Karthika Deepam 2 Today Episode: జ్యోత్స్నకు చెమటలు పట్టించిన తండ్రి- కావేరిని పరిచయం చేసిన శ్రీధర్- వదినా అంటూ సుమిత్ర!

Best Web Hosting Provider In India 2024

Karthika Deepam 2 Today Episode: జ్యోత్స్నకు చెమటలు పట్టించిన తండ్రి- కావేరిని పరిచయం చేసిన శ్రీధర్- వదినా అంటూ సుమిత్ర!

Karthika Deepam 2 Serial February 22nd Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఫిబ్రవరి 22వ తేది ఎపిసోడ్‌లో జ్యోత్స్న చెవి రింగ్ తండ్రి దశరథ్‌కు దొరుకుతుంది. అది ఇచ్చి చాలా ప్రశ్నలు అడుగుతాడు. దాంతో జ్యోత్స్న కంగారుపడుతూ చెమటలు గక్కుతుంది. శివన్నారాయణ ఇంటికి కావేరిని తీసుకొచ్చి రచ్చ చేస్తాడు శ్రీధర్.

 
కార్తీక దీపం 2 సీరియల్ ఫిబ్రవరి 22వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ ఫిబ్రవరి 22వ తేది ఎపిసోడ్
 

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో చెవిపోగు కారులో లేదు బయట లేదు. ఒకవేళ దాస్ ఇంట్లో పడిపోయిందా. డాడీ ఇంతవరకు ఇంటికి ఎందుకు రాలేదు. దాసు నిజం చెప్పేసి ఉంటాడా. సరిగ్గా అదే టైమ్‌కు బావ కాశీ వచ్చారు. దాసు నిజం చెప్తే డాడీతోపాటు అందరికి తెలిసిపోయి ఉంటుంది కదా. అటు నుంచి అటు వెళ్లి పోలీస్‌లకు నా మీద కంప్లైంట్ ఇవ్వలేదు. ఇలా ఆలోచిస్తూ భయపడే బదులు ఒకసారి దాస్ ఇంటికి వెళ్లడమే కరెక్ట్ అని జ్యోత్స్న అనుకుంటుంది.

 

నన్ను డాడీ చూసినట్లున్నాడు

కిందకు వచ్చిన జ్యోత్స్నకు దశరథ్ ఎదురుపడతాడు. దాంతో ఆగిపోతుంది. డాడీకి ఇంకా నిజం తెలిసినట్లు లేదు అనుకుంటుంది జ్యోత్స్న. ఎక్కడికి వెళ్లారు డాడ్ ఆఫీస్‌కా అని జ్యోత్స్న అంటే.. నేను ఎక్కడికి వెళ్లానో నీకు తెలియదా. నేను వెళ్లింది నువ్ చూస్తే నీకు తెలుస్తుంది లేకుంటే ఎలా తెలుస్తుంది అని దశరథ్ అంటాడు. దాస్ ఇంటి దగ్గర నన్ను డాడీ చూసినట్లున్నాడు అని జ్యోత్స్న అనుకుటుంది. మరి నువ్వెక్కడికి వెళ్లావ్ జ్యోత్స్న అని అడుగుతాడు దశరథ్.

ఇంట్లోనే ఉన్నాను అని జ్యోత్స్న సమాధానం చెబుతుంది. ఇంతలో ఇది నీదేనేమో చూడు అని చెవిపోగు చూపిస్తాడు. ఇది నీదే కదా అని దశరథ్ అనుమానంగా అంటాడు. నాదే డాడీ అని తీసుకుంటుంది జ్యోత్స్న. ఎక్కడ దొరికింది అని జ్యోత్స్న అడుగుతుంది. అది తీసుకుంది గుర్తు చేసుకుంటాడు దశరథ్. నువ్ ఎక్కడ పారేసుకున్నావో అక్కడే దొరికింది. ఎక్కడ పారేసుకున్నావ్ అని దశరథ్ అంటాడు. డాడీకి దాసు నిజం చెప్పేశాడా. నిజం తెలిసే ఇలా మాట్లాడుతున్నాడ అని జ్యోత్స్న అని అనుకుంటుంది.

