



Best Web Hosting Provider In India 2024

TV Serial: సీరియల్‍లో హీరోహీరోయిన్లు దూరం కాకూడదని అమ్మవారికి పూజలు.. కన్నీరు పెట్టుకున్న నటి: వీడియో
TV Serial: ప్రేమికుల మేఘసందేశం పేరిట జీ తెలుగు టీవీ ఛానల్ ఇటీవల ఓ ఈవెంట్ నిర్వహించింది. కొన్ని సీరియల్స్ హీరోహీరోయిన్లతో ఈ ఈవెంట్ సాగింది. ఈ ఈవెంట్లో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది.
జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ‘మేఘసందేశం’ సీరియల్ చాలా పాపులర్ అయింది. ప్రస్తుతం ఆ ఛానెల్‍లో ఎక్కువ టీఆర్పీ సొంతం చేసుకుంటున్న సీరియల్‍గా నడుస్తోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, కుటుంబాల మధ్య గొడవలతో ఈ సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. దీంతో మేఘసందేశం సీరియల్‍కు ఫ్యాన్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. కాగా, ఈ సీరియల్‍లో హీరోహీరోయిన్ల క్యారెక్టర్లు అయిన గగన్, భూమి దూరం కాకూడదని ఏకంగా అమ్మవారికే కొందరు పూజలు చేశారట. ఆ వివరాలు ఇవే..
ఇదీ జరిగింది
ఛానెల్‍లో ప్రసారమవుతున్న సీరియళ్లలోని హీరోహీరోయిన్లతో వాలెంటైన్స్ డే సందర్భంగా ఇటీవల ప్రేమికుల మేఘసందేశం పేరుతో జీ తెలుగు టీవీ ఛానెల్ కర్నూలులో ఓ ఈవెంట్ నిర్వహించింది. మేఘసందేశం సీరియల్‍లో భూమిగా పాత్రలో నటిస్తున్న భూమిక రమేశ్ ఈ ఈవెంట్‍లో పాల్గొన్నారు.
ఈ ఈవెంట్‍లో మేఘసందేశం ప్రధాన నటి భూమి వేదికగా మీద ఉండగా.. ఆమె ఫ్యాన్స్ కొందరు వస్తారని యాంకర్ ప్రకటించారు. ఇంతలో కొందరు మహిళలు చీర తీసుకొని వేదికపైకి వచ్చారు. గగన్‍కు భూమి దూరం అవకుండా ఉండాలని అమ్మవారికి పూజలు చేశామని చెప్పారు. “మీరు గగన్‍కు దూరం అవకుండా ఉండాలని కర్నూలులో ఉన్న అమ్మవార్లను పూజించి చీరను తీసుకొచ్చాం” అని ఓ మహిళ భూమితో చెప్పారు. చీర అందించారు.
కన్నీరు పెట్టుకున్న భూమి
తనపై అభిమానంతో పూజలు చేసి చీర తేవటంతో మేఘసందేశం భూమి (భూమిక రమేశ్) ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. మోకాళ్లపై కూర్చొని ప్రేక్షకులకు అభివాదం చేశారు.
సీరియల్‍లో పాత్రలు విడిపోకూడదని కూడా పూజలు చేస్తారా అంటూ అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో ఈవెంట్ ప్రసారం
ప్రేమికుల మేఘసందేశం ఈవెంట్ కర్నూలులో ఇటీవల జరిగింది. ఈ ఈవెంట్‍ను త్వరలో ప్రసారం చేస్తామని జీ తెలుగు ప్రోమో తీసుకొచ్చింది. ఇంకా టెలికాస్ట్ డేట్ వెల్లడించలేదు. వారంలోగానే ప్రసారమయ్యే అవకాశం ఉంది. వివిధ సీరియళ్ల ప్రధాన నటీనటులు ఈ ఈవెంట్‍లో పాల్గొన్నారు.
గగన్, భూమి మధ్య దూరం
మేఘ సందేశం సీరియల్‍లో గగన్ (అభినవ్ విశ్వనాథన్), భూమి (భూమిక రమేశ్) ఒకరంటే ఒకరికి ప్రేమ. గతంలో గగన్ ఇంట్లో ఉన్న భూమి.. శరత్ చంద్ర తన తండ్రి అనే నిజం తెలియటంతో ఆయన ఇంటికి వెళుతుంది. శరత్ చంద్ర, గగన్‍కు గొడవలు జరుగుతూనే ఉంటాయి. గగన్‍ను ప్రేమిస్తున్నానని చెబితే మళ్లీ తన ఇంటికి రావొద్దని భూమితో శరత్ చంద్ర చెబుతాడు. భూమి తన సొంత కూతురు అని నిజం తెలియక దత్తత తీసుకుంటానంటాడు.
భూమిని తీసుకెళ్లేందుకు శరత్ చంద్ర ఇంటికి గగన్ వస్తాడు. అయితే, తండ్రికి దూరమవడం ఇష్టం లేక తాను ప్రేమించడం లేదని గగన్‍ను చాలా మాటలు అంటుంది భూమి. మనసు విరిగేలా మాట్లాడుతుంది. దీంతో గగన్, భూమి మధ్య దూరం ఏర్పడింది. ఆ తర్వాత నచ్చజెప్పాలని భూమి ప్రయత్నించినాా గగన్ వినిపించుకోడు. దీంతో భూమి బాధపడుతూ ఉంటుంది. గగన్‍కు దగ్గరయ్యేందుకు నానా తంటాలు పడి అతడి పీఏగా భూమి ఇప్పుడు వచ్చింది. ఇక మెయిన్ విలన్ అపూర్వ చంద్ర కుట్రలు పన్నుతూనే ఉంటుంది. ఇలా ఈ మేఘసందేశం సిరీస్ సాగుతోంది.
సంబంధిత కథనం