


Best Web Hosting Provider In India 2024

Rose Plant: ఇంట్లో ఉన్న గులాబీ మొక్కకు పువ్వులు పెద్దవిగా ఎక్కువగా పూయాలంటే ఈ చిన్న చిట్కాలు ఫాలో అవ్వండి చాలు
వసంతకాలంలోనే గులాబీలు అధికంగా పూస్తాయి. గులాబీలను మీరు ఇంట్లో పెంచుతున్నట్లయితే చిన్న చిట్కాల ద్వారా ఎక్కువ గులాబీ పూలు పూసేలా చేయవచ్చు. కలుపు తీయడం, సరిగ్గా కత్తిరించడం, నీరు పోయడం, ఎరువు వేయడం వంటి పనులతో మీ మొక్కలను కాపాడుకోవచ్చు.
గులాబీ పువ్వులు గుత్తులుగా కాసే కాలం వచ్చేసింది. వసంతకాలంలోనే గులాబీ మొక్కలు మొగ్గ తొడిగి వరుసగా పువ్వులు పూయడం మొదలుపెడతాయి. గులాబీ మొక్కను పెంచాలంటే వాటిపై శ్రద్ధ చూపించడం చాలా అవసరం. ఈ సమయంలో మీరు సరిగ్గా చూసుకోకపోతే, అవి పూయవు.
చలికాలం ముగిశాక గులాబీ మొక్కలకు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సరైన ఎరువు, నీరు, కీటకాల నియంత్రణ, కత్తిరింపు అవసరం. దీన్ని ఫిబ్రవరిలో…అంటే వేసవి ప్రారంభంలో సరిగ్గా చేస్తే, రోజాలు చక్కగా పూయడం ప్రారంభిస్తాయి.
రోజా మొక్క శీతాకాలంలో తనను తాను రక్షించుకోవడానికి నిష్క్రియ స్థితిలోకి వెళుతుంది. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, అది పెరగడం ఆపుతుంది. ఆకులను కోల్పోతుంది. కానీ జీవంతో ఉంటుంది. తిరిగి ఫిబ్రవరి కాలంలో తిరిగి పుష్పించడానికి సిద్ధమవుతుంది.
• ఫిబ్రవరిలో మొగ్గలు రావడం ప్రారంభమవుతుంది
• ఆకుపచ్చని రంగు వస్తుంది
• మెత్తని కొమ్మలు ఏర్పడతాయి.
ఈ మార్పులు కనిపిస్తే, మీరు గులాబీ మొక్కను జాగ్రత్తగా చూసుకోవలసిన సమయం వచ్చిందని అర్థం.
కొమ్మలను కత్తిరించడం
మొదటగా, కొమ్మలు లేదా పాడైన ఆకులను తొలగించాలి. ఇది కొత్త ఆకుల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. వాడిపోయిన కొమ్మలను తొలగించడం వలన, గాలి ప్రసరణ పెరుగుతుంది. సరైన కత్తెరను ఉపయోగించి మొక్కను కత్తిరించాలి. అలాగే చనిపోయిన, చెడిపోయిన కొమ్మలను తొలగించాలి.
మొక్క కింద శుభ్రపరచడం
గులాబీ పువ్వులు దట్టంగా పెరగడానికి, వ్యాధుల నుండి రక్షించుకోవడానికి, ఆరోగ్యకరమైన నేల అవసరం. కాబట్టి, మొక్క ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. రాలిన ఆకులను నేల నుండి తొలగించాలి. అవి ఫంగస్, కీటకాలకు ఆవాసాలుగా ఉంటాయి. కింద ఉన్న కలుపు మొక్కలను తొలగించాలి. అవి మొక్కకు అవసరమైన పోషకాలను పొందకుండా చేస్తాయి. నేలను కదిలించి, నీరు బయటకు పోయేలా, గాలి ప్రసరించేలా చేయాలి.
సరైన పోషకాలు
ముఖ్యంగా శీతాకాలం తర్వాత గులాబీ మొక్కలకు ఎక్కువ ఎరువు వేయాలి. సేంద్రీయ ఎరువు, అరటి తొక్కలు వేయాలి. కింద ఎరువు వేసి, ఆకులు ఎండిపోకుండా చూసుకోవాలి.
నీరు
రోజా మొక్కలకు శీతాకాలంలో ఎక్కువ నీరు అవసరం లేదు. కానీ అవి పూయడం ప్రారంభించినప్పుడు, అవసరమైనంత నీరు పోయాలి. ఆకులపై నీరు పోయకూడదు. అది ఫంగస్ సంక్రమణకు దారితీస్తుంది. నేలను తనిఖీ చేసి ఒక లోతులో ఎండినట్ట కనిపిస్తేనే నీరు పోసే సమయం వచ్చిందని అని అర్థం.
వ్యాధులు
ఫంగస్ వంటి సంక్రమణలు వేసవిలో అధికంగా ఉంటాయి. కాబట్టి వేపనూనె, కీటకనాశక పదార్థాలను ఉపయోగించి వాటిని నియంత్రించాలి. పక్షులు వచ్చేచోట మొక్కలను ఉంచితే అవి కీటకాలను తింటాయి. మంచి గాలి ప్రసరణ వచ్చే చోట మొక్కలను ఉంచాలి. ఎక్కువ నీరు పోయడాన్ని నివారించాలి. అవసరమైతే ఫంగస్‌ను చంపే ఎరువు వేయాలి.
సంబంధిత కథనం