



Best Web Hosting Provider In India 2024

OTT Action: ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి వచ్చిన తమిళ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT Tamil Action Drama: వనంగాన్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఒకే రోజు రెండు ప్లాట్‍ఫామ్‍లోకి అడుగుపెట్టింది. బాల దర్శకత్వం వహించిన ఈ మూవీని ఎక్కడ చూడొచ్చంటే..
వనంగాన్ చిత్రం మంచి అంచనాలతో వచ్చింది. ప్రయోగాత్మక చిత్రాలు చేసే బాల దర్శకుడు కావటంతో ఈ మూవీకి బజ్ ఏర్పడింది. ఈ ఏడాది జనవరి 10న ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. అయితే, అనుకున్న స్థాయిలో ఈ మూవీ కలెక్షన్లను సాధించలేకపోయింది. మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది. వనంగాన్ చిత్రం నేడు రెండు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్‍లు ఇవే
వనంగాన్ చిత్రం నేడు (ఫిబ్రవరి 21) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. టెంట్‍కొట్టా అనే ఓటటీలోనూ ఈ సినిమా ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఒకే రోజు రెండు ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. రెండు ఓటీటీల్లోనూ వనంగాన్ చిత్రం తమిళంలో ఒక్కటే అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.
వనంగాన్ మూవీలో అరుణ్ విజయ్ ప్రధాన పాత్ర పోషించారు. రిధా, రోహిణి ప్రకాశ్, సముద్రఖని, మిస్కిన్ కీలకపాత్రల్లో నటించారు. కంటిచూపు లేని అమ్మాయిలను వేధిస్తున్న వారిపై మాటలు రాని, సరిగా వినపడని ఓ బధిరుడు రివేంజ్ తీర్చుకోవడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రంలో బధిరుడిగా అరుణ్ విజయ్ నటనటో మెప్పించారు. బాల ఈ చిత్రంలో తన మార్క్ చూపించలేకపోయారనే కామెంట్స్ వచ్చాయి. మూవీ ఎంగేజింగ్‍గా లేదంటూ మిక్స్ట్ రెస్పాన్స్ వచ్చింది.
వనంగాన్ కలెక్షన్లు
వనంగాన్ చిత్రం సుమారు రూ.30కోట్ల బడ్జెట్‍తో రూపొందిందనే అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ సుమారు రూ.13కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. కమర్షియల్‍గా ప్లాఫ్‍గా నిలిచింది.
వనంగాన్ మూవీని బీ స్టూడియోస్, వీ హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై డైరెక్ట్ బాల, సురేశ్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి ముందుగా తమిళ స్టార్ హీరో సూర్యకు చెందిన 2డీ ఎంటర్‌టైన్‍మెంట్ ప్రొడక్షన్ హౌస్‍గా ఉండేది. అయితే, ఆ తర్వాత కథలో మార్పులు చేయడంతో ఆ బ్యానర్ తప్పుకుంది. కీర్తి శెట్టి కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికి వెళ్లారు. ఇలా ఈ ప్రాజెక్టు కొన్ని ఇబ్బందులతో మొదలైంది. మొత్తానికి గతేడాది ఏప్రిల్‍లోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎట్టకేలకు ఈ ఏడాది జనవరిలో థియేటర్లలోకి వచ్చింది.
వనంగాన్ చిత్రంలో పాటలకు జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు అందించారు. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍ను సామ్ సీఎస్ ఇచ్చారు. ఆర్బీ గురుదేవ్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ మూవీకి సతీశ్ సూర్య ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రైమ్ వీడియోతో పాటు టెట్‍కొట్టా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీకి స్ట్రీమింగ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
సంబంధిత కథనం