AP Inter Hall Tickets: ఆన్‌లైన్‌లో అందుబాటులో ఇంటర్ హాల్ టిక్కెట్లు, వాట్సాప్‌ మనమిత్రలో కూడా లభ్యం..

Best Web Hosting Provider In India 2024

AP Inter Hall Tickets: ఆన్‌లైన్‌లో అందుబాటులో ఇంటర్ హాల్ టిక్కెట్లు, వాట్సాప్‌ మనమిత్రలో కూడా లభ్యం..

Sarath Chandra.B HT Telugu Feb 21, 2025 12:03 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu
Feb 21, 2025 12:03 PM IST

AP Education: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. ఇంటర్‌ పరీక్షలు మొదలు కానుండటంతో ఇంటర్ విద్యార్థులకు హాల్ టిక్కెట్లను జారీ చేస్తున్నారు. ఈ ఏడాది కాలేజీలతో సంబంధం లేకుండా నేరు వాట్సాప్‌ మనమిత్రలోనే హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు.

ఏపీ ఇంటర్మీడియట్ హాల్‌ టిక్కెట్లు విడుదల
ఏపీ ఇంటర్మీడియట్ హాల్‌ టిక్కెట్లు విడుదల
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

AP Inter Hall Tickets: ఏపీ ఇంటర్ హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. రెండు వారాల క్రితమే వాట్సాప్‌ మనమిత్రలో హాల్‌ టిక్కెట్లను విడుదల చేయగా తాజాగా ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో కూడా హాల్‌ టిక్కెట్లను విడుదల చేశారు.

ఏపీలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్‌, సెకండియర్‌ హాల్‌ టిక్కెట్లు ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. ఇంటర్‌ జనరల్, ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించిన థియరీ పరీక్షల హాల్‌ టిక్కెట్లను శుక్రవారం విడుదల చేశారు. ఫిబ్రవరి 21 నుంచి విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. కాలేజీ లాగిన్‌లతో పాటు విద్యార్థులు కూడా నేరుగా హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.విద్యార్థులు హాల్‌ టిక్కెట్లనున https://bie.ap.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులు ఫస్టియర్‌ హాల్‌ టిక్కెట్‌ నంబర్‌ లేదా ఆధార్‌ కార్డు, పుట్టిన తేదీ నమోదు చేసి హాల్‌ టిక్కెట్లను పొందవచ్చు. వాట్సాప్‌ మనమిత్ర ద్వారా కూడా హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వ వాట్సాప్‌ నంబర్‌ 95532 00009 సేవ్ చేసుకుని అందులో ఎడ్యుకేషన్‌ సర్వీసుల విభాగంలో ఇంటర్‌ హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 2025 హాల్‌ టిక్కెట్లను ఆధార్‌ కార్డు లేదా హాల్‌ టిక్కెట్‌ నంబర్‌, పుట్టిన తేదీతో కలిపి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు…

ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షల హాల్‌ టిక్కెట్లను వాట్సాప్‌ మనమిత్రలో అందుబాటులోకి తీసుకువచ్చారు. మార్చి 1 నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లను వాట్సప్ గవర్నెన్స్‌లో భాగంగా మనమిత్ర పేజీ ద్వారా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

ఇంటర్‌ విద్యార్థులు వాట్సప్ ద్వారా శుక్రవారం నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఇంటర్ విద్యార్థులకు కాలేజీ ఫీజులు బకాయిలు ఉన్నారంటే ప్రైవేటు కళాశాలలు పరీక్షల సమయంలో హాల్ టిక్కెట్లను నిలిపి వేయడం వంటి ఘట నలు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో మెగా భాగస్వామ్యంలో వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పలు రకాల ప్రభుత్వ సేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 161 సేవలను వాట్సాప్‌ భాగస్వామ్యంలో అందిస్తున్నారు.

ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్‌, సెకండియర్‌‌లలో దాదాపు 10.58 లక్షల మంది విద్యార్దులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షలకు సన్నద్దమవుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ప్రిపరేషన్ హాలీడేస్ ఇస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వ వాట్సప్ నంబరు 95523 00009 ద్వారా ఇంటర్ విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులకు కూడా హాల్‌ టిక్కెట్లను వాట్సాప్‌లో అందించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయానికి అనుసం ధానం చేయనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ 2025 పబ్లిక్ పరీక్షలు మార్చి 1నుంచి జరుగుతాయి. 2025 మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌, మోరల్ వాల్యూస్‌ పరీక్షల్ని ఫిబ్రవరి 1, 3వ తేదీల్లో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Ap IntermediateAndhra Pradesh NewsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024