Rohit Sharma: అతడిని డిన్నర్‌కు తీసుకెళతా: కెప్టెన్ రోహిత్ శర్మ

Rohit Sharma: బంగ్లాదేశ్‍తో మ్యాచ్‍లో ఓ సింపుల్ క్యాచ్‍ను వదిలేశాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. దీంతో అక్షర్ పటేల్‍కు హ్యాట్రిక్ మిస్ అయింది. ఈ విషయంపై మ్యాచ్ తర్వాత స్పందించాడు హిట్‍మ్యాన్.

రోహిత్ శర్మ
రోహిత్ శర్మ 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‍తో గురువారం జరిగిన తన తొలి గ్రూప్-ఏ మ్యాచ్‍లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‍లో భారత స్పిన్నర్ అక్షర్ పటేల్‍కు హ్యాట్రిక్ ఛాన్స్ కాస్తలో మిస్ అయింది. మ్యాచ్ ముగిశాక ఈ విషయంపై టీమిండియా సారథి రోహిత్ శర్మ మాట్లాడాడు. తన తప్పిదాన్ని అంగీకరించాడు.

రోహిత్ తప్పిదం.. చేజారిన హ్యాట్రిక్

9వ ఓవర్లో బంగ్లాదేశ్ బ్యాటర్లు తంజిద్ అహ్మద్, ముష్పికర్ రహీమ్‍ను అక్షర్ వరుస బంతుల్లో ఔట్ చేశాడు. హ్యాట్రిక్ ఛాన్స్ ఉండటంతో తదుపరి బంతికి రెండు స్లిప్‍లను పెట్టాడు రోహిత్ శర్మ. అయితే, బంతి జాకేర్ అలీ బ్యాట్ ఎడ్జ్ తలిగి ఫస్ట్ స్లిప్‍లో ఉన్న రోహిత్‍కే క్యాచ్ వచ్చింది. అయితే, క్యాచ్‍ను మిస్ చేశాడు హిట్‍మ్యాన్. దీంతో అక్షర్ పటేల్‍కు హ్యాట్రిక్ మిస్ అయింది. లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ తీసిన తొలి భారత ఆటగాడిగా అక్షర్ నిలిచేవాడు. రోహిత్ క్యాచ్ డ్రాప్ చేయటంతో ఆ రికార్డ్ మిస్ అయింది.

డిన్నర్‌కు తీసుకెళతా

మ్యాచ్ తర్వాత డ్రాప్ క్యాచ్ గురించి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రశ్న ఎదురైంది. దీంతో అతడు స్పందించాడు. “నేను అతడిని (అక్షర్ పటేల్) రేపు డిన్నర్‌కు తీసుకెళ్లొచ్చు. అది చాలా సులువైన క్యాచ్. నా స్టాండర్డ్స్ ప్రకారం నేను ఆ క్యాచ్ పట్టాల్సింది. కానీ ఇలాంటివి అవుతుంటాయని నాకు తెలుసు. హృదోయ్, జాకీర్ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు” అని రోహిత్ శర్మ అన్నాడు.

క్యాచ్‍ మిస్‍తో భారీ మూల్యం

రోహిత్ క్యాచ్ మిస్ చేసిన తర్వాత జాకేర్ అలీ అదరగొట్టాడు. సున్నా వద్ద ఔట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడిన అతడు ఏకంగా 68 పరుగులు సాధించాడు. సెంచరీ చేసిన తౌహిద్ హృదోయ్‍ (100)తో కలిసి 154 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బంగ్లాదేశ్ 228 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది.

భారత్ టార్గెట్ ఛేదిస్తున్న సమయంలో కేఎల్ రాహుల్ క్యాచ్‍ను జాకెర్ అలీ డ్రాప్ చేశాడు. దీంతో “నేను కూడా నీ క్యాచ్ వదిలేశా” అని నవ్వుతూ అన్నాడు రోహిత్.

గిల్ సెంచరీ.. ఇండియా విక్టరీ

ఐదు వికెట్లు తీసి ఈ మ్యాచ్‍లో సత్తాచాటాడు భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ. ఆ తర్వాత లక్ష్యఛేదనలో యంగ్ స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్ (101 పరుగులు, నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. రోహిత్ శర్మ (41), కేఎల్ రాహుల్ (41 నాటౌట్) కూడా రాణించారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో తదుపరి పాకిస్థాన్‍తో ఫిబ్రవరి 23న తలపడనుంది భారత్. దుబాయ్ వేదికగానే ఈ మ్యాచ్ జరగనుంది.

Whats_app_banner
 
సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source link