Best Web Hosting Provider In India 2024
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరులో జరిగిన సామాజిక సాధికార యాత్ర పోటెత్తిన జనంతో హోరెత్తింది. కృష్ణమ్మ పరవళ్లు గుర్తుచేస్తూ.. జనపరవళ్లు సాగాయి. చీకటి పడుతున్నా, ఆలస్యమైనా కదలకుండా జనం బహిరంగసభ పూర్తయ్యేంత వరకు ఉన్నారు. వేలాదిగా తరలివచ్చిన జనం ..జైజగన్ అంటూ సభాస్థలిని హోరెత్తించారు. ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో డిప్యూటీసీఎం అంజాద్‌బాషా, మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు ఆర్థర్, హఫీజ్‌ఖాన్ లతో పాటు ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల నాయకులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మాట్లాడుతూ…
–ఈరోజు, ఈ రాష్ట్రంలో సామాజిక సాధికారత అనేది ఒక విధానంగా మారింది. ఈ ఘనత జగనన్నదే.
–ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు కలిసి, ప్రజల ముందుకు వచ్చి, మాట్లాడుతున్నారంటే, సీఎం జగన్ వెన్నుతట్టి, ముందుకు నడిపించడం వల్లే.
–అన్నివర్గాల ప్రజలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు.
–డ్వాక్రా మహిళలను మోసం చేశాడు. నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజం.
–నమ్మినప్రజల కోసం ఎందాకైనా అనే నైజం జగనన్నది.
–చంద్రబాబు 30 లక్షలమందికి రూ.1000 చొప్పున పింఛన్లు ఇస్తే, నేడు రూ.2,750 చొప్పున 64 లక్షలమందికి సీఎం జగన్ పింఛన్లు ఇస్తున్నారు.
–ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంటి ముఖ్యమంత్రి మరొకరెవరైనా దేశంలో ఉన్నారా అంటే లేదనే జవాబొస్తుంది.
–చరిత్ర రాయాలంటే ఒక్క వైఎస్సార్ కుటుంబానికే చెల్లుతుంది.
–మైనార్టీ మహిళకు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ పదవినిచ్చిన జగనన్న, వెనుకబడిన వర్గాలకు ఎంతో మంచి చేశారు.
–సామాజిక న్యాయాన్ని పాటించి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారు సీఎం జగనన్న. అగ్రవర్ణాలతో సమానంగా ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు కల్పించారు.
– మనకు కష్టకాలంలో మన వెంట ఉండి..ముందుకు నడిపించిన జగనన్న వెంటే నడుద్దాం. జగనన్ననే నమ్ముదాం.
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ…..
– బీసీ డిక్లరేషన్ చేసి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్ద పీట వేస్తానని జగనన్న చెప్పాడు. చెప్పింది చెప్పినట్టే చేసి చూపించారు.
– ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కేబినెట్లో అణగారిన వర్గాలకు పెద్దపీట వేయలేదు. ఆ ఘనత జగనన్నదే. 70శాతం వరకు ఆయా వర్గాలవారికే పదవులు అప్పగించారు.
– బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పెద్దపీట వేశారు సీఎం జగనన్న.
– నామినేటెడ్ పోస్టులతో పాటు, నామినేషన్ పనుల్లోనూ ప్రాధాన్యత నిచ్చారు.
– బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానించిన చరిత్ర బాబుది. మైనార్టీలను చులకన చేసిన దుర్మార్గం చంద్రబాబుది.
– పార్టీలను, కులాలను,మతాలను, ప్రాంతాలను పట్టించుకోకుండా, అర్హులైనవారందరికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్న సీఎం జగన్ ఆదర్శప్రాయుడు.
– తన వర్గం, తనవారి బాగు కోసమే పనిచేసిన కుత్సిత స్వభావి చంద్రబాబు.
సామాజిక సాధికారతను సాకారం చేసి బడుగు, బలహీనవర్గాల ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్న మనసున్న నాయకుడు.. వైఎస్.జగన్మోహన్రెడ్డి.
మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ…..
–వైయస్ రాజశేఖరరెడ్డి, సీఎం వైయస్ జగనన్న ఫొటోలు పెట్టుకుని గెలిచినవారం మేము.
–పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆడపడుచుల పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
–అణగారిన వర్గాలకు అండాదండగా నిలబడటమే కాదు, వారి స్థాయిని పెంచడం కోసం జగనన్న చేస్తున్న కృషి సామాన్యమైనది కాదు,
–సాంఘిక న్యాయంపై దృష్టంతా పెట్టిన జగనన్న ఒక సంఘ సంస్కర్త.
