Tamil OTT: ఓటీటీలోకి త‌మిళ యాక్ష‌న్ డ్రామా మూవీ – సూర్య, కృతిశెట్టి చేయాల్సిన సినిమా – వివాదాల‌తో వార్త‌ల్లో!

Best Web Hosting Provider In India 2024

Tamil OTT: ఓటీటీలోకి త‌మిళ యాక్ష‌న్ డ్రామా మూవీ – సూర్య, కృతిశెట్టి చేయాల్సిన సినిమా – వివాదాల‌తో వార్త‌ల్లో!

Nelki Naresh HT Telugu
Feb 20, 2025 11:58 AM IST

Tamil OTT: నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ బాలా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన త‌మిళ మూవీ వ‌నంగాన్ ఓటీటీలోకి వ‌స్తోంది. ఫిబ్ర‌వ‌రి 21 నుంచి టెంట్‌కోటా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. షూటింగ్ నుంచే అనేక వివాదాల‌తో వార్త‌ల్లో నిలిచిన ఈ మూవీలో అరుణ్ విజ‌య్ హీరోగా న‌టించాడు.

త‌మిళ ఓటీటీ
త‌మిళ ఓటీటీ

Tamil OTT: త‌మిళ మూవీ వ‌నంగాన్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను స‌డెన్‌గా అనౌన్స్‌చేశారు. ఫిబ్ర‌వ‌రి 21 నుంచి (శుక్ర‌వారం) టెంట్‌కోట ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విష‌యాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది.

అరుణ్ విజ‌య్ హీరో…

వ‌నంగాన్ మూవీలో అరుణ్ విజ‌య్‌, రోషిణి ప్ర‌కాష్‌, రిధా హీరోహీరోయిన్లుగా న‌టించారు. యాక్ష‌న్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ త‌మిళ మూవీకి నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ బాలా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ యావ‌రేజ్‌గా నిలిచింది. అరుణ్ విజ‌య్ యాక్టింగ్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్ బాగున్నాయ‌నే టాక్ వ‌చ్చింది బాలా స్టోరీ, టేకింగ్‌పై విమ‌ర్శ‌లొచ్చాయి.

సూర్య హీరో…

అనౌన్స్‌మెంట్ నుంచే వ‌నంగాన్‌ వివాదాల‌తో వార్త‌ల్లో నిలుస్తూ వ‌చ్చింది. సూర్య హీరోగా వ‌నంగాన్ మూవీ అనౌన్స్ అయ్యింది. హీరోగానే కాకుండా తానేస్వ‌యంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయ‌బోతున్న‌ట్లు సూర్య ప్ర‌క‌టించాడు. కృతిశెట్టిని హీరోయిన్‌గా తీసుకున్నారు. తెలుగులోనూ అచ‌లుడు పేరుతో రిలీజ్ చేయబోతున్న‌ట్లు వెల్ల‌డించారు. మూడు నెల‌ల పాటు షూటింగ్ జ‌రిగిన త‌ర్వాత సూర్య ఈ మూవీ నుంచి త‌ప్పుకున్నాడు. వ‌నంగాన్ షూటింగ్‌ను ఆపేస్తున్న‌ట్లు చెప్పాడు.

మ‌మితా బైజు…

సూర్య సినిమా నుంచి త‌ప్పుకోవ‌డంతో తానే నిర్మాత‌గా మారి అరుణ్ విజ‌య్‌తో డైరెక్ట‌ర్ బాలా వంన‌గాన్ సినిమాను పూర్తిచేశారు. ఈ సినిమాలో ప్రేమ‌లు ఫేమ్ మ‌మితాబైజు హీరోయిన్‌గా తీసుకున్నాడు. షూటింగ్ టైమ్‌లో బాలా త‌న‌పై చేయిచేసుకున్నాడ‌ని, మాన‌సికంగా వేధింపుల‌కు గురిచేశాడంటూ మ‌మితా బైజు ఆరోప‌ణ‌లు చేసింది. సినిమా నుంచి వైదొలిగింది.. వ‌నంగాన్ టైటిల్ త‌న‌దంటూ ఓ త‌మిళ ప్రొడ్యూస‌ర్ కోర్టు మెట్టు ఎక్కాడు. ఇలా ఎన్నో వివాదాల‌ను దాటుకుంటూ ఈ సినిమా రిలీజైంది.

రివేంజ్ డ్రామా…

అమ్మాయిల‌పై అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతోన్న వారిపై పుట్టుక‌తోనే మూగ చెవిటివాడైన ఓ యువ‌కుడు ఎలా రివేంజ్ తీర్చుకున్నాడ‌నే పాయింట్‌తోనే వ‌నంగాన్ మూవీ రూపొందింది. ఈ సినిమాకు జీవీ ప్ర‌కాష్ కుమార్ మ్యూజిక్ అందించాడు. 20 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 13 కోట్ల‌లోపే క‌లెక్ష‌న్స్‌ను ద‌క్కించుకున్న‌ది.

అవార్డులు…

సేతు, పితామ‌గ‌న్‌, నందా సినిమాల‌తో డైరెక్ట‌ర్‌గా స‌క్సెస్‌ల‌తో పాటు అనేక అవార్డుల‌ను అందుకున్నాడు డైరెక్ట‌ర్ బాలా. పితామ‌గ‌న్ మూవీ తెలుగులో శివ‌పుత్రుడు పేరుతో డ‌బ్ అయ్యింది. విక్ర‌మ్ హీరోగా న‌టించిన సేతు మూవీ నేష‌న‌ల్ అవార్డును గెలుచుకుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024