక్కీ బాంబూ అని పిలిచే ఈ మొక్కను ఎక్కువగా అలంకారానికి వినియోగిస్తూ ఉంటారు. దీనికి కూడా మట్టి ఉండాల్సిన అవసరం లేదు. ఒక జాడీలో నీటిని నింపి పైన అందంగా రాళ్ళను పేర్చండి. అందులో ఈ లక్కీ బాంబూ మొక్కను ఉంచండి. అది చక్కగా నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది.

పుదీనా

పుదీనాను కూడా హైడ్రోపోనికల్ గా పెంచవచ్చు. అంటే నీటిలోనే పెంచవచ్చు. మట్టితో పుదీనా అని పెంచడం ఇష్టం లేనివారు చక్కగా నీటిలోనే పుదీనాను పెంచేయండి. పుదీనా ఆకుల కాండాలను వేర్లతో సహా నీటిలో ఉంచి ఎండ తగిలే ప్రదేశంలో ఉంచండి. అదే ఆరోగ్యంగా పెరగడం గమనిస్తారు.

 

స్ప్రింగ్ ఆనియన్స్

స్ప్రింగ్ ఆనియన్స్‌నే ఉల్లికాడలు అని కూడా పిలుస్తారు. ఇవి కూడా నీటిలోనే పెరుగుతాయి. చిన్న స్థలంలో వీటిని పెంచుకోవచ్చు. ఒక గాజు గ్లాసులో నీటిని పోసి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ పెట్టండి. వేర్లు మునిగేలా చూసుకోండి. లేదా ఉల్లిపాయ మొలకలు వచ్చినప్పుడు ఆ ఉల్లిపాయను నీటిలోనే ఉంచి మునిగేలా చూడండి. అందులోంచి స్ప్రింగ్ ఆనియన్స్ బయటకి వస్తాయి. అయితే రోజుల్లో కనీసం నాలుగు గంటల పాటు దీనికి సూర్యకాంతి తగిలేలా చూసుకోండి.

కలబంద

కలబంద మొక్కను ఒక్కసారి వేస్తే చాలు సంవత్సరాల తరబడి ఎలా పెరుగుతూనే ఉంటుంది. ఇది మనిషి ఆరోగ్యానికి, అందానికి కూడా ఎంతో సహాయపడుతుంది. దీనికి కూడా ఎలాంటి మట్టి అవసరం లేదు, నీటిలోనే పెరిగిపోతుంది. అయితే కలబంద మొక్కను పెంచడానికి కాస్త పెద్ద మీరు అవసరం పడుతుంది.

టిల్లాండ్సియా

టిల్లాండ్సియ మొక్కలు ఎక్కువగా నర్సరీలో దొరుకుతూ ఉంటాయి. వీటిని చూస్తే ఈజీగా పోల్చేస్తారు. మీకు ఈ మొక్కను పెంచుకోవాలనిపిస్తే ముందు ఈ మొక్క ఎలా ఉంటుందో ఒకసారి ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. దాన్ని చూస్తే మీరు ఈజీగా గుర్తుపడతారు. దీనికి కూడా మట్టి ఉండాల్సిన అవసరం లేదు. నీటిలోనే దీన్ని పెంచవచ్చు. ఒక చిన్న కంటైనర్లో నీళ్లు వేసి ఈ మొక్కలను ఉంచండి. ఇది గాలి నుండే పోషకాలను తీసుకుంటుంది. కాబట్టి కాస్త గాలి వెళుతురు తగిలిచోట పెడితే సరిపోతుంది.

 
 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024