



Best Web Hosting Provider In India 2024

Vaginal Stitches Healing: ప్రసవం తర్వాత జననాంగానికి వేసిన కుట్లు మానాలంటే ఏం చేయాలి? నొప్పిని తగ్గించే చిట్కాలు!
Vaginal Stitches Healing: నార్మల్ డెలివరీ కూడా మహిళలకు జననాంగంలో కుట్లు వేస్తారు. సెన్సిటివ్‌గా ప్రాంతం కావడంతో నొప్పి కూడా తీవ్రంగా ఉంటుంది. ఈ కుట్లు మానిపోయేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నొప్పి పెరగకుండా ఉండేందుకు ఎటువంటి చిట్కాలు పాటించాలి?
నార్మల్ డెలివరీ అయిన తర్వాత చాలా మంది మహిళలకు జననాంగంలో కుట్లు వేస్తారు. జననాంగం నుంచి శిశువును బయటకు తీసుకువచ్చే సమయంలో కాస్త చీలిక ఏర్పడుతుంది. ప్రసవం తర్వాత ఈ చీలిక మానిపోయేందుకు కొంత భాగం వరకూ కుట్లు వేస్తారు. సిజేరియన్‌తో పోలిస్తే, నార్మల్ డెలివరీ మంచి ఆప్షన్. అయినప్పటికీ, జననాంగంలో వేసిన కుట్ల కారణంగా కాస్త నొప్పిగానే ఉంటుంది. వీటిని సరైన పద్దతిలో హ్యాండిల్ చేయలేకపోతే అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
చల్లని ఐస్ ప్యాక్ పెడితే బెటర్
కుట్లు వేసిన భాగంలో వాపు లేదా నొప్పిగా ఉంటే ఐస్‌తో మసాజ్ చేయండి. నేరుగా జననాంగంపై ఐస్ ముక్కలు రుద్దకుండా ఏదైనా గుడ్డ లేదా కవర్ లాంటి దానిలో ఉంచాలి. ఇలా 20-30 నిమిషాల వరకూ చేయడం వల్ల నొప్పి నుంచి రిలీఫ్ పొందగలరు.
నీటిలో కూర్చోవడం చాలా ముఖ్యం
నొప్పి నుంచి రిలీఫ్ పొందడానికి వేడి నీటిని ఉపయోగించడం ముఖ్యం. కుట్లను జాగ్రత్తగా చూసుకోవడానికి, డెలివరీ అయిన మహిళలకు స్నానం చేయించాలి. సాధారణంగా స్నానం చేయించేలా కాకుండా పెద్ద బకెట్‌లో లేదా బాత్ టబ్‌లో వెచ్చని నీటిని నింపండి. అందులో డెటాల్ లేదా బీటాడైన్ కొన్ని చుక్కలు వేయండి. ఆ ద్రావణంలో 10 నుండి 15 నిమిషాలు కూర్చోండి. ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. ఆ భాగంలో ఏర్పడిన బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. ఫలితంగా కుట్లు త్వరగా మానుకుంటాయి కూడా.
జననాంగాన్ని పొడిగా ఉంచండి
స్నానం చేసిన తర్వాత జననాంగాన్ని గట్టిగా రుద్దకండి. శుభ్రంగా, పొడిగా ఉంచుకోవడం ముఖ్యమే. కానీ, గట్టిగా రుద్దుకోవడం వల్ల కుట్లు వేసిన భాగంలో మళ్లీ గాయమయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా మెత్తటి గుడ్డతో శుభ్రపరుచుకోండి. దీనివల్ల ఏ రకమైన బ్యాక్టీరియా పెరగదు.
మందులు తప్పనిసరిగా వాడండి
అవగాహన లేకుండా ఇతరులు చెప్పిన మాటలు వినకండి. జననాంగానికి పడిన కుట్లను తగ్గిపోయేందుకు డాక్టర్ ఇచ్చిన మందులను సక్రమంగా వాడండి. దీనివల్ల కుట్లు మానిపోయి, వాటంతట అవే కరిగిపోతాయి. వైద్యులు సూచించిన యాంటీ బ్యాక్టీరియల్ క్రీములను మాత్రమే వాడండి.
ఆహారపదార్థాలను కరెక్ట్‌గా ఎంచుకోండి
గాయాలు మానిపోయేందుకు ఏయే ఆహార పదార్థాలు తీసుకోవాలో వైద్యుడు సలహా తీసుకోండి. తినకూడని ఆహారానికి దూరంగా ఉండటం చాలా మంచి విషయం. వీలైనంత వరకూ ఆహారం వేడిగా ఉన్నప్పుడే తీసుకోండి.
శుభ్రతను పాటించండి
జననాంగం చుట్టూ శుభ్రతను, పరిశుభ్రతను పాటించండి. బ్యాక్టీరియా పెరగకుండా చూసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు కలగకుండా ఉంటాయి.
ఒత్తిడి చేయకండి
జననాంగానికి పడిన కుట్లు కొన్ని రోజుల్లో వాటంతటే అవే కరిగిపోతాయి. కాబట్టి, కుట్లు మానిపోయే వరకు మీరు కూర్చొనే విధానాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పడుకునే సమయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి. దీనివల్ల కుట్లు తెగిపోకుండా ఉంటాయి. అంతేకాకుండా, వాటిపై అంతగా ఒత్తిడి పడదు.
సబ్బుతో కడగకండి
కుట్లు ఉన్న భాగంలో శుభ్రంగా ఉంచుకోవడానికి నీళ్లను మాత్రమే వాడండి. కఠినమైన సబ్బులు, గాఢమైన రసాయనాలు వాడకండి. ఇవి చర్మంపై పగుళ్లు వచ్చేలా చేసి, ఇతర గాయాలకు దారి తీస్తుంది. డాక్టర్ సూచించే వరకు ఎటువంటి సబ్బులను వినియోగించకండి. రసాయనాలు కలిగిన సబ్బులు చర్మాన్ని చికాకు పెట్టవచ్చు. ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచవచ్చు.
సంబంధిత కథనం