SBI New Branches : తెలంగాణలో 10 కొత్త ఎస్‌బీఐ బ్రాంచ్ లు – ఎక్కడెక్కడంటే..?

Best Web Hosting Provider In India 2024

SBI New Branches : తెలంగాణలో 10 కొత్త ఎస్‌బీఐ బ్రాంచ్ లు – ఎక్కడెక్కడంటే..?

Maheshwaram Mahendra HT Telugu Feb 22, 2025 07:00 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 22, 2025 07:00 AM IST

SBI New Branches in Telangana: తెలంగాణలో ఎస్బీఐ కొత్త బ్రాంచ్ లను ప్రారంభించింది. 10 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఐదు, పట్టణ ప్రాంతాల్లో మరో ఐదింటిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫలితంగా వీటితో కలిపి రాష్ట్రంలో ఎస్బీఐ బ్రాంచ్ ల సంఖ్య 1,206కి చేరింది.

10 కొత్త ఎస్‌బీఐ బ్రాంచ్ లు
10 కొత్త ఎస్‌బీఐ బ్రాంచ్ లు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

తెలంగాణలో మరికొన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) బ్రాంచ్ లు కొలువుదీరాయి. వీటిని వర్చవల్ గా ఎస్బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు ప్రారంభించారు. హైదరాబాద్ సర్కిల్ కేంద్రంగా ఇవి పని చేయనున్నాయి. ఈ కార్యక్రమంలో చీఫ్ జనరల్ మేనేజర్ రాజేశ్ కుమార్ పాల్గొన్నారు.

మొత్తం పది కొత్త బ్రాంచ్ లు ఏర్పాటు చేసినట్లు ఎస్బీఐ అధికారులు తెలిపారు. వీటిలో ఐదు బ్రాంచ్ లను గ్రామీణ పరిధిలో, మరో ఐదింటిని పట్టణం ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వీటితో కలిపి తెలంగాణలో రాష్ట్రంలోని బ్రాంచ్ ల సంఖ్య 1,206కి చేరినట్లు ఎస్బీఐ ప్రకటించింది.

ఎక్కడెక్కడంటే…?

  1. ఆలంపూర్‌ ఎక్స్‌ రోడ్
  2. చిన్నంబావి
  3. రాఘవేంద్ర కాలనీ(కొండాపూర్‌)
  4. నియోపోలిస్
  5. సుచిత్ర సర్కిల్,
  6. కిష్టారెడ్డిపేట(పటాన్‌చెరు)
  7. ఖాజాగూడ
  8. , ఉస్మాన్‌నగర్
  9. కంగ్టి(నారాయణఖేడ్‌),
  10. నందిపేట

ఎస్బీఐలో ఉద్యోగాలు:

కాంకరెట్ ఆడిటర్ పోస్టుల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా 1194 పోస్టులను భర్తీ చేయనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 18న ప్రారంభవుతుంది. 2025 మార్చి 15న ముగుస్తుంది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకు అధికారి 60 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ పొందిన తరువాత మాత్రమే బ్యాంక్ సర్వీస్ నుండి రిటైర్ అయి ఉండాలి. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన/ రాజీనామా చేసిన/ సస్పెండ్ చేసిన లేదా పదవీ విరమణకు ముందే బ్యాంకును విడిచిపెట్టిన అధికారులు ఈ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.

మొదట దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. వారికి ఇంటర్వ్యూలు ఉంటాయి. బ్యాంక్ ద్వారా ఏర్పాటు చేయబడిన షార్ట్ లిస్టింగ్ కమిటీ షార్ట్ లిస్టింగ్ పారామీటర్లను నిర్ణయిస్తుంది. ఆ తరువాత, బ్యాంక్ నిర్ణయించిన విధంగా తగిన సంఖ్యలో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూకు పిలుస్తారు. పూర్తి వివరాలను ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి చూడొచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

State Bank Of IndiaTelangana NewsHyderabadBanking
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024