


Best Web Hosting Provider In India 2024

Dominate Actors: హీరోలను డామినేట్ చేసిన నటులు.. రామ్ చరణ్, సూర్యలను మించి నటించింది ఎవరంటే?
Actors Who Dominated Heroes In Movies: సినిమాల్లో హీరోలే అందరికంటే ఎక్కువగా ఉంటారు. వారిని మించి ఏ రోల్ ఉండదు. అలాంటి హీరోలను కూడా తమ యాక్టింగ్‌తో డామినేట్ చేసిన నటులు ఉన్నారు. మరి సినిమాల్లో హీరోలను కూడా డామినేట్ చేసిన నటులు, వారి పాత్రలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
Actors Who Dominated Heroes In Movies: సినిమాల్లో హీరో క్యారెక్టర్ అందరికంటే ఎక్కువగా ఇంపార్టెన్స్‌తో ఉంటుంది. మెయిన్‌గా హీరోకు ఎలివేషన్స్ ఇచ్చే సీన్స్‌తోనే సినిమా సాగుతుంటుంది. ఇక సినిమాల్లో హీరోలకు మించిన పాత్రలు ఏవి ఉండవు. కొన్నిసార్లు మాత్రమే పవర్‌ఫుల్ విలన్ రోల్స్ పడతాయి. కానీ, అవి కూడా హీరోను మరింత ఎలివేట్ చేసేందుకే ఉంటుంది.
ఒంటి చేత్తో నడిపించే
అయితే, సినిమాలను ఒంటి చేత్తో నడిపించే హీరోలను కూడా తమ యాక్టింగ్‌తో డామినేట్ చేసి క్రేజ్ తెచ్చుకున్న నటులు ఉన్నారు. సినిమాల్లో హీరోలను డామినేట్ చేసిన యాక్టర్స్, వారి పాత్రలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
సొంతం
శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు కామెడీ రొమాంటిక్ మూవీ సొంతం. 2002లో వచ్చిన ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్ హీరోగా, నమిత హీరోయిన్‌గా చేశాడు. సునీల్ కమెడియన్‌గా అలరించాడు. అయితే, ఈ మూవీలో హీరో ఆర్యన్ రాజేష్ అయినప్పటికీ ఎక్కువ పేరు తెచ్చుకుంది మాత్రం సునీల్. దాదాపుగా సొంతం సినిమాకు అసలైన హీరో సునీల్ అనేంతలా తన కామెడీతో నవ్వించాడు.
సొంతం సినిమాలో స్టార్ కమెడియన్ ఎమ్ఎస్ నారాయణ, తనికెళ్ల భరణి వంటి నటులు ఉన్న సునీల్ ఎక్కువ ఫోకస్ అయ్యాడు. తన కామెడీ టైమింగ్ డైలాగ్‌లతో సొంతం సినిమాలో హీరోను సునీల్ డామినేట్ చేశాడు.
ధ్రువ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా ధ్రువ. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ తన నటనతో, యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టాడు. అయితే, ఈ సినిమాలో విలన్‌గా చేసిన అరవింద్ స్వామి తన నటనతో మరింతగా ఇచ్చిపడేశాడు. సినిమాలో రామ్ చరణ్ కంటే అరవింద్ స్వామికి చాలా మంది ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు.
ధ్రువలో అరవింద్ స్వామి తన నటనతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. స్టైలిష్ లుక్స్, స్క్రీన్ ప్రజెన్స్, యారగంట్ యాక్టింగ్‌తో రామ్ చరణ్‌ను డామినేట్ చేశాడని చెప్పుకోవచ్చు.
మార్క్ ఆంటోనీ
తమిళ సినీ ఇండస్ట్రీలో నటుడిగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు ఎస్‌జే సూర్య. ఇటీవల సరిపోదా శనివారం, గేమ్ ఛేంజర్ వంటి సినిమాల్లో కూడా తన నటనతో ఎస్‌జే సూర్య అలరించాడు. అయితే, స్టార్ హీరో విశాల్ నటించిన మార్క్ ఆంటోని సినిమాలో ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషించాడు. ఇందులో హీరో విశాల్ అయినప్పటికీ తన యాక్టింగ్‌తో డామినేట్ చేశాడు ఎస్‌జే సూర్య.
జై భీమ్
2021లో టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన జై భీమ్ సినిమాకు ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో తెలిసిందే. అలాగే, ఇందులో లాయర్‌గా స్టార్ హీరో సూర్య అదరగొట్టాడు. సూర్య నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. అయితే, చిన్నతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ జోస్ కూడా సూర్యతో పోటీ పడి నటించి మరి డామినేట్ చేసినంత పర్ఫామెన్స్ ఇచ్చింది.
సంబంధిత కథనం
టాపిక్