Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu Today Episode: షాప్ ఓనర్‌గా మారిన మీనా – శృతిపై బాలు రివేంజ్ – ప్రభావతి వీరంగం!
గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 20 ఎపిసోడ్‌లో మీనా చేత పూల కొట్టు పెట్టిస్తాడు బాలు. ఆ షాప్‌కు ప్రభావతి పేరు పెడతాడు. భర్త సర్‌ప్రైజ్‌కు మీనా పొంగిపోతుంది. ఆ షాప్‌ను శృతి చేత ఓపెన్ చేయిస్తాడు బాలు.
బట్టలు ఉతికినందుకు శృతి డబ్బులు ఇవ్వడం చూసి మీనా ఎమోషనల్ అవుతుంది. భర్తతో తన బాధను చెప్పుకుంటుంది. బాత్‌రూమ్‌లు కడిగితే ఇంకా ఎంత కూలీ ఇస్తారోనని ఆవేదనకు లోనవుతుంది. నీకు విలువకట్టిన శృతిని వదిలిపెట్టేది లేదని బాలు ఆవేశంగా అంటాడు.
ఏమైనా తిన్నావా అని మీనాను అడుగుతాడు బాలు. బాధను దిగమింగగా వచ్చిన కన్నీళ్లతోనే కడుపు నిండిపోయిందని మీనా అంటుంది. మీనాను బాలు ఓదార్చుతాడు.
బాలుకు స్వాగతం…
ఉదయం నాలుగు గంటల టైమ్‌లో ఇంటి తలుపు దబదబ బాదిన శబ్ధం రావడంతో మీనా తల్లి పార్వతి కంగారు పడుతుంది. తమపై పగతో రలిగిపోతున్న రౌడీ గజ అనుకొని అతడిని కొట్టడానికి పార్వతి, శివ, సుమతి సిద్ధమై తలుపుతీస్తారు. బాలును చూసి ఆగిపోతారు.
మీ ఇంటికి వచ్చిన వాళ్లను ఇలాగే కొట్టి స్వాగతం పలుకుతారా అని బాలు కౌంటర్ వేస్తాడు. ఉదయమే బాలు తమ ఇంటికి రావడం చూసి మీనాకు ఏమైంది? కూతురు బాగానే ఉందా అని పార్వతి కంగారుగా అడుగుతుంది. ఎవరికి ఏం కాలేదని, గుడ్‌న్యూస్‌తో వచ్చానని బాలు అంటాడు. మీనా తల్లి కాబోతుందా అని సుమతి అడుగుతుంది. అదేం లేదని బాలు బదులిస్తాడు. ముగ్గురు రెడీ అయ్యి తనతో పాటు రావాలని బాలు ఆర్డర్ వేస్తాడు. శివకు డబ్బులిచ్చి ఓ పనిచెబుతాడు బాలు.
చరిత్ర తిరగరాస్తున్నా…
అసలు బాలు ఏం చేయబోతున్నాడో తెలియక పార్వతి, సుమతి అయోమయానికి లోనవుతారు. సర్‌ప్రైజ్ అని బాలు అంటాడు. ఇంటికొచ్చిన బాలు…మీనాను రెడీ కమ్మని తొందరపెడతాడు. ఎందుకు అని మీనా అడుగుతుంది. బాలు మందేసి ఏదేదో మాట్లాడుతున్నాడని మీనా అనుకుంటుంది. పొద్దున్నే వెళ్లి వైన్‌షాప్ ముందు నిలబడి మందేసే బ్యాచ్‌ల కనిపిస్తాన్నానా అని బాలు బదులిస్తాడు.
నిన్నటి చరిత్రను నేను తిరగరాయబోతున్నట్లు చెబుతాడు. ఎక్కడికి, గుడికా? ఫంక్షన్‌కా అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. సస్పెన్స్ లేకపోతే థ్రిల్ ఉండదని అంటాడు బాలు. అయినా మీనా ప్రశ్నల వర్షం ఆపకపోవడంతో ఇటుకరాయి తీస్తాడు. విసరడం నీకే నాకు నాకు వచ్చని అంటాడు.
