



Best Web Hosting Provider In India 2024

Hero Nani: ఈ సినిమాను తీసి నేరం చేసింది నేనే.. కావాలంటే అరెస్ట్ చేసుకోండి.. హీరో నాని కామెంట్స్
Natural Star Nani Comments On Court Movie In Press Meet: నేచురల్ స్టార్ నాని సమర్పించిన లేటెస్ట్ తెలుగు మూవీ కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఏ నో బడీ. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో హీరో నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Natural Star Nani Comments On Court Movie In Press Meet: నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పించిన మూవీ ‘కోర్ట్’ – స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న కోర్ట్ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.
నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇప్పటికే విడుదలైన కోర్ట్ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఏ నో బడీ సినిమాను మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌కి మూవీ ప్రెజంటర్ నేచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కోర్టు బోనులో నిల్చొని హీరో నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
గర్వపడుతున్నాను
ప్రెస్ మీట్‌లో కోర్టు బోనులో నిల్చొని నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. “తప్పు ఒప్పుకుంటున్నాను. వీళ్లందరితో కలిసి ‘కోర్టు’ సినిమాని తీసి నేరం చేసింది నేనే. కావాలంటే అరెస్ట్ చేసుకోండి (నవ్వుతూ). కానీ, మార్చి 14 అందరూ వచ్చి చూసి సినిమాని బ్లాక్ బస్టర్ చేయండి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలి. వెరీ బ్యూటీఫుల్ ఫిల్మ్. ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి, డైరెక్టర్ జగదీశ్ అందరూ అద్భుతంగా చేశారు. ఈ సినిమా తీసినందుకు గర్వపడుతున్నాను” అని తెలిపాడు.
సెన్సిటివ్ మేటర్, జాగ్రత్తలు తీసుకుని
“నాలోని కాన్ఫిడెన్స్ చూసి మీరే డిసైడ్ అవ్వండి. మార్చి 14న మీరు ఎంత మంచి సినిమా చూడబోతున్నారో. ఈ సినిమా చూశాను. ఇందులో ఎవరు హీరో అని చెప్పడం కష్టం. ఈ కథ చాలా సెన్సిటివ్ మేటర్. చాలా జాగ్రత్తలు తీసుకొని చేశాం. జగదీశ్ చాలా రీసెర్చ్ చేశారు. సినిమా పూర్తయినప్పటికీ నిలబడి క్లాప్స్ కొడతారు. ఇది నా గ్యారెంటీ” అని హీరో నాని అన్నాడు.
అనుకున్న దానికంటే
“కోర్ట్ మూవీ గ్రేట్ ఐడియా, బ్యూటీఫుల్ లవ్ స్టొరీ. చాలా గ్రిప్పింగ్ డ్రామా. మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్. ఇది అద్భుతమైన కోర్ట్ రూమ్ డ్రామా. గ్రేట్ మెసేజ్ ఉంటుంది. ఆడియన్స్ సెలబ్రేట్ చేసుకునే సినిమా అవుతుంది. జగదీశ్ చాలా హానెస్ట్‌గా కథ చెప్పాడు. నేను అనుకున్న దానికంటే నెక్ట్స్ లెవల్‌లో తీశాడు” అని నాని పేర్కొన్నాడు.
ఒక అడుగు ముందుకు వేసినట్లే
“కోర్ట్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఇండస్ట్రీ, ఆడియన్స్ ఒక అడుగు ముందుకి వేసినట్లే. నేను ఎలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడతానో మీ అందరికీ తెలుసు. మార్చి 14న ఇంకోసారి క్లారిటీ వస్తుంది. ఒక కోర్ట్ రూమ్ డ్రామా చూసినప్పుడు ఆడియన్స్ కావాల్సిన అన్ని హైస్ ఇందులో ఉంటాయి.” అని నేచురల్ స్టార్ నాని చెప్పుకొచ్చాడు.
సంబంధిత కథనం