చెప్పు జ్యోత్స్న ఎక్కడ పారేసుకున్నావ్ అని దశరథ్ అంటే.. తడబడుతూ చెమటలు తుడుచుకుంటుంది జ్యోత్స్న. ఎందుకు టెన్షన్ పడుతున్నావ్. అరే చెమటలు పడుతున్నాయి. తుడుచుకో అని దశరథ్ అంటాడు. అంత చెమటలు పట్టించేలా నువ్వేం అడుగుతున్నావ్ దశరథ. మళ్లీ ఏం తప్పు చేశావ్ జ్యోత్స్న అని పారిజాతం ఎంట్రీ ఇస్తుంది. ఒక తప్పు దాయాలంటే మరో తప్పు చేయాలి పిన్ని అని దశరథ్ అంటాడు. డాడీకి నిజం తెలిసిపోయింది అని కన్ఫర్మ్ చేసుకుంటుంది జ్యోత్స్న.

 

ఇంకోరోజు అయిన చెబుతాడు

ఏం తప్పు చేసిందో చెప్పు దశరథ. మళ్లీ మీ నాన్నకు తెలిస్తే కోప్పడతాడు అని పారిజాతం అంటుంది. చెవి రింగ్ పడేసుకుందని చెబుతాడు దశరథ్. అంతేనా, ఎక్కడ పడేసుకుంది అని పారిజాతం అడుగుతుంది. గార్డెన్‌లో అని దశరథ్ చెబుతాడు. నువ్వెక్కడికి వెళ్లావ్ అని పారిజాతం అడిగితే దాసు ఇంటికి. ఇప్పుడు కోలుకుంటున్నాడు. అంతా గుర్తుకు వచ్చింది. ఏదో చెప్పపోయాడు. కానీ, కిటికీ దగ్గర ఫ్లవర్ వాజ్ పడిపోవడంతో మళ్లీ మర్చిపోయాడు అని దశరథ్ అంటాడు.

అంటే డాడీకి దాసు నిజం చెప్పలేదు. థ్యాంక్ గాడ్ అని ఊపిరి పీల్చుకుంటుంది జ్యోత్స్న. తనను కొట్టిందో ఎవరు ఈరోజు చెప్పకపోయినా ఇంకోరోజు అయిన చెబుతాడు. సౌండ్ వింటే మైండ్ డైవర్ట్ అవుతుందని తెలిసే కావాలనే ఎవరో తోసినట్లు ఉంది పిన్ని. వస్తే పట్టుకునేవాన్ని కదా పిన్ని. మనుషులు లేకపోతే ఆధారాల కోసం వస్తువులైనా పట్టుకునేవాన్ని కదా. నో ప్రాబ్లమ్ ఏదో ఒకరోజు కచ్చితంగా దొరుకుతారు. ఎవరైతే మాత్రం ఎంతకాలం తప్పించుకుని తిరుగుతారు అని ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు దశరథ్.

డాడీకి నా మీద అనుమానం ఉంది. ఇంటి దగ్గర నన్ను చూశాడు. దాసు నిజం చెబితే కన్ఫర్మ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ, దాసు నిజం చెబితే ఏం జరుగుతుందో నాకు తెలుసు. నేను ఇప్పుడు ఏం తెలియనట్లు సైలెంట్‌గా ఉండాలి అని జ్యోత్స్న ఆలోచిస్తుంది. ఇప్పుడు దీపకు దేవుడు ఫేవర్‌గా ఉన్నాడు. టిఫిన్ సెంటర్ పెట్టుకోవాల్సింది రెస్టారెంట్ స్థాయికి వెళ్లింది అని పారిజాతం అంటుంది. మనం చేతకాని వాళ్లలా అయిపోయి. నేను చెడు అవడం తప్పా నాకు సపోర్ట్ ఏం లేదు అని వెళ్లిపోతుంది జ్యోత్స్న.

 

పిల్ల బాతు బచ్చా నాకు చెబుతుంది

ఈ పిల్ల బాతు బచ్చా నాకు చెబుతుంది. ఇలాంటివి నేను ఎన్ని చూడలేదు అని అనుకుంటుంది పారిజాతం. మరోవైపు తండ్రికి దండం పెట్టుకుని అతని మాటలు నిజం అని తలుచుకుంటుంది. జీవితం మళ్లీ మొదలైంది నాన్నా. ఈసారు బలంగా నిలబడాలి. కార్తీక్ గెలిచి అందరిముందు తలెత్తుకునేలా చేయాలి అని దీప అనుకుంటుంది. అది అనసూయ చూస్తుంది. ఇంతలో శౌర్య వస్తుంది. నువ్ రేపటి నుంచి స్కూల్‌కు వెళ్లి బాగా చదువుకోవాలి అని శౌర్యకు చెబుతుంది దీప.

