



Best Web Hosting Provider In India 2024

East Godavari : ప్రేమించాలని వేధింపులు.. నిరాకరించిన విద్యార్థిని.. దాడి చేసిన యువకుడు
East Godavari : తూర్పు గోదావరి జిల్లాలో ఘోరం జరిగింది. ప్రేమించలేదని ఇంటర్మీడియట్ విద్యార్థినిపై యువకుడు దాడి చేశాడు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి అతడికి రిమాండ్ విధించారు.
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని ఒక గ్రామంలో దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్థినిపై యువకుడు దాడి చేశాడు. ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ విద్యార్థిని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీలో చదివినప్పుడు గజ్జవరం గ్రామానికి చెందిన గుల్ల దిలీప్ కుమార్‌కి ఆ విద్యార్థినితో పరిచయం ఏర్పడింది.
మధ్యలో మానేసి..
గుల్ల దిలీప్ కుమార్ ఇంటర్మీడియట్ మధ్యలోనే మానేసి పొగాకు పనులకు వెళ్తున్నారు. కాలేజీలో చదివేటప్పుడే పరిచయం ఉండటంతో కొంత కాలంగా ఆమె వెంటపడుతున్నాడు. ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. అందుకు ఆ విద్యార్థిని నిరాకరించింది. దీంతో కాలేజీకి వెళ్లి విద్యార్థినిపై చేయి చేసుకున్నాడు. అయినా ఆమె అంగీకరించలేదు.
మరోసారి దాడి..
మళ్లీ ఈనెల 19న బుధవారం మరోసారి కాలేజీకి వెళ్లాడు. తనను ప్రేమించాలని అడిగాడు. ఆ విద్యార్థిని మళ్లీ నిరాకరించింది. తీవ్ర ఆగ్రహానికి గురైన దీలిప్ కుమార్.. తనను ప్రేమించాలని, లేకుంటే వదిలేది లేదని హెచ్చరించాడు. ప్రేమించకపోతే నీ ఫోటోలు నా వద్ద ఉన్నాయంటూ.. బ్లాక్ మెయిలింగ్‌కు దిగాడు. జీవితం నాశనం చేస్తానని బెదిరించి మరోసారి దాడికి దిగాడు. ఆమెకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని విద్యార్థిని తన తల్లిదండ్రులకు తెలిపింది.
పోలీసులకు ఫిర్యాదు..
ఎన్ని బెదిరింపులకు దిగినప్పటికీ దారిలోకి రాలేదని ఆమె తండ్రి ఫోన్‌కు తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఆమె తల్లిదండ్రులు కాలేజీకి వచ్చి జరిగిన విషయం తెలుసుకున్నారు. తాళ్లపూడి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై హత్యయత్నం కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేసి అరెస్టు చేశారు. న్యాయస్థానంలో నిందితుడిని ప్రవేశపెట్టగా.. న్యూయమూర్తి రిమాండ్ విధించారు.
కఠిన చర్యలు తప్పవు..
తాళ్లపూడి ఎస్ఐ రామకృష్ణ స్పందిస్తూ.. తమకు ఫిర్యాదు వచ్చిందని, దాని ప్రకారం విచారణ జరిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ జరిపామని.. ఇప్పటికే పలుమార్లు కాలేజీల్లో, పాఠశాల్లో ఈవ్ టీజింగ్, ర్యాగింగ్‌పై అవగాహన కల్పించామనని చెప్పారు. అక్కడక్కడ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని.. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్