



Best Web Hosting Provider In India 2024

Hit 3 Teaser: ఒరిజినల్ చూపిస్తా – వయలెంట్‌గా నాని హిట్ 3 టీజర్
Hit 3 Teaser హీరో నాని పుట్టినరోజు సందర్భంగా సోమవారం హిట్ 3 టీజర్‌ను రిలీజ్ చేశారు. రక్తపాతం, యాక్షన్ అంశాలతో ఈ టీజర్ పవర్‌ఫుల్‌గా సాగింది. గత సినిమాలకు పూర్తి భిన్నంగా వయెలెంట్ క్యారెక్టర్‌లో నాని ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు టీజర్‌లో ద్వారా మేకర్స్ హింట్ ఇచ్చారు.
Hit 3 Teaser నాని హీరోగా నటించిన హిట్ 3 మూవీ టీజర్ వచ్చేసింది. నాని బర్త్‌డే సందర్భంగా సోమవారం ఈ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. యాక్షన్, రక్తపాతంతో ఈ టీజర్ సాగింది. ఇందులో వయెలెంట్ పోలీస్ ఆఫీసర్‌గా నాని క్యారెక్టరైజేషన్ డిఫరెంట్‌గా సాగింది.
లాఠీకి దొరికినోడి పరిస్థితి…
యాక్షన్ అంశాలతోనే టీజర్ ప్రారంభమైంది. మీకు ప్రాబ్లెమ్ లేదంటే ఓ పేరు చెబుతా…అర్జున్ సర్కార్ అనే వాయిస్ ఓవర్ వినిపించింది. ఈ కేసును ఆడికి ఇవ్వడంలో ప్రాబ్లెమ్ ఏం లేదు కానీ…వీడి లాఠీకి దొరికినోడి పరిస్థితి ఆలోచిస్తేనే భయం వేస్తుంది అని రావురమేష్ చెప్పగానే గుర్రంపై లాఠీ పట్టుకొని స్టైలిష్‌గా నాని టీజర్ ఎంట్రీ ఇచ్చాడు. లాఠీతో క్రిమినల్స్‌ను తుక్కురేగ్గొడుతూ నాని కనిపించాడు.
ఒరిజినల్ చూపిస్తా…
ఫస్ట్ డే నిన్ను చూసినప్పుడే డౌట్ వచ్చింది…ఒక పోలీస్ ఆఫీసర్‌వేనా నువ్వు అని ఓ అమ్మాయి అనగానే…అదే అనుకొని మోసపోయారు ఇన్నేళ్లు జనం. మీకు చూపిస్తా ఒరిజినల్ అంటూ నాని చెప్పిన డైలాగ్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది. వైట్ బ్లేజర్ ధరించి మరో లుక్‌లో టీజర్‌లో నాని కనిపించాడు. రక్తపాతంతో టీజర్‌ను ఎండ్ చేశారు. గత సినిమాలకు పూర్తి భిన్నంగా వయోలెంట్ క్యారెక్టర్‌లో నాని ఈ మూవీలో కనిపించబోతున్నట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తుంది.
కేజీఎఫ్ ఫేమ్…
హిట్ 3 మూవీలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. హిట్ ఫ్రాంచైజ్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. ప్రశాంతి తిపిరినేనితో కలిసి నాని స్వయంగా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.
మే 1న రిలీజ్…
మే 1న వరల్డ్ వైడ్‌గా హిట్ 3 మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. హిట్, హిట్ 2 సినిమాలు కమర్షియల్‌గా పెద్ద విజయాలను సాధించాయి.. హిట్ మూవీలో విశ్వక్‌సేన్ హీరోగా నటించగా…హిట్ 2లో అడివిశేష్ కనిపించాడు. ఈ రెండు సినిమాలను కూడా నానినే నిర్మించాడు.
సుజీత్‌తో మూవీ…
హిట్ 3 తర్వాత నాని సుజీత్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే నాని నిర్మించిన కోర్టు మూవీ మార్చి 14న రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్నాడు.
హిట్ మూవీతోనే డైరెక్టర్‌గా శైలేష్ కొలను టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హిట్ 2తో పాటు సైంధవ్ సినిమాలను నిర్మించాడు. వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ డిజాస్టర్‌గా నిలిచింది.
సంబంధిత కథనం