


Best Web Hosting Provider In India 2024

OTT Horror Thriller: ఓటీటీలోకి తిరిగి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ హారర్ మూవీ.. ఒకే ప్లాట్ఫామ్లోకి..
OTT Horror Thriller: బ్లాక్‌బస్టర్ హారర్ థ్రిల్లర్ మూవీ చాలా రోజుల తర్వాత మళ్లీ ఓటీటీలోకి వచ్చింది. రీరిలీజ్ లో రికార్డులు తిరగరాసిన సినిమా ఇది. గతంలో రెండు ప్లాట్‌ఫామ్స్ లో ఉండగా.. ప్రస్తుతానికి ఒక ప్లాట్‌ఫామ్ తిరిగి స్ట్రీమింగ్ ప్రారంభించింది.
OTT Horror Thriller: రీరిలీజ్ లో ఏకంగా రూ.31 కోట్లు సాధించి అత్యధిక వసూళ్లు రాబట్టిన రీరిలీజ్ మూవీగా రికార్డు క్రియేట్ చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ తుంబాద్ (Tumbadd). ఈ మూవీ గతంలో రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ అయ్యేది. కానీ రీరిలీజ్ సమయంలో కనిపించకుండా పోయింది. మొత్తానికి చాలా రోజుల తర్వాత తిరిగి ఓ ప్లాట్‌ఫామ్ లోకి తిరిగి వచ్చింది.
ప్రైమ్ వీడియోలోకి తుంబాద్
తుంబాద్.. మరాఠీ జానపద కథ ఆధారంగా తెరకెక్కిన ఓ హారర్ థ్రిల్లర్ మూవీ. మొదటిసారి రిలీజైనప్పుడు ఫ్లాప్ గా నిలిచింది. కానీ రీరిలీజ్ లో మాత్రం రికార్డులు తిరగరాసింది. ఇప్పుడీ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి తిరిగి వచ్చింది.
నిజానికి నెట్‌ఫ్లిక్స్ లోనూ ఈ సినిమా ఉండేది. కానీ ప్రస్తుతానికి ఆ ఓటీటీ ఇంకా ఈ మూవీని అందుబాటులోకి తీసుకురాలేదు. ప్రైమ్ వీడియోలో మాత్రం ఈ సినిమా చూడొచ్చు.
రీరిలీజ్‌లో రూ.31 కోట్లు
తుంబాద్ మూవీ నిజానికి 2018లో తొలిసారి రిలీజైంది. అప్పట్లో ఆ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. బాక్సాఫీస్ దగ్గర రూ.12 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ గా నిలిచింది. కానీ గతేడాది మరోసారి రీరిలీజ్ చేశారు. ఈసారి మాత్రం మూవీకి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా రూ.31 కోట్లు వసూలు చేసింది.
ఈ మధ్యే వచ్చిన సనమ్ తేరీ కసమ్ కు ముందు అత్యధిక వసూళ్లు సాధించిన రీరిలీజ్ మూవీ రికార్డు ఈ తుంబాద్ పేరిటే ఉండేది. ఆ సమయంలో ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లలో ఉన్న ఈ సినిమాను తొలగించారు. థియేటర్లకు రప్పించేందుకు చేసిన ప్రయత్నం ఇది. ఒకరకంగా అది వర్కౌట్ అయింది. మొదటిసారి రిలీజైనప్పుడు పట్టించుకోని వాళ్లు కూడా రీరిలీజ్ లో చూశారు.
దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు వచ్చాయి. ముంజ్యా, స్త్రీ2లాంటి హారర్ కామెడీ మూవీస్ హిట్ అవడం కూడా ఒకరకంగా ఈ సినిమాకు కలిసి వచ్చిందని చెప్పొచ్చు. వందేళ్లలో అసలు ఎవరూ వెళ్లని చోటికి వెళ్లి మరీ ఈ తుంబాద్ మూవీ షూటింగ్ జరపడం విశేషం. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. రాహి అనిల్ బార్వే డైరెక్ట్ చేసిన తుంబాద్ మూవీలో సోహమ్ షా లీడ్ రోల్లో నటించాడు.
సంబంధిత కథనం