



Best Web Hosting Provider In India 2024

India vs Pakistan Dhoni: టీవీకి అతుక్కుపోయిన ధోని.. సన్నీ డియోల్ తో కలిసి భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ వాచ్
India vs Pakistan Dhoni: భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అందించే కిక్కే వేరు. ఈ మదర్ ఆఫ్ ది ఆల్ మ్యాచెస్ ను చూడటానికి అందరూ టైమ్ స్పెండ్ చేస్తారు. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోని కూడా ఆదివారం భారత్, పాక్ మ్యాచ్ ను చూసేందుకు టీవీకి అతుక్కుపోయాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ను వీక్షించే అవకాశాన్ని లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వదులుకోలేదు. బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ స్టూడియో నుంచి ధోని మ్యాచ్ చూశాడు. ఐపీఎల్ 2025 షూటింగ్ లో ధోని బహుషా ఉన్నాడేమో అందుకే ఎల్లో జెర్సీ వేసుకుని కనిపించాడు. బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ తో కలిపి మ్యాచ్ చూస్తున్న ధోని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్టూడియో లో కూర్చుని
భారత్, పాక్ మ్యాచ్ ను సన్నీ డియోల్ తో కలిసి ధోని వీక్షించడాన్ని స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దుబాయ్ లోని అంతర్జాతీయ స్టేడియంలో పాక్ ను భారత్ చిత్తు చేయడం మాజీ కెప్టెన్ ధోని చూస్తున్నాడంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
ఈ మెగా మ్యాచ్ కు ముందు డియోల్ ఒక టీజర్ వీడియోలో తాను ఒక ప్రత్యేకమైన సెలబ్రిటీతో మ్యాచ్ ను వీక్షిస్తానని వెల్లడించాడు. చాలా మంది ఊహించినట్లుగా దానికి ‘సెవెన్’ కనెక్షన్ ఉందని సూచించాడు.
2013 ఛాంపియన్స్ ట్రోఫీ
భారత క్రికెట్ జట్టు ఎమ్ఎస్ ధోని కెప్టెన్సీలో 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భారత జట్టు 50 ఓవర్ల ఫార్మాట్లో మరో ఐసీసీ టోర్నీ గెలవలేకపోయింది. 2024లో టీ20 ప్రపంచకప్ సొంతం చేసుకుంది. ఈ సారి ఐసీసీ టోర్నీ గెలవాలనే లక్ష్యంతో భారత్ ఉంది. దుబాయ్ లో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 241 పరుగులకు ఆలౌటైంది.