



Best Web Hosting Provider In India 2024

OTT Web Series: ఈనెల చివరి రోజున రెండు థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌లు.. మిస్ కావొద్దు! తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Web Series: ఎంతో ఎదురుచూస్తున్న రెండు వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు రెడీ అయ్యాయి. ఈనెలాఖరులో ఓటీటీల్లో అడుగుపెట్టనున్నాయి. ఇందులో ఒకటి పాపులర్ సిరీస్‌కు రెండో సీజన్‌గా వస్తోంది. ఆ రెండు వెబ్ సిరీస్‌లు, ప్లాట్ఫామ్లో ఏవో ఇక్కడ తెలుసుకోండి.
ఈనెల ఫిబ్రవరి చివరి రోజున 28వ తేదీ ఓటీటీల్లో రెండు అవైటెడ్ వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు రానున్నాయి. రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. సూపర్ సక్సెస్ అయిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సుడల్: ది వర్టెక్స్ సిరీస్‌కు రెండో సీజన్ స్ట్రీమింగ్కు రానుంది. జ్యోతిక లీడ్ రోల్ చేసిన మరో థ్రిల్లర్ సిరీస్ అడుగుపెట్టనుంది. ఈ రెండు వెబ్ సిరీస్‌ల వివరాలు ఇవే..
డబ్బా కార్టెల్
డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 28వ తేదీన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో షబానా ఆజ్మీ, జ్యోతిక, గిరిజా రావ్, నిమిషా సంజయన్, షాలినీ పాండే, సాయి తంహన్కర్ లాంటి పాపులర్ నటీమణులు ప్రధాన పాత్రలు పోషించారు. జిస్సు సెంగుప్తా, లిల్లెట్ దూబే, భూపేంద్ర సింగ్ జడావత్ కీలకపాత్రలు చేశారు. ఫుడ్‌ను క్యారేజీల్లా అందించే డబ్బా బిజినెస్ చేసే మహిళలు డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకోవడం చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది.
డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్‌కు హితేశ్ భాటియా దర్శకత్వం వహించగా.. శిబానీ అక్తర్, విష్ణు మీనన్, గౌరవ్ కపూర్, ఆకాంక్ష సేదా క్రియేటర్లుగా ఉన్నారు. ఇటీవలే వచ్చిన ట్రైలర్ థ్రిల్లింగ్‌గా ఆకట్టుకుంది. ట్విస్టులతో సాగే సిరీస్‌లా అనిపిస్తోంది. ఈ సిరీస్‌ను ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ పతాకం నిర్మించింది. ఫిబ్రవరి 28న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో వచ్చే ఈ సిరీస్‌ను మిస్ కాకుండా చూడాల్సిన థ్రిల్లర్‌లా అనిపిస్తోంది. ఈ హిందీ సిరీస్ తెలుగుతో పాటు మరిన్ని భాషల డబ్బింగ్లోనూ అందుబాటులోకి రానుంది.
సుడల్: ది వర్టెక్స్ సీజన్ 2
సుడల్: ది వర్టెక్స్ సీజన్ 2 కోసం చాలా మంది ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ రెండో సీజన్ ఈనెలాఖరు ఫిబ్రవరి 28న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. మూడేళ్ల క్రితం వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ఫస్ట్ సీజన్ చాలా సక్సెస్ అయింది. దర్శకద్వయం పుష్కర్, గాయత్రి తెరకెక్కించిన ఈ సిరీస్ మెప్పించింది. ట్విస్టులతో థ్రిల్లింగ్ అనుభూతి ఇచ్చింది. అందుకే సుడల్ 2వ సీజన్‌పై హైప్ విపరీతంగా ఉంది.
సుడల్ 2వ సీజన్లోనూ ఐశ్వర్య రాజేశ్, కాథిర్ లీడ్ రోల్స్ పోషించారు. లాల్, శరవణన్, కాయల్ చంద్రన్, మంజిమా మోహన్, మోనిషా బ్లెస్సీ, గౌరి జీ కిషన్, సంయుక్త విశ్వనాథన్, అభిరామి బోస్ కీరోల్స్ చేశారు. జైలు పాలైన నందిని (ఐశ్వర్య రాజేశ్) విడిపించే ప్రయత్నం చేయడం, లాయర్ చెల్లప్ప (లాల్) హత్య, మిస్టరీతో ఉన్న కేసును ఎస్ఐ చక్రవర్తి (ఖాతిర్) దర్యాప్తు చేయడం చుట్టూ ఈ రెండో సీజన్ సాగుతుంది. ఇటీవలే వచ్చిన సుడల్ 2 ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉంది. ఈ సీజన్ కూడా ట్విస్టులు గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది.
సుడల్ 2 సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 28 నుంచి చూడొచ్చు. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వస్తుంది. ట్రైలర్ తెలుగులోనూ వచ్చింది. ఈ సిరీస్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.
మొత్తంగా ఈనెలాఖరులో డబ్బా కార్టెల్‌తో నెట్‌ఫ్లిక్స్, సుడల్ 2 సిరీస్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియో పరస్పరం పోటీ పడుతున్నాయి. ప్రేక్షకులకు రెండు థ్రిల్లర్స్ ఒకే రోజు చూసేందుకు అందుబాటులోకి వస్తున్నాయి.
సంబంధిత కథనం