Best Web Hosting Provider In India 2024

Brahmamudi February 22nd Episode: అరవకండి మిస్టర్ రాజ్.. బావపై అప్పు ఇన్వెస్టిగేషన్.. ఇద్దరి లెక్కలు తేల్చిన అనామిక!
Brahmamudi Serial February 22nd Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 22 ఎపిసోడ్లో రాజ్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన అప్పు పోలీస్ స్టేషన్లో ముద్దాయిలా ఉంచి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. రాజ్ గట్టిగా మాట్లాడితే అరవకండి మిస్టర్ రాజ్ అంటూ హెచ్చరిస్తుంది. సామంత్‌ను అనామికే చంపింది అని కావ్య, సుభాష్ అనుమానిస్తారు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రాజ్‌ను అప్పు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంది. నిన్ను ఉరికంభం ఎక్కించే వరకు ఊరుకోను అని అనామిక ఛాలెంజ్ చేస్తుంది. దాంతో మీడియా రాజ్‌ను ప్రశ్నలు అడుగుతుంది. మీరు కావాలనే సామంత్‌ను చంపారా, ప్లాన్ ప్రకారం చేశారా అని అడిగితే.. సైలెంట్‌గా ఉండి దారి ఇవ్వమని అప్పు అంటుంది.
లెక్కలు తేల్చిన అనామిక
రాజ్‌ను పోలీస్ జీప్‌లో అప్పు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంది. దాంతో దుగ్గిరాల కుటుంబం అంతా ఏడుస్తూ ఉంటుంది. రుద్రాణి అనామిక వైపు చూస్తుంది. దాంతో అదంతా నా ప్లాన్ అన్నట్లుగా సామంత్ శవం వైపు చూస్తుంది అనామిక. దానికి రుద్రాణి షాక్ అవుతుంది. అనుకుంది సాధించినట్లు అనామిక గర్వంగా ఉంటుంది. అటు సామంత్, ఇటి రాజ్ ఇద్దరి లెక్కలు తేలుస్తానని చెప్పిన అనామిక ప్లాన్ సక్సెస్ చేసుకుంది. లాయర్‌తో సుభాష్ మాట్లాడుతాడు.
తర్వాత కనకంకు స్వప్న కాల్ చేసి ఇక్కడ తుఫాన్ వచ్చి అందరం కొట్టుకుని పోయేలా ఉన్నాం. నీ ముద్దుల మూడో కూతురు వచ్చి రాజ్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయింది. అని రాజ్ కారులో సామంత్ శవం దొరకడం, అరెస్ట్ చేయడం, అంతా బాధపడటం గురించి చెబుతుంది. అందరి జీవితం బాగుపడుతుందనుకుంటే ఇలా జరిగిందేంటే. అప్పు ఇంట్లోకి వచ్చి సంతోషంగా ఉందని అనుకుంటే ఇప్పుడు అల్లుడి గారిని అరెస్ట్ చేసినందుకు అంతా అప్పును ఆడిపోసుకుంటారు అని కనకం అంటుంది.
అప్పు ఇన్వెస్టిగేషన్
కావ్య ఊరికే అది వదిలేయదు. పులి నోట్ల ఉన్న రాజ్‌ను బయటకు తీసుకొస్తుంది. నువ్వు కంగారుపడకు అని స్వప్న అంటుంది. అదేమైనా ఇంట్లో గొడవ. నిజం తేలకపోతే జీవితాంతం అల్లుడుగారు జైల్లో ఉండాల్సి వస్తుంది. నేను ఇప్పుడే వస్తాను అని కనకం అంటే అంతా ఇప్పుడు చిరాకుగా ఉన్నారు. నువ్ వస్తే ఏదోటి అంటారు. వద్దని స్వప్న చెబుతుంది. మరోవైపు పోలీస్ స్టేషన్‌కు సుభాష్, కావ్య వెళ్లి ఎస్సైని కలవలంటారు.
ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అక్కడ కూర్చోమని కానిస్టేబుల్ చెబుతుంది. మరోవైపు ఇన్వెస్టిగేషన్ రూమ్‌లో రాజ్ ముద్దాయిలా కూర్చుంటాడు. అప్పు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ కంట్రోల్ చేసుకోమ్మని, నువ్ ఆయన మరదలివి కాదు, పోలీస్వి అని అనుకుంటుంది. ఆరోజు కాల్ మాట్లాడి అర్జంట్‌గా వెళ్లారని అక్క.. మీ వైఫ్ చెప్పింది. ఎక్కడికి వెళ్లారు అని అప్పు అడుగుతుంది. దాంతో ఫ్యాక్టరీకి నిప్పు పెట్టడం గురించి చెబుతాడు రాజ్.