– వెనుకబడిన వర్గాల కోసం రాజకీయ,సామాజిక,ఆర్థిక, విద్య, వైద్యం వంటి రంగాల్లో హద్దులు లేకుండా అవకాశాలు కల్పించాడు జగనన్న.
–దీనితో అట్టడుగు వర్గాల వారు నేడు సమాజంలో గౌరవంగా తలెత్తుకుని జీవిస్తున్నారు.
ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ….
–వైయస్ఆర్సీపీ గుండె చప్పుళ్లయ్యారు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాల ప్రజలు.
–ఈ శ్రీశైలం నియోజకవర్గంలో సంక్షేమపథకాల ద్వారా లబ్దిదారులకు డీబీటీ ద్వారా రూ.764 కోట్లు, నాన్‌డీబీటీ ద్వారా 284 కోట్ల రూపాయలు అందాయి.
– అంతేకాక అన్ని స్థాయిల్లో 60 శాతం పైగా పదవులు బలహీనవర్గాలకు అందాయి.
–సమాజంలోని అట్టడుగు వర్గాలను గుండెకు హత్తుకుని, సమానావకాశాలు కల్పిస్తున్నారు సీఎం జగనన్న.
–ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే.
–ఈనాడు జరుగుతున్న అభివృద్ధి చూడలేని ప్రతిపక్షం గుడ్డిగా విమర్శిస్తోంది.
–జగనన్న హయాంలో గ్రామాల రూపురేఖలు మారాయి. సరికొత్త నిర్మాణాలు ఎన్నో వచ్చాయి. పల్లెపల్లెన ప్రగతిబాటలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూడలేని గుడ్డివాళ్లే విమర్శలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ….
–అణగారిన వర్గాలకు, పేదలకు మేలు చేసే వ్యక్తి, దార్శనికుడైన నాయకుడు సీఎం జగన్మోహన్రెడ్డి.
–కరోనా కష్టకాలంలో అద్భుతంగా పనిచేసిన నాయకుడు జగనన్న.
–దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని రీతిలో కరోనా సంక్షోభ పరిస్థితుల్లో..ప్రజలకోసం పనిచేసిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం.
–అత్యంత సమర్థంగా ఆ గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం.
ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ..
–ఈరోజు శ్రీశైల నియోజకవర్గ ప్రజలందరూ ఆత్మకూరుకు తరలివచ్చినట్టు కనిపించింది. కృష్ణమ్మ పరవళ్లు..జన పరవళ్లయి పరుగులెత్తినట్టు కనిపించింది.
–ముఖ్యమంత్రి జగనన్నపై అభిమానంతో తరలివచ్చిన బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాల ప్రజలు..జై జగన్ అన్న నినాదాలతో హోరెత్తించారు.
–అణగారిన వర్గాలకు జగనన్న చేసిన మంచి మరిచిపోలేనిది. సంక్షేమ పథకాలతో ఆయా వర్గాల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు జగనన్న.
–పేద,అణగారిన వర్గాల పిల్లలు చదువుల విషయంలో వెనుకబడకూడదన్నది జగనన్న ఆరాటం.
–చదువు పేదపిల్లల తలరాతలు మారుస్తుందని గట్టిగా నమ్మిన జగనన్న..విద్యారంగంలో విప్లవాత్మకమార్పులు తీసుకువచ్చారు.
–ఈరోజు పేదింటి పిల్లలు దర్జాగా బడులకు వెళుతున్నారు. ఇంగ్లీషు మీడియం చదువులు చదువుతున్నారు.
–ఇక వైద్యరంగంలోనూ విప్లవాత్మకమార్పులు తీసుకొచ్చారు సీఎం జగనన్న. పేదల గడపల దగ్గరకే వైద్యసేవలు అందుతున్నాయంటే…ఇంతకన్నా సంక్షేమరాజ్యం ఉంటుందా అని అనిపించకమానదు.
మాజీ ఎంపీ బుట్టారేణుక మాట్లాడుతూ….
– గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ప్రజలకు ఏదో చేస్తామని మభ్యపెట్టి కాలాన్ని గడపడమే చూశాం.
– కానీ జగనన్న ప్రభుత్వం అందుకు పూర్తిగా భిన్నంగా పనిచేస్తోంది.
– మనసున్న నేత, ప్రజల కష్టాలు, బాధలు తెలుసుకున్న నాయకుడు.. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే పేదలకోసం పనిచేయడం మొదలు పెట్టారు.
– బడుగు, బలహీనవర్గాలకు చేయూతనిచ్చి, వారి స్థాయిని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు సీఎం జగనన్న. సుపరిపాలన అంటే ఇది అనేలా జగనన్న పాలన సాగుతోంది.
– బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం, సంక్షేమంలో అగ్రపీఠం సీఎం వైయస్ జగన్ సర్కార్‌లో దక్కింది.