


Best Web Hosting Provider In India 2024

Tomato Purchase: టమాటా ధరల పతనంపై ప్రభుత్వం చర్యలు, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమాటా కొనుగోళ్లకు ఆదేశాలు
Tomato Purchase: టమాటా ధరలు గణనీయంగా పడిపోవడంతో ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.
Tomato Purchase: ఆంధప్రదేశ్‌లో టమాటా ధరల పతనంపై ప్రభుత్వం తక్షణ చర్యలకు ఆదేశించింది. రాష్ట్రంలో టమాటాను రైతుల నుంచి ప్రభుత్వమే మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మార్కెటింగ్ డైరెక్టర్ విజయ సునీత, సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మార్కెటింగ్ శాఖ రైతుల నుంచి శుక్రవారం నుంచి టమాట కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లులో నేరుగా విక్రయించాలని, పొరుగు రాష్ట్రాలకు అవసరం మేరకు ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వంలో పథకాలు సద్వినియోగం చేసుకోవాలని, అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించే రవాణా సబ్సిడీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆయా జిల్లాల మార్కెటింగ్ అధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్లు, రైతు బజార్ల అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు సమన్వయంతో ప్రత్యేకంగా కృషి చేయాలని ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగు దశ నుంచి మార్కెటింగ్ దశ వరకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని వెల్లడించారు. టమాటా కొనుగోళ్లకు అధికారులు తక్షణమే చర్యలు ప్రారంభించాలని, పరిస్థితి తనకు నేరుగా ఎప్పటికప్పుడు తెలియచేయాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు
సంబంధిత కథనం
టాపిక్