ఇది పోలీస్ స్టేషన్
ఆ తర్వాత నేరుగా ఇంటికి వచ్చాను. కారులోకి శవం ఎలా వచ్చిందో తెలియదు అప్పు.. తెలీదు మేడమ్ అని రాజ్ అంటాడు. సామంత్‌ను చంపేస్తానని చెప్పింది కోపంలో చెప్పింది మాత్రమే అని రాజ్ అంటే.. అదే కోపంలో చంపారా అని అప్పు అంటుంది. నేను చంపలేదు.. చంపలేదు అని రాజ్ బల్ల గుద్ది అరుస్తుంటాడు. అరవకండి మిస్టర్ రాజ్. ఇది పోలీస్ స్టేషన్ అని అప్పు వారిస్తుంది. నాకు వాన్ని చంపేంత కోపం వచ్చిన మాట వాస్తవమే. కానీ, ఒక మనిషి ప్రాణం విలువ నాకు తెలుసు. నా ప్రాణం పోయినా ఇంకొకరి ప్రాణం తీయాలని చూడను అని రాజ్ అంటాడు.
ఎవరో నన్ను కావాలనే ఇరికించారు. ప్లీజ్ నమ్మండి అని రాజ్ అంటాడు. అందరికంటే ఎక్కువ నమ్మేది నేనే బావా అని మనసులో అనుకున్న అప్పు కానిస్టేబుల్‌ను పిలిచి లోపలికి తీసుకెళ్లమంటుంది. కావ్య ఏవండి అని వస్తే కానిస్టేబుల్ అడ్డుకుంటాడు. సెల్లో రాజ్‌ను ఉంచుతారు. అప్పు ఏమైనా తెలిసిందా అని కావ్య అడిగితే.. బావ దగ్గర ఉన్న విషయంలో ఎలాంటి క్లూస్ లేవు. కానీ, సాక్ష్యాలు అన్ని బావకు వ్యతిరేకంగా ఉన్నాయి అని అప్పు అంటుంది.
రాజ్ బయటకు రాడా అని సుభాష్ అంటే.. వస్తాడు పెద్దమావయ్య గారు. బావకు అనుకూలంగా ఒక్క సాక్ష్యం దొరికినా చాలు బయటకు రావొచ్చు. సామంత్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం పంపించాం. ఏమైనా తెలియొచ్చు. అంతవరకు ఓపిక పట్టండి అని అప్పు అంటుంది. అప్పుకు ఫోన్ కాల్ రావడంతో వెళ్లిపోతుంది. రాజ్ దగ్గరికి వెళ్లి కావ్య, సుభాష్ మాట్లాడుతారు. ఎవరో కావాలనే నన్ను ఇరికించారు. ఇదంతా అనామిక పని నా అనుమానం. సామంత్ మిస్ అవడం, నా కారులో శవం, వెంటనే మీడియా రావడం ఫాస్ట్‌గా ఎలా జరిగాయి అని రాజ్ అంటాడు.
అనామికనే చంపిందా
సామంత్ ఇంటికెళ్లి గొడవ చేయడం ఇదంతా సాక్ష్యాలుగా మార్చుకుని చేసిందా. అంటే మరి సామంత్‌ను అనామికే మర్డర్ చేసిందా అని కావ్య అడుగుతుంది. ఏమో అది ఎంక్వైరీలో తేలుతుందని రాజ్ అంటాడు. సామంత్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది కదా తనెందుకు చంపుతుంది అని సుభాష్ అంటాడు. పగ ప్రతికారాల కోసం మనిషి ఏమైనా చేయొచ్చు. ఇది నా డౌట్ మాత్రమే అని రాజ్ అంటాడు. నువ్ ధైర్యంగా ఉండు. ఎలాగైనా నిన్ను విడిపించుకుంటాం అని సుభాష్ అంటాడు.
