



Best Web Hosting Provider In India 2024

Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ 10 సినిమాలు.. స్పెషల్‌గా 7, తెలుగులో 2 మాత్రమే.. ఇక్కడ చూసేయండి!
Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 10 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో 7 స్పెషల్ కాగా తెలగులో 2 మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో బాలకృష్ణ డాకు మహారాజ్‌తో పాటు మరిన్ని సినిమాలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5 ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి.
OTT Release Movies Today Telugu: ఓటీటీలోకి ప్రతివారం చాలా వరకు సినిమాలు వచ్చిన ఒక్క శుక్రవారం మాత్రం అధికంగా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా, ఇవాళ (ఫిబ్రవరి 21) నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ఆహా, జీ5 వంటి ఇతర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
డాకు మహారాజ్ (తెలుగు యాక్షన్ రివేంజ్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 21
సీఐడీ సీజన్ 2 (హిందీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా సిరీస్)- ఫిబ్రవరి 21
పాంథియాన్ సీజన్ 2- (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 21
మార్కో (తెలుగు వెర్షన్ మలయాళ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఆహా ఓటీటీ- ఫిబ్రవరి 21
బాటిల్ రాధ (తమిళ కామెడీ సినిమా)- ఆహా తమిళ్ ఓటీటీ- ఫిబ్రవరి 21
క్రైమ్ బీట్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- ఫిబ్రవరి 21
ఆఫీస్ (తమిళ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- ఫిబ్రవరి 21
సర్ఫేస్ సీజన్ 2 (ఇంగ్లీష్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ- ఫిబ్రవరి 21
చాల్‌చిత్రో ది ఫ్రేమ్ ఫాటల్ (బెంగాలీ మర్డర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా)- హోయ్‌చోయ్ ఓటీటీ- ఫిబ్రవరి 21
వనంగాన్ (తమిళ యాక్షన్ డ్రామా చిత్రం)- టెంట్‌కోట ఓటీటీ- ఫిబ్రవరి 21
డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్
ఇలా ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 10 డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటీలో చాలా స్పెషల్‌గా నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన యాక్షన్ రివేంజ్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ ఉంది. బాబీ కొల్లి దర్శకత్వంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్‌గా చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది.
తమిళంలో రెండు
దీంతోపాటు తమిళ రొమాంటిక్ కామెడీ ఎమోషనల్ సినిమా బాటిల్ రాధ, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ క్రైమ్ బీట్, తమిళ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ఆఫీస్, బెంగాలీ మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రం చాల్‌చిత్రో ది ఫ్రేమ్ ఫాటల్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ సీఐడీ సీజన్ 2 కూడా చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
మరో ఓటీటీలోకి మార్కో
ఇక మలయాళ సూపర్ హిట్ వయలెంట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా మార్కో తెలుగు వెర్షన్ నేటి నుంచే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదివరకు సోనీ లివ్ ఓటీటీలో కూడా తెలుగులో అందుబాటులో ఉన్నప్పటికీ మరో ఓటీటీ అయిన ఆహాలోకి నేడు వచ్చేసింది మార్కో.
స్పెషల్ 7- తెలుగులో 2
ఇలా ఈరోజు 10 ఓటీటీ రిలీజ్‌లో నాలుగు సినిమాలు, మూడు వెబ్ సిరీస్‌లతో 7 చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అయితే, వీటిలో రెండు మాత్రమే తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్నాయి.
సంబంధిత కథనం
టాపిక్