Gunde Ninda Gudi Gantalu Today Episode: వంద షాపులకు ఓనర్‌గా మీనా- పార్క్‌లో మనోజ్‌ను చూసేసిన బాలు- అన్న వీడియో బట్ట బయలు

Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu Today Episode: వంద షాపులకు ఓనర్‌గా మీనా- పార్క్‌లో మనోజ్‌ను చూసేసిన బాలు- అన్న వీడియో బట్ట బయలు

Gunde Ninda Gudi Gantalu Serial February 24th Episode: గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 24 ఎపిసోడ్‌లో మీనాను అంతా పొగుడుతుంటారు. లాభం వచ్చిందని ప్రభావతి ముందు గొప్పలు పోతాడు బాలు. మీనా వంద షాపులకు ఓనర్ అవుతుందని సత్యం అంటాడు. పార్కులో మనోజ్‌ను చూసిన బాలు వీడియో తీస్తాడు.

 
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 24 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 24 ఎపిసోడ్‌
 

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఇన్ని రోజులు అతని కంట్రోల్‌లో ఉంది. మీనాకు ఇప్పుడు నేను సపోర్ట్‌గా ఉన్నా. డబ్బులు ఇస్తున్నాను. మీనా సొంతంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. ఇక బాలు ఆటలు సాగవు అనే భయం మొదలైంది అని శ్రుతి అంటుంది.

 

రెండు పిట్టలు అన్నట్లు

లాజిక్‌గా ఆలోచించు శ్రుతి. అంత భయముంటే వదినతో పూలకొట్టు ఎందుకు పెట్టిస్తాడు. మొన్న అమ్మ ఖాళీగా ఉంటుందని అందికదా. అందుకు పెట్టించాడు అని రవి అంటాడు. నువ్ శత్రువలో కూడా మంచితన గుర్తించే గుణం నీది. నీకు వీళ్లంతో గొప్పగొప్పవాళ్లలాగే కనిపిస్తారు. కానీ, వీళ్లేంటో నాకు తెలుసు. ఆ కొట్టు ఎందుకు పెట్టించాడో చెప్పనా నేను మీనాకు డబ్బులు ఇస్తే ఎక్కడ తన వినదేమోనని భయం. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు కొట్టు పెట్టించాడన్న గౌరవంతోపాటు తను ఆడించినట్లు ఆడుతుంది అని శ్రుతి అంటుంది.

చూస్తూ ఉండు మీనా ఇక నుంచి బాలుకు బానిస అవుతుంది. నిజాలు కాబట్టి మాట్లాడుతున్నాను. మీనా కొట్టుతో సంపాదించే డబ్బుతో ఇంకా ఎక్కువ తాగుతాడు. ఇంకా చెప్పాలంటే డ్రైవింగ్ మానేసి ఇంట్లోనే ఉండి మీనా తెచ్చిపెడుతుంటే తింటు ఉంటాడు. పాపం మీనా ఇంట్లో, ఆ కొట్టులో పని చేసి ఎంత నరకం అనుభవిస్తుందో నాకే బాధగా ఉంది అని శ్రుతి అంటుంది. నీకు సీరియల్స్‌లో డబ్బింగ్ చెప్పి అలాగే ఉంటుందని ఆలోచిస్తున్నావ్ అని రవి చెబుతాడు.

అన్నయ్య మంచి ఉద్దేశంతో కొట్టు పెట్టించాడు. నువ్ డబ్బులు ఇవ్వడం నాకే నచ్చలేదు. ఇక ఒక భర్తగా కోపం రాకుండా ఉంటుందా. అందుకే షాప్ పెట్టించాడు. అలా చేస్తే షాప్ పెట్టించడానికి కారణం నువ్వేగా. ఏదైతేనే నీ వల్ల వదినకు మంచి జరిగింది. నిన్ను ఏం అవమానించలేదు. నువ్వే అవమానంగా ఫీల్ అవుతున్నావ్ అని రవి అంటాడు. ఇంతలో వచ్చిన ప్రభావతి ఎందుకు తనతో ఎంత కోపంగా మాట్లాడుతున్నావ్. ఏమైంది అని అంటుంది.

 

నా పరువు తీస్తున్నాడు

బాలు కావాలనే చేశాడని, నన్ను అవమానించడానికే చేశాడని శ్రుతి అంటుంది. వాడినేం పట్టించుకోకు. ఇలాంటిది జరుగుతుందనే నిన్ను డబ్బులు ఇవ్వొద్దు అన్నాను. పోనీలే నీ డబ్బులు నీకు వచ్చాయనుకో అని ప్రభావతి అంటుంది. ఇక్కడ డబ్బులు మ్యాటర్ కాదు. అతను ఇన్సల్ట్ చేశాడు అని శ్రుతి అంటుంది. ఇప్పటికే ఆగట్లేదు. ఇంకా కొట్టు పెట్టించాడు. నా పరువు తీస్తున్నాడు అని ప్రభావతి అంటుంది. అందులో పరువు పోయేందుకు ఏముందని రవి అంటాడు.

ఇంట్లో ఇంత గొప్పింటి అమ్మాయిలు ఉన్నప్పుడు మనం ఎంత హుందాగా ఉండాలి. కానీ, ఆ మీనా ఏం చేసింది పోయి పోయి కొట్టు పెట్టి ఇంటి పరువు తీసింది. రోహిణి వాళ్ల నాన్న కానీ, శ్రుతి వాళ్ల అమ్మ గాని వస్తే ఏమనుకుంటారు. మనం తిండికి గతిలేక పూలు అమ్ముకుంటున్నామని అనుకుంటార్రా. సరే దాని గురించి ఏదోటి చేద్దాం కానీ నువ్ మనసులో పెట్టుకోకు అని శ్రుతికి చెప్పి వెళ్లిపోతుంది ప్రభావతి. మరోవైపు పూలకొట్టు చూసి మురిసిపోయిన మీనా నాకు మంచిరోజులు వచ్చాయనిపిస్తోంది. నాకు నచ్చిన పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను గర్వంగా పూలకొట్టు ఉందని చెప్పుకోవచ్చు అని మీనా అంటుంది.

 

అల్లుడు గారు అంతా చెప్పారే అని శ్రుతి గురించి మాట్లాడుతారు. మంచి అమ్మాయి అనుకుంటే రాను రాను ఓవర్ చేస్తుంది. అలా డబ్బులు ఇవ్వడం నాకు నచ్చలేదు. మాట్లాడనా అని మీనా చెల్లెలు అంటుంది. తను మంచి అమ్మాయే. అచ్చం బావలాగే మంచి ఉద్దేశంతో చేస్తుంది అని మీనా అంటుంది. రెండు కత్తులు ఒక వరలోనా. అయితే బావకు, ఆమెకు రోజు ఏదో గొడవ జరుగుతుండాలే అని చెల్లెలు అంటుంది. అల్లుడు గారు నీకోసం ఇవన్నీ చేస్తుంటే చాలా సంతోషంగా ఉందని పార్వతి అంటుంది.

ఓనర్ గారు ఓనర్ గారు అంటుంటే

ఇంతలో బాలు వచ్చి టిఫిన్స్ తీసుకొచ్చాను తినండి. ఇది నీకోసం స్పెషల్‌గా వేయించా మసాలా పూరి. నీకోసం ఏది తేలేదు అని ఇస్తాడు బాలు. ముందు బాలుకు దిష్టి తీయి. ఎంతమంది కళ్లు పడ్డాయో. నిన్ను కొట్టుకు ఓనర్ చేశాడు. ఆకలిగా ఉంటావని టిఫిన్ కూడా తెచ్చాడు అని పక్కింటి ఆంటీ అంటుంది. ఏదో హడావిడిగా చేశాను కానీ మీ అక్కను ఇలా చూస్తుంటే బాగుంది. ఇకనుంచి మీ అక్కను ఓనర్ గారు ఓనర్ గారు అంటుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అని బాలు అంటాడు.

 

నిన్ను చూసి ఎలా మురిసిపోతున్నాడో. ఇలాంటి భర్త దొరకడం నీ అదృష్టం అని పక్కింటి ఆంటీ అంటుంది. మీ నాన్న కూడా ఉండుంటే చాలా సంతోషించేవాడు మరొకరు అంటారు. నువ్ కొట్టుతోనే కాకుండా పెద్ద పెద్ద షాప్‌లకు ఓనర్ కావాలి. మీనా అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అనుకోవాలి అని పక్కింటి ఆంటీ అంటుంది. కట్ చేస్తే రాత్రి మీనా డబ్బులు లెక్కపెడుతుంది. కొంచెం తగ్గాయి అని మీనా అంటే బాలు లెక్కపెట్టి కరెక్ట్‌గానే ఉన్నాయే అంటాడు.

నేను కచ్చితంగా చెబుతున్నాను ఇందులో 150 తగ్గాయి అని మీనా అంటుంది. తర్వాత ఈరోజు ఖర్చులన్నీ పోను రూ. 600 లాభం అని బాలు అంటాడు. ఇంతలో ప్రభావతి వస్తుంది. అది చూసి మనకు మొదటి రోజే లాభం వచ్చింది. ఒక్కరోజే 600 లాభం వచ్చింది. మన దగ్గర డబ్బులు ఉంటే లాక్కుందామని కొన్ని గుంటనక్కలు చూస్తాయి. అంతేకాకుండా ఈ వ్యాపారం బాగుందని పోటీగా కూడా పెడతారు అని బాలు అంటుంది.

వంద షాపులకు ఓనర్

ఇంతలో వచ్చిన సత్యం మీనాకు ఇందులో బాగా అనుభవం ఉంది కదా. చూస్తూ ఉండు మీనా ఇలాంటి వంద షాపులకు ఓనర్ అవుతుంది అని అంటాడు. నేను కూడా అదే అనుకుంటున్నాను. చాలా బ్రాంచ్‌లు ఓపెన్ చేద్దామనుకుంటున్నాను. ఆరు వందల లాభం వచ్చింది నాన్న అని బాలు అంటాడు. అదేదో 600 కోట్లు అయినట్లు చెబుతారేంటీ అని ప్రభావతి అంటుంది. కష్టపడి చేసి సంపాదించింది. నీకు అర్థం కాదు. మనం మనుషులను పెట్టి పని చేయిద్దాం. అన్ని ఆర్డర్స్ తీసుకుందాం అని బాలు అంటాడు.

 

చూశారా 600 రాగానే కళ్లు నెత్తికెక్కాయి. దేశంలో ఉన్న పూలవ్యాపారం అంతా వీళ్లే చేస్తున్నట్లు ఎలా మాట్లాడుతున్నారో అని ప్రభావతి అంటుంది. వాళ్లేదో భవిష్యత్ గురించి ముచ్చట పడుతున్నారు నీకేంటీ బాధ అని సత్యం చెబుతాడు. తర్వాత ఉదయం మూడింటికి సంతకు వెళ్లి పూలు తీసుకురావాలి. కొట్టు పెడితే సరిపోతుందా పూలు మీరేకదా తీసుకురావాలి అని మీనా అంటుంది. మరి అంత పొద్దున్నే ఏంటని బాలు అంటాడు.

అయితే, ఈ 600తో సరిపెట్టుకుందామా. వ్యాపారం చేయొద్దా అని మీనా అంటుంది. అంతే అంటావా. అయితే, మీ అమ్మతో వెళ్లడం లేట్ అవుతుంది. నువ్వే రా, నచ్చిన పూలు కొనుక్కుందాం అని బాలు అంటాడు. తర్వాత లాభం గురించి మళ్లీ గొప్పగా చెబుతాడు బాలు. దాంతో ప్రభావతి నన్నే అంటున్నావని తెలిసులేరా అక్కుపక్షి అని తిడుతుంది. పదా వెళ్లి పడుకుందాం. పూలు కొనాలు అమ్మాలి డబ్బు సంపాదించాలి. నీకు నెలకు రెండు వేలు ఇచ్చారుగా. వాళ్లకు రోజుకు రెండు వేలు ఇవ్వాలి ఓకేనా. వినపడుతోంది కదా అని బాలు అంటాడు.

24 గంటల్లో మారిపోయింది

తర్వాత బాలు, మీనా ఇద్దరు వెళ్లిపోతారు. తర్వాత మీనా పూలకు దారం కడుతుంది. కాసేపు పడుకోవచ్చు కదా అంటే.. రేపు పొద్దున ఓ ఇంట్లో ఫంక్షన్ ఉంది. అందుకే అని మీనా అంటుంది. బాలు సహాయం చేస్తానంటే మీనా వద్దంటుంది. ఇద్దరు పూలకొట్టు గురించి మాట్లాడుకుంటారు. మంచి ప్లేస్‌లోనే పెట్టాం. తొందర్లోనే పెద్ద ఓనర్ అయిపోతావ్ అని బాలు అంటే.. మీనా ప్రేమగా చూస్తుంది. నిన్న ఇదే టైమ్‌కి ఇక్కడే కూర్చుని ఏంటీ నా జీవితం ఇలా అయిపోయిందని బాధపడ్డాను. కానీ, 24 గంటల్లో మారిపోయిందని మీనా అంటుంది.

 

నాలో ఉత్సాహం వచ్చింది. నాలో ధైర్యం పెరిగింది. దీనంతటికి కారణం మీరేనండి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది మీనా. అయినా ఇప్పుడేమైంది. మన పూల వ్యాపారం డెవలప్ చేయడానికి చాలా ప్లాన్స్ వేస్తున్నాను. చాలా ఏరియాల్లో షాపులు పెడుతున్నాం. ఆఫర్స్ కూడా ఇస్తున్నాం అని బాలు చెబుతాడు. ప్రభావతి పూలకొట్టు పేరు మీద ప్రాంప్లెట్‌లు కూడా పంచుతున్నాను. గవర్నమెంట్‌కు ట్యాక్స్ కట్టే పొజిషన్‌కు కూడా వస్తాం. మన రెక్కలు ఎంత ఎగిరితే అంత ఎగరాలి. ముడుచుకుని కూర్చోవద్దు అని బాలు అంటాడు.

ఇద్దరు పనోళ్లను పెట్టుకుని వాళ్లతో చేయించు అని బాలు అంటే.. పనోళ్ల మీద ఆధారపడకూడదు. ఓనర్ కూడా వళ్లు వంచి పని చేస్తేనే ఆ వ్యాపారం నిలకడగా ఉంటుంది. వృద్ధిలోకి వస్తుంది అని మీనా అంటుంది. పర్లేదే వ్యాపారంలో బాగానే మెళకువలు నేర్చుకున్నావే అని బాలు అంటాడు. మా నాన్న పూలు కడుతూనే మరోవైపు చెరుకు రసం అమ్మేవాడు. ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుందని ఆయన నమ్మకం. నేను కూడా అలాగే కష్టపడాలని అనుకుంటున్నాను అని మీనా అంటుంది.

నీ స్పీడ్‍‌ను ఎవరు ఆపలేరు

నిన్ను ఇలాగే వదిలేస్తే ప్రపంచం దృష్టి నీవైపే తిప్పుకునేలా ఉన్నావే. ఇక నీ స్పీడ్‌ను ఎవరు ఆపలేరు అని బాలు అంటాడు. మీరు నా పక్కన ఉంటే నేను ఏదైనా సాధించగలను అనిపిస్తాను. ఏదో పుణ్యం చేసుకున్నందుకే మీరు దొరికారు అని మీనా అంటుంది. తర్వాత రాత్రి నాకు నిద్రలేదు. ఇంటి ముందు పూల కొట్టు పెట్టారు కదా అని ప్రభావతి అంటుంది.

 

ఎక్కడ చోటు లేనట్లు ఇంటి ముందే కొట్టు పెట్టాడు అని మనోజ్ అంటే.. ఇంకా ఎక్కడ పెట్టాలిరా. నీ తలకాయ మీద పెట్టాలా అని బాలు అంటాడు. నేను పెద్ద కంపెనీలో పని చేస్తున్నాను. నాకోసం వచ్చినవాళ్లు ముష్టి పూలకొట్టు చూస్తే ఏమనుకుంటారు అని మనోజ్ అంటాడు. కట్ చేస్తే పార్క్‌లో ప్రాంప్లెట్ పంచడానికి వెళ్లిన బాలు అక్కడ మనోజ్‌ను చూస్తాడు. అదంతా వీడియో తీస్తాడు.

ఇదంతా ఎన్నాళ్ల నుంచి సాగుతుంది అని వాచ్‌మెన్‌ను బాలు అడుగుతాడు. రెండు మూడు నెలలు అవుతుందని వాచ్‌మెన్ అంటాడు. నువ్ ఇంటికి రారా నీకు సినిమా చూపిస్తా అని బాలు అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024