బాలు ఫిదా…
ఉదయమే బాలు చేస్తోన్న హడావిడి చూసి ప్రభావతికి ఏం అర్థం కాదు. చీరలో మీనాను చూసి బాలు ఫిదా అవుతాడు. విరబూసిన పూలతోటలా ఉన్నావని కవిత్వం మొదలుపెడతాడు. చీరలో నీ అందం పెరిగిపోయిందని చెబుతాడు. ఇలాంటి చీర నువ్వు రోజు కట్టొచ్చు కదా అని అడుగుతాడు.
ఖరీదైన చీరలు కట్టుకొని వంట చేస్తూ బట్టలు ఉతకాలా అని మీనా అంటుంది. రెడీ అయ్యాను బయలుదేరుదామా అని మీనా అంటుంది. మిగిలిన వాళ్లు కూడా రెడీ కావాలి…అందరూ వస్తేనే కొన్ని లెక్కలు తేలుతాయని బాలు అంటాడు. ఈ రోజు కొత్త చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టబోతున్నానని చెబుతాడు.
బాలు టార్చర్…
మనోజ్, రవితో పాటు మిగిలిన వాళ్లను నిద్ర లేపుతాడు బాలు. అందరిని రెడీ అవ్వమని ఆర్డర్ వేస్తాడు. బాలు ఎక్కడికి తీసుకెళుతున్నాడో తెలియక తికమకపడతారు. ఉదయమే ఈ గోల ఏంటి అని అంటారు. తాను ఎక్కడికి రానని, కావాలంటే ఈ వంట అబ్బాయిని తీసుకెళ్లమని శృతి అంటుంది. ముఖ్యంగా రావాల్సింది నువ్వే డబ్బుడమ్మ అని బాలు అంటాడు.
ఎందుకు ఎక్కడికి మనోజ్ అంటాడు. అందరి గతాలు తవ్వి ఆట ఆడుకుంటాడు బాలు. అతడి టార్చర్‌ను భరించలేకపోతారు. బాలు తాగేసి వాగుతున్నాడని ప్రభావతి అపోహపడుతుంది. ఇంటి బయటకు రాగానే తల్లితోపాటు చెల్లి, తమ్ముడు కనిపించడంతో మీనా షాకవుతుంది.
ప్రభావతి ఆవేశం…
అందరిని గేటు బయటకు తీసుకొస్తాడు బాలు. తమ ఇంటి ముందు కవర్ కప్పి…ఓ బండి ఉండటం చూసి ప్రభావతి కోపం పట్టలేకపోతుంది. నీ ఇంటి ముందు షాప్ పెట్టే దమ్ము ఎవరికి ఉందని ప్రభావతి రెచ్చిపోతుంది. పోలీసులకు ఫోన్ చేస్తానని మనోజ్ అంటాడు.
ప్రభావతి పూలకొట్టు…
బండిపై ఉన్న కవర్ తీసేస్తాడు. దానిపై ప్రభావతి పూలకొట్టు అని పేరు ఉంటుంది. ప్రొప్రైటర్‌గా మీనా పేరు ఉంటుంది. నువ్వే ఈ షాప్‌కు ఓనర్‌వని మీనాతో అంటాడు బాలు. బాలు మంచి మనసుకు మీనా ఫిదా అయిపోతుంది.
శృతిపై రివేంజ్…
శృతి చేత మీనా షాప్ రిబ్బన్ కట్ చేయిస్తాడు బాలు. ఉచితంగా ఏ పని చేయించుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పి మీనా చేతుల మీదుగా శృతికి డబ్బులు ఇస్తాడు. మీనాకు డబ్బులు ఇవ్వడం నచ్చలేదని, ఆ డబ్బును తిరిగి ఇవ్వడానికే తన చేత రిబ్బన్ కట్ చేయించి మరో ఐదు వందలు ఎక్స్‌ట్రా ఇచ్చాడని తెలుసుకొని శృతి కోపంతో రగిలిపోతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం