Best Web Hosting Provider In India 2024

వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఫైర్
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి కూటమి సర్కార్ ఓర్వలేకపోతోందని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను కలిసేందుకు వైయస్ జగన్ వెళ్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి? అంటూ మండిపడ్డారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైయస్ జగన్ వెళ్తే తప్ప రైతులను ఆదుకోవాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదంటూ నిలదీశారు. చంద్రబాబు ఏనాడైనా ప్రజల గురించి ఆలోచించారా? అని దుయ్యబట్టారు.
శైలజానాథ్ ఏమన్నారంటే..
‘‘హింస, ప్రతీకారాలకు తావులేదన్న చంద్రబాబు ఏం చేస్తున్నారు?. సూపర్ సిక్స్ పథకాలకు ఎంత ఖర్చయినా అమలు చేస్తానన్నారు. చంద్రబాబు చెప్పే మాటలకు, చేష్టలకు పొంతన ఉండదు. ప్రభుత్వ ఆస్పత్రిల్లో మందులు లేవు. ప్రభుత్వం తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. వైయస్ జగన్ మిర్చి యార్డుకు వెళ్తే ఎందుకు రక్షణ కల్పించలేక పోయారు?. హైకోర్టు కూడా ఇటీవల పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేశారు. మెడికల్ కాలేజీలను అడ్డుకున్నారు
రైతులు అవస్థలు పడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు?. రాయలసీమ రైతుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది?. రాజకీయాల్లో అనారోగ్యకరమైన పరిస్థితిని క్రియేట్ చేశారు. చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి నిజాయితీ రాజకీయాలు చేయాలి. పరిపాలన అంటే కక్షలు, ప్రతీకారాలు కాదు’’ అంటూ శైలజానాథ్ హితవు పలికారు.