ఇప్పుడు నేరు కార్తీక్ కూతురు అనిపించుకోవాలి. నాన్నను అందరూ పొగిడేలా చేయాలి. అలాగే అనిపించుకుంటాను అని శౌర్య అంటుంది. అదంతా చూసిన అనసూయ నువ్ నా తమ్ముడి కూతురివి కాదే. దాసు నిజం కనిపెడతానన్నాడు. అతనికి ఇలా జరిగి ఉండకుండా ఉంటే కనిపెట్టి అందరికి నిజం చెప్పేవాడేమో. దాసు త్వరగా నిజం కనిపెట్టి దీపకు న్యాయం చేయవయ్యా అని అనసూయ కోరుకుంటుంది. మరోవైపు జ్యోత్స్న ఇంటికి శ్రీధర్, కావేరి వెళ్తారు.

ఇంత పెద్ద ఇల్లు ఎవరిది. మనం వస్తున్నట్లు వాళ్లకు చెప్పారా అని కావేరి అడుగుతుంది. నీకు చెప్పానా. అలాగే వాళ్లకు చెప్పలేదు. సర్‌ప్రైజ్ అని శ్రీధర్ అంటాడు. తర్వాత పారిజాతంను నమస్కారం అత్తయ్య గారు అని శ్రీధర్ పిలవడంతో పారిజాతం కంగారుపడిపోతుంటుంది. అల్లుడు గారు మీరా అంటూ వస్తుంది. మావయ్య గారిని పిలవండి. నో ప్రాబ్లమ్ నేనే పిలుస్తాను అని అరుస్తాడు శ్రీధర్. దాంతో శివన్నారాయణ వస్తాడు. తర్వాత అంతా వస్తారు.

 

కావేరిని పరిచయం చేసిన శ్రీధర్

ఈవిడ ఎవరో చెప్పు అని శివన్నారాయణ అడిగితే.. మీరు నన్ను కొట్టి తన్ని గెంటేసింది ఈవిడ గురించే. ఈవిడే నా రెండో భార్య. కావేరి అని శ్రీధర్ చెబుతాడు. వాడిని రెండో పెళ్లి చేసుకున్నందుకు కొడితే రెండో భార్యనే ఇంట్లోకి తీసుకొచ్చాడు. రేయ్ ఇద్దరు బయటకు వెళ్లండి అని శివన్నారాయణ అంటాడు. ఉండటానికేం రాలేదు అని కావేరికి ఒక్కొక్కరిని పరిచయం చేస్తుంటాడు శ్రీధర్. సెటైర్లు వేస్తాడు. దశరథ్‌, సుమిత్ర గురించి మాత్రం గొప్పగా చెబుతాడు.

మర్యాదగా వెళ్లిపో బావా అని దశరథ్ అంటాడు. మీరు నన్ను కొట్టినప్పుడే పోయింది మర్యాద. మీరు నేను రెండో పెళ్లి చేసుకున్నానని మోసగాడు అన్నారు. దుర్మార్గుడు అన్నారు. మీ మాటను వెనక్కి తీసుకోమ్మని చెప్పడానికే వచ్చాను శివన్నారాయణ గారు అని శ్రీధర్ అంటాడు. ఏంట్రా ఒల్లు ఎలా ఉందని అంటే ఇప్పుడే స్నానం చేసి వచ్చాను చాలా ఫ్రెష్‌గా ఉందని సెటైర్లు వేస్తాడు శ్రీధర్. ఏరా మళ్లీ తన్నించుకోవాలని అనుకుంటున్నావా అని శివన్నారాయణ అంటే.. మీకు అంత సీన్ లేదని గుర్తు చేయడానికే వచ్చాను అని శ్రీధర్ అంటాడు.

 

బావ గొడవ చేయకుండా వెళ్లిపో అని దశరథ్ అంటే.. మీ చెల్లి ఇంటికి వస్తే డబ్బులు కూడా ఇవ్వని నువ్వు కూడా పౌరుషంగా మాట్లాడుతున్నావా. నాకు మంచి మర్యాద లేదన్నారుగా. ఇదిగో నా మంచితనం నా మానవత్వం. శౌర్య ఆపరేషన్‌కు డబ్బులు ఇచ్చింది నేనే. ఇదిగో చూసుకోండి అని శ్రీధర్ అంటాడు. ఈ మనిషికి ఎంత చెప్పినా అర్థం కాదు అని కావేరి అనుకుంటుంది. సాయం చేయలేదని నాతో చెప్పావ్ కదా అని జ్యోత్స్న అంటే.. నాకు చేసిన సాయం చెప్పుకునే అలవాటు లేదు అని శ్రీధర్ అంటాడు.

