


Best Web Hosting Provider In India 2024

NNS 21st February Episode: మిస్సమ్మను భాగీ అని పిలిచిన అమర్.. ఆనందంతో టేబుల్‌పైకి ఎక్కి డ్యాన్స్.. అనామిక ముందే..
NNS 21st February Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ శుక్రవారం (ఫిబ్రవరి 21) ఎపిసోడ్ లో మిస్సమ్మ ఇంట్లో వాళ్లు అందరి ముందే ఆనందంతో డ్యాన్స్ చేస్తుంది. ఎందుకో తెలుసుకోవాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడండి.
NNS 21st February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. పిల్లల కేర్ టేకర్ గా అమర్ ఇంట్లోకి అడుగుపెడుతుంది అనామిక. అంజు ఆమెకు ఇల్లంతా తిప్పి చూపిస్తుంది. అంతేకాదు అనామిక అక్కడే ఉండటానికి అమర్ తోపాటు శివరాం, నిర్మల అంగీకరిస్తారు. మనోహరి, మిస్సమ్మ మాత్రం ఆందోళనగా ఉంటారు.
మిస్సమ్మలో అనుమానం
అనామికలాంటి అందమైన అమ్మాయి ఇంట్లో ఉంటే అమర్ సార్ ఏదైనా తప్పు చేయొచ్చని మిస్సమ్మకు నూరిపోస్తాడు రాథోడ్. దీంతో ఆమెను ఎలాగైనా బయటకు పంపించాలని ఆమె అనుకుంటుంది. ఉదయాన్నే వచ్చి సాయంత్రం వెళ్లిపోతే చాలని ఆమెతో అంటుంది. అయితే అనామిక తన ఇంట్లో పరిస్థితిని చెప్పడంతో ఇక్కడే ఉండొచ్చు కదా అని శివరాం, నిర్మల అంటారు.
ఇంట్లో పైన మరో గది కూడా ఉందని, అందులో ఉండొచ్చని అంజు కూడా అంటుంది. దీనికి అమర్ కూడా సరే అంటాడు. అనామికను ఇంట్లోనే ఉండమని చెబుతాడు. దీంతో ఓవైపు ఆమెకు ఎక్కడ గతం గుర్తుకు వస్తుందో అని మనోహరి.. అమర్ ఆమెను చూసి ఎక్కడ ఆకర్షితుడు అవుతాడో అని మిస్సమ్మలో ఆందోళన మొదలవుతుంది. అయినా అనామిక పరిస్థితి గుర్తొచ్చి ఇలా ఎందుకు ఇరికించావు దేవుడా అని మిస్సమ్మ అనుకుంటుంది.
అరుంధతి ఫొటో చూసిన అనామిక
అంతకుముందే అంజు ఇల్లంతా తిప్పి చూపిస్తుంది. చివరికి పిల్లలు ఆమెను తమ గదిలోకి తీసుకెళ్తారు. అక్కడ అంజు ఆమెకు తప్పుడు టైమ్ టేబుల్ చెబుతుంది. ఆలస్యంగా లేవడం, టీవీ చూడటం, వీడియో గేమ్స్ ఆడటంలాంటివన్నీ చేస్తామని అంటుంది. అవన్నీ విని అనామిక కూడా ఆశ్చర్యపోతుంది. చివరికి మీ అమ్మను మిస్సమ్మ అని ఎందుకు పిలుస్తున్నారని అడుగుతుంది.
ఆమె మా అమ్మ కాదు అని పిల్లలు చెబుతారు. అనామిక కళ్లు తమ తల్లి అరుంధతిలాగే ఉన్నాయని పిల్లలు అనడంతో అరుంధతి ఫొటో చూపించాలని అనామిక అడుగుతుంది. గదిలోని అరుంధతి ఫొటో చూడగానే అనామిక షాక్ తింటుంది.
మిస్సమ్మ డ్యాన్స్
మరోవైపు ఇష్టం లేకపోయినా అనామికను ఇంట్లో ఉండేందుకు ఓకే చెప్పిన మిస్సమ్మ.. అమర్ కు మరింత దగ్గర కావాలని చూస్తుంది. అతన్ని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. రాథోడ్ కు అదే చెప్పి అమర్ దగ్గరకు వెళ్తుంది. తిరిగి కిందికి వస్తూ మెట్ల మీది నుంచే డ్యాన్స్ చేస్తూ వస్తుంది.
అది చూసిన రాథోడ్.. నీ ప్రేమను వ్యక్తపరుస్తానని చెప్పి వెళ్లి ఇప్పుడేంటి పిచ్చిదానిలాగే డ్యాన్స్ చేసుకుంటూ వస్తున్నావని అడుగుతాడు. దీంతో కాసేపాగు నీకు తెలుస్తుందని మిస్సమ్మ అంటుంది. వన్, టు, త్రీ అనగానే భాగీ అని గట్టిగా పిలుస్తాడు అమర్.
అది విని ఇంట్లో వాళ్లందరూ షాకవుతారు. మనోహరి అయితే గదిలో నుంచి ఉలిక్కిపడి బయటకు వస్తుంది. ఇటు మిస్సమ్మ ఆనందానికి అవధులు ఉండవు. హైలెస్సా హైలెస్సా అంటూ హాల్లో ఉన్న టేబుల్ పైకి ఎక్కి మరీ డ్యాన్స్ చేస్తుంది. ఇంతకీ మిస్సమ్మ ఏం చేసింది? అమర్ ఆమెను ఎందుకలా ప్రేమగా పిలుస్తాడు అన్నది తెలుసుకోవాలంటే శుక్రవారం (ఫిబ్రవరి 21) ప్రసారమయ్యే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూడాల్సిందే.
సంబంధిత కథనం
టాపిక్