



Best Web Hosting Provider In India 2024

Pawan Kalyan: ఐదేళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదన్న పవన్ కళ్యాణ్, ప్రజలు ఇవ్వని అధికారాన్ని జగన్ కోరలేరన్న పవన్
Pawan Kalyan: వైసీపీకి ఐదేళ్లలో ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేదని, ప్రజలు ఇవ్వని హోదాను వారు కోరలేరన్నారు. సభలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ సభ్యులు అనుసరించిన తీరును పవన్ తప్పు పట్టారు. వైసీపీ సభ్యులు సభకు వస్తే వారి స్థాయికి తగ్గట్టు సమయం కేటాయిస్తారన్నారు.
Pawan Kalyan: గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో గత ప్రభుత్వ నాయకులు చేసింది ఏ మాత్రం సబబుగా లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోయినా, అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సభకు వచ్చినందుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ పెద్దలు, ఎమ్మెల్యేలు, గవర్నర్ ప్రసంగాన్ని చించేయడం, ప్రతిపక్ష హోదా కోసం బల ప్రదర్శన చేయడాన్ని తప్పు పట్టారు.
వైసీపికి ప్రతిపక్ష హోదా అడిగితే వచ్చేది కాదని, ప్రజలు ఇస్తే వస్తుందని, అత్యధిక మెజార్టీ ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని, గతంలో ప్రభుత్వాన్ని పాలించాము కాబట్టి ప్రతిపక్షంగా గుర్తించాలంటే కుదరదన్నారు. అసెంబ్లీలో ఆ పార్టీ వ్యవహరించిన తీరు సమంజసంగా లేదన్నారు.
రెండో అతిపెద్ద పార్టీ జనసేన…
జనసేన కంటే ఒకసీటు ఎక్కువ వచ్చినా వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కేదని, ప్రస్తుతం ఏపీలో రెండో అతి పెద్ద పార్టీ జనసేన ఉందని, వైసీపీది సరైన విధానం కాదని, దానిని ప్రజలు తెలుసుకోవాలని, ప్రతిపక్ష హోదా రావడం ఎలా సాధ్యమన్నారు.
21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందన్నారు. ప్రతిపక్ష హోదా రాకున్నా, ప్రజలు వైసీపీకి 11 సీట్లు ఇచ్చారని, వారి స్థాయికి తగ్గట్టు ప్రశ్నలు అడిగే అవకాశం ఇస్తారని, గతంలో ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్ సమయం ఇచ్చారని, సభకు జగన్ రావడానికి అనుమతించారని గుర్తు చేశారు.
ఐదేళ్లలలో ప్రతిపక్ష హోదా రాదు…
వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని, లోటుపాట్లు ఉంటే సభలో చెప్పాలన్నారు. వైసీపీ వ్యవహార శైలి సమంజసంగా లేదని, సభలోకి రాగానే గొడవ పెట్టుకోవాలనుకోవడం సరికాదని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని, 11 సీట్లతో ప్రతిపక్ష ఇవ్వరని, చంద్రబాబు, జనసేన నిర్ణయించేది కాదని, దానికి రూల్స్, నియమ నిబంధనలు ఉన్నాయని పవన్ స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయంలో, పార్లమెంటరీ పక్షంలో ఎన్డీఏ నాయకుడిని ఎన్నుకునే సమయంలో ప్రధానితో పాటు జనసేన పార్టీ నాయకుడిగా తాను కూర్చొన్నానని, అదే సమయంలో మంత్రిగా ప్రమాణం చేసేటపుడు ప్రధాని పక్కన కూర్చోబెట్టలేదని.. డిప్యూటీ సీఎంగా, మంత్రిగా ప్రమాణం చేసే సమయంలో ప్రధాని పక్కన కూర్చోబెట్టలేదని మంత్రులతో పాటే కూర్చోబెట్టారని గుర్తు చేశారు.
నాకు ప్రోటోకాల్ ఉండదు… మంత్రులతో సమానమే..
అసెంబ్లీకి వచ్చినపుడు స్పీకర్ తనను రావాలని పిలిచినా తాను ఆయనతో పోలేదని, డిప్యూటీ సీఎంకు ప్రోటోకాల్ లేదని, వైసీపీకి కూడా ప్రోటోకాల్ రాదని, ప్రజలు దానిని ఇవ్వలేదన్నారు. వారిని అవమానించాలని, తగ్గించాలని లేదని 175 సీట్లలో 11 సీట్లు మాత్రమే వారికి ఇచ్చారన్నారు.
తనకు ప్రోటోకాల్ విషయం మీద అవగాహన ఉందన్నారు. డిప్యూటీ సీఎంకు ప్రోటోకాల్ ఉండదని, తానే దానిని బ్రేక్ చేయనని, వైసీపీ వారు కూడా హోదా ఇవ్వడం కుదరదని గుర్తించాలన్నారు. వైసీపీ చెబుతున్నట్టు చేయాలంటే వారు జర్మనీ వెళ్లాలని, అలాంటి వెసులుబాటు రాజ్యాంగంలో లేదని, వాళ్లు అలాగే కావాలని పట్టుబడితే జర్మనీ వెళ్లాలన్నారు.
సంబంధిత కథనం
టాపిక్