



Best Web Hosting Provider In India 2024

Priyadarshi: తెలుగు సినిమాకు స్వర్ణయుగం నడుస్తోంది, గారాల చిన్న కొడుకు నాని.. కమెడియన్ ప్రియదర్శి కామెంట్స్
Priyadarshi About Telugu Cinema In Court Press Meet: కమెడియన్ అండ్ హీరో ప్రియదర్శి నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. వాల్ పోస్టర్ బ్యానర్‌పై నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన కోర్ట్ ప్రెస్ మీట్‌లో ప్రియదర్శి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Priyadarshi About Telugu Cinema In Court Press Meet: కమెడియన్‌గా సినీ కెరీర్ ఆరంభించి మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రియదర్శి. అనంతరం బలగం, డార్లింగ్ వంటి సినిమాల్లో హీరోగా నటించి మెప్పించాడు. ఇప్పుడు ప్రియదర్శి నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ.
నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్
ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ కోర్ట్ సినిమాను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్నాడు. అలాగే, ‘కోర్ట్’ – స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా ఉన్నారు.
కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ సినిమాను మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోర్ట్ ప్రెస్ మీట్‌కు హీరో నాని ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అలాగే, ఈ ఈవెంట్‌లో పాల్గొన్న ప్రియదర్శి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
అద్భుతమైన కథలతో
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. తెలుగు సినిమాకి స్వర్ణయుగం నడుస్తోంది. ఇలాంటి సమయంలో నాని అన్న అద్భుతమైన కథలతో సినిమాలు తీస్తున్నారు. నాని అన్నతో నటిస్తూ, స్ఫూర్తి పొందుతూ, అన్న బ్యానర్‌లో సినిమా చేయడం లక్కీగా భావిస్తున్నాను” అని అన్నాడు.
“తెలుగు సినిమా గారాల చిన్న కొడుకు నాని అన్న. ఒక్క సిట్టింగ్‌లో కథని ఓకే చేశారు. ఇప్పటి వరకూ సినిమాకి ఇచ్చిన రెస్పాన్స్‌కి థాంక్ యూ. మీ నుంచి మరింత ప్రేమ కావాలి. ఇలాంటి సినిమాని సపోర్ట్ చేయాలని కొరుకుంటున్నాను” అని హీరో, కమెడియన్ ప్రియదర్శి చెప్పుకొచ్చాడు.
కథ నచ్చితే ఎంత అయినా
ఇదే ప్రెస్ మీట్‌లో నిర్మాత దీప్తి గంటా మాట్లాడుతూ.. “నాని, ప్రశాంతి ప్రొడక్షన్ హౌస్‌లో రెగ్యులర్ ప్రొడ్యూసర్ రూల్ బుక్ ఉండదు. కథ నచ్చితే ఎంత అయినా పెడతారు. మా టీం విషయంలో చాలా ప్రౌడ్‌గా ఉన్నాను. జగదీశ్ అద్భుతమైన స్క్రిప్ట్ రాశారు. అంతే అద్భుతంగా సినిమాని తీశాడు. మార్చి 14న చాలా మంచి సినిమా చూడబోతున్నారు. నిర్మాతగా ఈ అవకాశం ఇచ్చిన నానికి థాంక్ యూ. కోర్ట్ గ్రేట్ ఫిల్మ్. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది” అని అన్నారు,
“నాని గారి ప్రొడక్షన్‌లో అన్నీ సక్సెస్‌ఫుల్ సినిమాలే వచ్చాయి. అలాంటి సక్సెస్‌ఫుల్ సినిమా ఇవ్వడం నా రెస్పాన్స్‌బులిటీ. నన్ను బిలివ్ చేసిన నాని గారికి థాంక్ యూ. ఒక్క డౌట్ లేకుండా స్క్రిప్ట్‌ని నమ్మి సినిమా చేశారు” అని డైరెక్టర్ రామ్ జగదీష్ తెలిపారు.
ఎలాంటి నటుడో అర్థం చేసుకోవచ్చు
“గంటసేపు ప్రియదర్శి క్యారెక్టర్ సినిమాలో ఉండదని తెలిసినా ఆయన ఒప్పుకున్నారంటే దర్శి ఎలాంటి నటుడో అర్థం చేసుకోవచ్చు. లవ్ యూ అన్న. ఇలాంటి సినిమా చేయడానికి గొప్ప మనసు కావాలి. చందు జాబిల్లి మై లవ్. వారి క్యారెక్టర్స్ ఈ సినిమాకి బలం. దీప్తి గారు సెట్స్‌లో ఉంటే ఎప్పుడూ భయం ఉండదు. చాలా కంఫర్ట్‌ఫుల్‌గా సినిమాని చేశాను. మా టీం అందరికీ థాంక్ యూ” అని దర్శకుడు రామ్ జగదీష్ అన్నారు.