Crime Comedy OTT: నాలుగేళ్ల త‌ర్వాత మ‌రో ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు క్రైమ్ కామెడీ మూవీ – థ్రిల్లింగ్ క్లైమాక్స్‌తో…

Best Web Hosting Provider In India 2024

Crime Comedy OTT: నాలుగేళ్ల త‌ర్వాత మ‌రో ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు క్రైమ్ కామెడీ మూవీ – థ్రిల్లింగ్ క్లైమాక్స్‌తో…

Crime Comedy OTT: శ్రీవిష్ణు హీరోగా న‌టించిన తెలుగు క్రైమ్ కామెడీ మూవీ అర్జున ఫాల్గుణ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. థియేట‌ర్ల‌లో రిలీజైన నాలుగేళ్ల త‌ర్వాత అమెజాన్ ప్రైమ్‌లో అర్జున ఫాల్గుణ రిలీజ్ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ సినిమాలో హ‌నుమాన్ ఫేమ్ అమృతా అయ్య‌ర్ హీరోయిన్‌గా న‌టించింది.

 
క్రైమ్ కామెడీ ఓటీటీ
క్రైమ్ కామెడీ ఓటీటీ

Crime Comedy OTT: శ్రీవిష్ణు హీరోగా న‌టించిన అర్జున ఫ‌ల్గుణ మూవీ 2021లో థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. థియేట‌ర్ల‌లో రిలీజైన నాలుగేళ్ల త‌ర్వాత అర్జున ఫాల్గుణ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. అర్జుణ ఫాల్గుణ స్ట్రీమింగ్ అవుతోన్న విష‌యాన్ని అమెజాన్ ప్రైమ్ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

 

హ‌నుమాన్ ఫేమ్‌…

అర్జున ఫాల్గుణ మూవీలో హ‌నుమాన్ ఫేమ్ అమృతా అయ్య‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. రాజ్‌కుమార్ క‌సిరెడ్డి, రంగ‌స్థ‌లం మ‌హేష్‌, శివాజీ రాజా కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాకు తేజ మార్ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్ మూవీగా ప్ర‌మోష‌న్స్‌తో అర్జున ఫాల్గుణ ఆడియెన్స్‌లో ఆస‌క్తిని రేకెత్తించింది.

అర్జున ఫాల్గుణ క‌థ ఇదే…

అర్జున్‌కు (శ్రీవిష్ణు) స్నేహితులే ప్ర‌పంచం. శ్రావ‌ణితో (అమృతా అయ్య‌ర్‌) పాటు రాంబాబు, త‌డ్డోడు, అస్క‌ర్‌ల‌తో జులాయిగా తిరుగుతుంటాడు. స్నేహితుల‌తో క‌లిసి ఓ సోడా కంపెనీ ప్రారంభించాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. మ‌రోవైపు త‌డ్డోడు కుటుంబానికి ఓ ఆప‌ద వ‌స్తుంది.

అందుకోసం డ‌బ్బు అవ‌స‌రం అవుతుంది. గంజాయి స్మగ్లింగ్ చేసి ఈజీగా డ‌బ్బు సంపాదించాల‌ని ప్లాన్ వేస్తాడు అర్జున్‌. అనుకోకుండా చిక్కుల్లో ప‌డ‌తారు.అర్జున్‌తో పాటు అత‌డి స్నేహితుల‌ను పోలీసుల‌తో పాటు ఓ రౌడీ గ్యాంగ్ చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. వాళ్లు ఎవ‌రు? ఈ స‌మ‌స్య‌ల నుంచి అర్జున్ అండ్ గ్యాంగ్ ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు అన్న‌దే ఈ మూవీ క‌థ‌. అర్జున ఫాల్గుణ మూవీకి ప్రియ‌ద‌ర్శ‌న్ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్య‌మ్ మ్యూజిక్ అందించాడు.

డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో…

కెరీర్ ఆరంభం నుంచి డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో సినిమాలు చేస్తూ వైవిధ్య‌త‌ను చాటుకుంటోన్నాడు శ్రీవిష్ణు. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా, ఓం భీమ్ బుష్ సినిమాల‌తో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ల‌ను అందుకున్నాడు. శ్రీవిష్ణు హీరోగా న‌టించిన గ‌త‌ మూవీ స్వాగ్ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న‌ది. ప్ర‌స్తుతం సింగిల్‌తో పాటు మ‌రో సినిమా చేస్తున్నాడు.

 

తెలుగులో జోహార్‌…

అర్జున ఫాల్గుణ డైరెక్ట‌ర్ తేజా మార్ని…తెలుగులో జోహార్‌తో పాటు కోట బొమ్మాళి పీఎస్ సినిమాలు చేశాడు. య‌క్షిణి వెబ్‌సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

 

 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024