Sarangapani Jathakam: మనిషి భవిష్యత్తు ఎందులో ఉంటుందనే ప్రశ్నకు జవాబు.. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Sarangapani Jathakam: మనిషి భవిష్యత్తు ఎందులో ఉంటుందనే ప్రశ్నకు జవాబు.. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Feb 24, 2025 06:08 AM IST

Producer Sivalenka Krishna Prasad About Sarangapani Jathakam: హీరో, కమెడియన్ నటించిన లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ సారంగపాణి జాతకం. ఈ సినిమాను నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా సారంగపాణి జాతకం రిలీజ్ డేట్ ప్రకటించిన నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మనిషి భవిష్యత్తు ఎందులో ఉంటుందనే ప్రశ్నకు జవాబు.. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ కామెంట్స్
మనిషి భవిష్యత్తు ఎందులో ఉంటుందనే ప్రశ్నకు జవాబు.. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ కామెంట్స్

Producer Sivalenka Krishna Prasad About Sarangapani Jathakam: సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ వినోదాత్మక చిత్రాలకి పేరొందిన బ్యానర్ శ్రీదేవి మూవీస్. ఇప్పుడు ఈ బ్యానర్‌లో వస్తున్న సరికొత్త తెలుగు సినిమా సారంగపాణి జాతకం.

కామెడీ ఎంటర్‌టైనర్‌గా

సారంగపాణి జాతకం సినిమాకు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. అలాగే, ఫుల్ టైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సారంగపాణి జాతకం మూవీని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. సారంగపాణి జాతకం సినిమాలో ప్రియదర్శి హీరోగా నటించాడు. ప్రియదర్శికి జోడీగా రూప కొడువాయూర్ హీరోయిన్‌గా నటించింది.

సారంగపాణి జాతకం రిలీజ్

సారంగపాణి జాతకం చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టైటిల్ సాంగ్ ‘సారంగో సారంగా’, ‘సంచారి సంచారీ’ పాటలు ట్రెండ్ అవుతున్నాయి. అలాగే సారంగపాణి జాతకం టీజర్‌లోని మాటలు, హాస్య సన్నివేశాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇక తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. వేసవి సెలవుల్లో నవ్వులు పంచడానికి సిద్ధంగా ఉందని సమ్మర్‌లో సారంగపాణి జాతకం రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

భారీ అంచనాల మధ్య మూడో సినిమాగా

‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత భారీ అంచనాల మధ్య మోహనకృష్ణ ఇంద్రగంటి, శ్రీదేవి మూవీస్ కలయికలో మూడో చిత్రంగా ‘సారంగపాణి జాతకం’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సారంగపాణి జాతకం గురించి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

అద్భుతంగా తీశారు

శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ”వేసవి సెలవుల్లో కుటుంబమంతా కలిసి వెళ్లి చూసే పరిపూర్ణ హాస్యరస చిత్రం మా ‘సారంగపాణి జాతకం’. మా దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి అద్భుతంగా తీశారు. ఇటీవల విడుదలైన టీజర్‌లో ప్రేక్షకులకు మా సారంగపాణి ప్రపంచం ఎలా ఉంటుందో పరిచయం చేశాం” అని అన్నారు.

ఇంటిల్లిపాది కడుపుబ్బా నవ్వించేలా

”సినిమా చిత్రీకరణ, డబ్బింగ్ కార్యక్రమాలు సైతం పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. మనిషి భవిష్యత్తు చేతి రేఖల్లో ఉంటుందా? లేదా చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇస్తూనే ఇంటిల్లిపాదిని కడుపుబ్బా నవ్వించే వినోదాత్మక చిత్రమిది. ఆద్యంతం కట్టిపడేస్తూనే, వచ్చే ఎండలకి సాంత్వనలా అందరినీ అలరిస్తుందీ సినిమా” అని ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు.

సారంగపాణి జాతకం నటీనటులు

కాగా, సారంగపాణి జాతకం సినిమాలో ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్‌తోపాటు నరేష్ విజయకృష్ణ, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, ‘ఐమ్యాక్స్’ వెంకట్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024