



Best Web Hosting Provider In India 2024

South Central Railway : మహా కుంభమేళా ప్రయాణం – విజయవాడ రైల్వే డివిజన్ నుంచి ఎంత మంది వెళ్లారో తెలుసా..?
తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు ప్రయాణికులు భారీగా తరలివెళ్తున్నారు. అయితే ఒక్క విజయవాడ రైల్వే డివిజన్ పరిధి నుంచి ఇప్పటివరకు 60 వేల మంది ప్రయాణికులు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య మరింతకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
మహాకుంభమేళాకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రయాణికులు భారీగా వెళ్తున్నారు. ఫిబ్రవరి 21వ తేదీ వరకు కుంభమేళాకు వెళ్లిన ప్రయాణికుల వివరాలను విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు వెల్లడించారు.
60 వేలకుపైగా ప్రయాణికులు….
ఫిబ్రవరి 21వ తేదీ వరకు 60వేలకుపైగా ప్రయాణికులు కుంభమేళాకు వెళ్లారని పేర్కొన్నారు. మొత్తం 115 రెగ్యూలర్ మరియు మరికొన్ని ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయని వెల్లడించారు. జనవరి నుంచి ప్రయాగ్ రాజ్ కు ఈ రైళ్లు నడుస్తున్నాయని ప్రకటించారు.
ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, కాకినాడ, నర్సాపూర్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు వివరించారు. ఇక దేశవ్యాప్తంగా చూస్తే… జనవరి 13వ తేదీ నుంచి 3.09 కోట్ల మంది యాత్రికులు భారతీయ రైల్వేల ద్వారా ప్రయాగ్రాజ్చేరినట్లు పేర్కొంది.
పోటెత్తుతున్న భక్తులు:
ఇక ప్రయాగ్రాజ్లో జరుగుతోన్న మహాకుంభమేళాకు దేశవ్యాప్తంగా భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే 50 కోట్లమందికి పైగా స్నానాలు ఆచరించారు. ప్రతి 12 ఏళ్లకు ఓసారి నిర్వహించే ఈ మహా కుంభమేళా జనవరి 13న మొదలైన సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 26వ తేదీతో మహా కుంభమేళా ముగుస్తుంది. మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో… దేశం నలుమూలల నుంచి యాత్రికులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది.
ఇక కుంభమేళకు వెళ్లేందుకు చాలా మంది రైళ్ల సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రత్యేక రైళ్లతో పాటు రెగ్యూలర్ ట్రైన్స్ ను బుకింగ్ చేసుకొని వెళ్తున్నారు. కుంభమేళా ద్వారా రైల్వేశాఖకు భారీగానే ఆదాయం రానుంది. ఇక రైళ్లలో వెళ్లటం కుదరని వాళ్లు… సొంత వాహనాలు లేదా ప్రైవేటు బస్సుల్లో వెళ్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్