అప్పు తీర్చమని అడగడానికి

చిన్నపిల్ల ప్రాణాలు కాపాడి నా మానవత్వం ఏంటో నిరూపించుకున్నాను. నా మంచితనాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాను. నేను మీకంటే మంచి వాన్ని అని చెప్పుకునేందుకే వచ్చాను అని శ్రీధర్ అంటాడు. నీలాగే నీ కొడుకు. నీ ఫ్యామిలీ మోసం చేసే ఫ్యామిలీ. దొందు దొందే. అయినా ఇందులో నీ రెండో భార్య అప్పు ఇచ్చినట్లు ఉంది. సరే ఎవరో ఒకరు ఇచ్చారులే. మీరంతా ఒక్కటే కదా అని శివన్నారాయణ అంటాడు.

అది చెప్పడానికి మా ఇంటికి రావడం దేనికి అని దశరథ్ అంటాడు. నేను అప్పు ఇచ్చాను. వాడు ఎలాగు తీర్చలేడు కాబట్టి మీరు తీర్చండి అని అడగడానికి అని శివన్నారాయణ అంటాడు. అలా అంటే మాత్రం తీరుస్తారా అని శ్రీధర్ అంటాడు. దాంతో పేపర్ విసిరికొట్టి ఎవరి అప్పు ఎవరు తీరుస్తారు. వాడెవడు నువ్వెవడు. మరోసారి మంచితనం మట్టి అంటూ అడ్డమైన వాళ్లను తీసుకొస్తే మెడపట్టి గెంటేయాల్సి వస్తుంది. సుమిత్ర వీళ్లు వెళ్లగానే పసుపు నీళ్లతో ఇంటిని శుద్ధి చేయించండి అని శివన్నారాయణ కోప్పడుతాడు.

 

పసుపుతో కాకుంటే పన్నీరుతో చల్లించుకోండి. అమ్మా సుమిత్ర ఆ పసుపు నీళ్లు మీ మావయ్య గారి నోట్లో కూడా చల్లమ్మా అని శ్రీధర్ అంటాడు. అప్పు ఇచ్చేముందు నాకు చెప్పి ఉండాల్సింది మావయ్య అని జ్యోత్స్న అంటుంది. నీకెందుకు చెప్పాలే అని సుమిత్ర వారిస్తుంది. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా నేను ఎన్నో సహాయాలు చేశాను అని గొప్పలు చెబుతుంటాడు శ్రీధర్. ఇక చాలు ఆపండి అని కావేరి అంటుంది. ఆపను అని శ్రీధర్ అంటాడు.

మంచి ఛాన్స్ మిస్ అయింది

వీళ్లు దీపకు డబ్బిచ్చి నా కండిషన్‌కు ఒప్పుకోకుండా చేశారు. ఛ.. మంచి ఛాన్స్ మిస్ అయిందని జ్యోత్స్న అనుకుంటుంది. పారిజాతం జ్యోత్స్నను తీసుకెళ్లిపోతుంది. దశరథ్ కూడా వెళ్లిపోతాడు. ఏం చెల్లమ్మా నువ్ కూడా తిట్టాల్సింది ఉందా అని శ్రీధర్ అంటే.. ఉందన్నయ్యా.. ముందుగా కావేరికి థ్యాంక్స్ చెప్పాలి. మేము చేయలేని పని నువ్ చేశావ్. దీప విషయంలో నేను తీర్చుకోవాల్సిన రుణాన్ని నువ్ తీర్చుకున్నావ్. చేయాలంటే మంచి మనసు ఉండాలి. అది నీకు ఉంది వదినా అని సుమిత్ర అంటుంది.

దీప నా కూతురులాంటిది. దానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. దీపకు సాయం చేశావంటే నాకు సాయం చేసినట్లే. నీ సాయం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను వదినా అని సుమిత్ర అంటుంది. ప్రేమగా పిలిచారు. అది చాలు అని కావేరి అంటుంది. తర్వాత కావేరి, శ్రీధర్ వెళ్లిపోతారు. అక్కడితో నేటి కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024