నేను ఏ తప్పు చేయలేదు. త్వరలోనే తిరిగి వస్తానని తాతయ్యకు చెప్పండి అని రాజ్ అంటాడు. నిస్సహాయంగా కావ్య, సుభాష్ బయటకు వస్తారు. ఇద్దరు భయం, కన్నీళ్లు, బంధం అంటూ మాట్లాడుకుంటారు. అక్కడ అనామిక ఉంటుంది. ఏంటీ.. అలా చూస్తున్నారు.. ఒకరు కొరికేసేలాగా ఒకరు నరికేసేలాగా. కొంపదీసి ఇదంతా నేనే చేసి రాజ్‌ను ఇరికించారని అనుకుంటున్నారా ఏంటీ అని అనామిక అంటుంది. అసలు ఆ హత్య నువ్వే చేశావని నా అనుమానం అని సుభాష్ అంటాడు.
నేనా.. హత్యా.. రాజ్ కన్న గొప్పోడు, మంచోడు నన్ను పెళ్లి చేసుకుందామనుకుంటే నేనేందుకు హత్య చేస్తాను. నా బాధను, కన్నీళ్లను ఇలా సన్ గ్లాసెస్ పెట్టుకుని కవర్ చేస్తున్నాను. నాకు కాబోయే భర్తను చంపిన నీ భర్తను వదలను అని అనామిక అంటుంది. నిజం అనేది చీకట్లో ఉండే వెలుగులాంటిది చిన్న గాలి తగిలిన బయటకు వస్తుంది. కళ్లద్దాలు పెట్టుకుని కవర్ చేసుకున్నంతమాత్రానా దొంగలు దొరలు అయిపోరు. ఒకవేళ ఇదంతా నువ్వే చేశావని తెలిస్తే మాత్రం నిన్ను వదిలిపెట్టను అని కావ్య అంటుంది.
జైలు గోడలపై డిజైన్స్ వేసుకుంటూ
అయ్యో అంత అనకు కావ్య. చూడు ఎలా భయపడుతున్నానో చూడు. నువ్ భయపెడితే భయపడిపోడానికి నేను నీ ఇంట్లో పనిచేసే శాంతనో, ఆఫీస్‌లోని శ్రుతినో కాదు అనామికని. చూస్తూ ఉండండి. త్వరలోనే రాజ్ హంతకుడని కోర్టు తీర్పు ఇస్తుంది. ఆ తర్వాత జీవితాంతం జైలు గోడల మీద స్వరాజ్ గ్రూఫ్ ఆఫ్ ఇండస్ట్రీస్ లెక్కలు రాస్తు జ్యూవెలరీ డిజైన్స్ చేస్తూ ఉంటాడు. రాజ్‌కు లాకప్‌తో ప్యాకప్ చెప్పేసినట్లే ఇక బయటకు రాడు. ప్రిపెర్ అయిపో. అందరిని ప్రిపేర్ చేయి కావ్య.. బై అని అనామిక వెళ్లిపోతుంది.
అంత స్ట్రాంగ్‌గా చెబుతుంది అని సుభాష్ అంటాడు. అబద్ధాలు చెప్పేవాళ్లంతా స్ట్రాంగ్‌గానే చెబుతారు. నిజం బయటకు వచ్చాక పారిపోతారు అని కావ్య అంటుంది. కట్ చేస్తే అంతా ఇంట్లో దిగాలుగా, బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇంతలో అప్పు వస్తుంది. ఆగు అని ధాన్యలక్ష్మీ అరుస్తుంది. ఈ ఇంటికి నిన్ను రప్పించడం కోసం మా రాజ్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈ ఇంట్లో అడుగుపెట్టగానే మా రాజ్‌ను అరెస్ట్ చేశావ్. ఈ ఇంటి వారసుడినే బయటకు పంపించి నువ్ ఏ మొహం పెట్టుకుని వచ్చావ్ అని ధాన్యలక్ష్మీ అంటుంది.
రాజ్ ప్లాన్ చేసి చంపినట్లు
అనామిక పగ తీర్చుకోడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో తెలియదా. దాని కంప్లైంట్ తీసుకుని రాజ్‌ను అరెస్ట్ చేస్తావా. ఇందుకేనా నా కొడుకు నిన్ను ఎస్సైని చేసింది అని ధాన్యలక్ష్మీ అంటుంది. సొంత బావను అరెస్ట్ చేసి ఎన్ని మెడల్స్, ఎంత పేరు సంపాదించావ్ అని రుద్రాణి సెటైర్లు వేస్తుంది. తర్వాత కోర్టులో కావ్యను సామంత్‌కు రాజ్ చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది అనామిక లాయర్ వాదిస్తాడు. కావాలనే ప్లాన్ చేసి సామంత్‌ను రాజ్ చంపాడని లాయర్ వాదిస్తాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం