



Best Web Hosting Provider In India 2024

KTR On SLBC incident : ‘ఓట్ల వేట మాత్రమేనా..? టన్నెల్ కు వెళ్లే టైమ్ ముఖ్యమంత్రికి లేదా..?’ కేటీఆర్ ప్రశ్నలు
ఎస్ఎల్బీసీ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు సమయం ఉంది కానీ… క్షతగాత్రుల ఆర్థనాదాలతో మిన్నంటుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ కు వెళ్లే టైమ్ లేదా..? అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా? అని నిలదీశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. SLBC టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది ఆచూకీ తెలియని ఈ విపత్కర పరిస్థితుల్లోఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగితేలడం దిగజారుడు రాజకీయమేనంటూ దుయ్యబట్టారు.
రాష్ట్ర ముఖ్యమంత్రికే జరిగిన ఘోర దుర్ఘటనపై సీరియస్ నెస్ లేకపోతే, ఇక అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటది? అని కేటీఆర్ ప్రశ్నించారు. రెస్క్యూ ఆపరేషన్ ఎలా ముందుకు సాగుతదని ట్వీట్ చేశారు.
టన్నెల్ కు వెళ్లే టైమ్ లేదా…?
“ఓట్ల వేటలో జిల్లాలకు జిల్లాలు చుట్టి వచ్చేందుకు ముఖ్యమంత్రికి సమయం ఉంది కానీ.. ఒక్కసారి క్షతగాత్రుల ఆర్థనాదాలతో మిన్నంటుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ కు వెళ్లే టైమ్ లేదా? ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా ? ప్రజాపాలన అంటే నోట్ల వేట.. ఓట్ల వేట మాత్రమేనా?” అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఓవైపు సహాయక చర్యలు కొలిక్కి రాకముందే, ఇరుక్కున వారు బతికుండే అవకాశం కనిపించడం లేదని సర్కారు చేతులెత్తేస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించి, బాధితుల కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మరిచటమేంటని ఆక్షేపించారు. ఎన్నికలే తమ తొలి ఎజెండా అనే విధంగా ముఖ్యమంత్రి తీరు ఉందన్నారు. సర్కారుకు కనీస మానవత్వం కూడా లేదా ? అని కేటీఆర్ నిలదీశారు.
“రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు ఉంది. ఎనిమిది మందిని బలిపీఠం ఎక్కించి గ్రాడ్యూయేట్స్ కు గాలం వేసేందుకు సిద్ధమైన సీఎంను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాత పెడ్తారు” అని కేటీఆర్ హెచ్చరించారు.
సంబంధిత కథనం
టాపిక్