


Best Web Hosting Provider In India 2024
Shock to Carlos Alcaraz: టెన్నిస్ లో సంచలనం.. స్టార్ అల్కరాస్ కు షాక్.. ఓడించిన కుర్రాడు ఎవరంటే?
Shock to Carlos Alcaraz: టెన్నిస్ యంగ్ స్టార్ కార్లోస్ అల్కరాస్ కు షాకింగ్ ఓటమి. ఈ స్పెయిన్ యువ సంచలనం ఖతార్ ఓపెన్ లో అనూహ్య ఓటమి పాలయ్యాడు. అనామకుడి చేతిలో ఓడాడు. అల్కరాస్ కు షాకిచ్చిన ఆటగాడు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు.
మాజీ నంబర్ వన్, నాలుగు గ్రాండ్ స్లామ్స్ విన్నర్ కార్లోస్ అల్కరాస్ కు షాక్. అనామకుడి చేతిలో ఈ స్పెయిన్ ఆటగాడు పరాజయం పాయ్యాడు. అల్కరాస్ కు చెక్ రిపబ్లిక్ కు చెందిన జిరి లెహెకా షాకిచ్చాడు. ఖతార్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో లెహెకా 6-3, 3-6, 6-4 తేడాతో టాప్ సీడ్ అల్కరాస్ ను ఓడించాడు. రెండున్నర గంటల్లో అల్కరాస్ పై విజయం సాధించాడు.
ఫేవరెట్ ను ఓడించి
ఖతార్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో అల్కరాస్ ఫేవరెట్ గా బరిలో దిగాడు. ప్రస్తుతం ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఉన్న అల్కరాస్ ఈ టోర్నీలో టైటిల్ గెలుస్తాడనిపించింది. కానీ క్వార్టర్స్ లో జిరి లెహెకా అమేజింగ్ ఆటతీరుతో అదరగొట్టాడు. ప్రస్తుతం 24వ ర్యాంక్ లో ఉన్న లెహెకా గొప్పగా ఆడాడు. తొలి సెట్లో గెలిచాడు. రెండో సెట్లో ఓడిపోయినా.. తిరిగి పుంజుకుని మూడో సెట్లో అల్కరాస్ ను చిత్తు చేశాడు.
గ్రాండ్ స్లామ్స్ లో క్వార్టర్సే
23 ఏళ్ల జిరి లెహెకా ఇప్పటివరకూ ఒక్క గ్రాండ్ స్లామ్ గెలవలేదు. 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ లో క్వార్టర్స్ చేరడమే అతని బెస్ట్ పర్ ఫార్మెన్స్. 2023 వింబుల్డన్ లో నాలుగో రౌండ్, ఫ్రెంచ్ ఓపెన్ లో రెండో రౌండ్, 2024 యుఎస్ ఓపెన్ లో మూడో రౌండ్ లో ఓడిపోయాడు. 2020లో ప్రొఫెషనల్ టెన్నిస్ లో అడుగుపెట్టిన లెహెకా ఇప్పటివరకూ సింగిల్స్ లో 86 మ్యాచ్ లు గెలిచి, 67 మ్యాచ్ లు ఓడాడు.
పేరెంట్స్ అథ్లెట్స్
జిరి లెహెకా పేరేంట్స్ ఇద్దరూ ఒకప్పటి అథ్లెట్స్. అతని తండ్రి స్విమ్మర్. తల్లి ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టార్. లెహెకా చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుకు. స్కీయింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ చేశాడు. మూడేళ్ల వయసులో టెన్నిస్ రాకెట్ పట్టుకున్నాడు. ఇప్పుడు అల్కరాస్ పై విజయంతో టెన్నిస్ ప్రపంచంలో అతని పేరు మార్మోగుతోంది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link